ఫ్యాక్ట్ చెక్: అమరావతిలో రోబోలతో వ్యవసాయం చేయిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
వరి పొలంలో రోబోట్ కోత పనులు చేస్తున్నట్లు చూపించే;

కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు పనులు జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం 'క్వాంటం వ్యాలీ'ని ఏర్పాటు చేస్తుందని, లోతైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఐఐటి-మద్రాస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐబిఎం, భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వంటి కీలక భాగస్వాములతో సహకారం తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు .ఐఐటి-మద్రాస్‌లోని ప్రతిష్టాత్మక నాలుగు రోజుల పరిశోధనా స్కాలర్ల సమ్మిట్‌లో ప్రముఖ వక్తలలో ఒకరైన చంద్రబాబు నాయుడు, సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్ స్ట్రీట్‌లలో భారతీయులు ఎలా ఆధిపత్యం చేస్తున్నారో హైలైట్ చేశారు. 2047 నాటికి భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సమాజంలో నిలుస్తారని చెప్పారు.
అమరావతిలో పలు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో నుంచి రుణం మంజూరు అయింది. పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. ఏప్రిల్ తొమ్మిదిన శంకుస్థాపన జరగనుంది. ఇప్పటికే సొంతింటి నిర్మాణం కోసం అమరావతిలోని వెలగపూడి గ్రామ పరిధిలో ఇంటి కోసం 5 ఎకరాలను ముఖ్యమంత్రి కుటుంబం కొనుగోలు చేసింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ కి రెండు కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు నివాసం నిర్మిస్తున్నారు.
అయితే ఒక రోబో పొలంలో పని చేస్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అమరావతిలో రోబోట్ లతో వ్యవసాయం చేయడం మొదలైందంటూ పోస్టు వైరల్ అవుతూ ఉంది. 11000కు పైగా లైక్స్ వచ్చాయి.
అయితే ఒక రోబో పొలంలో పని చేస్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అమరావతిలో రోబోట్ లతో వ్యవసాయం చేయడం మొదలైందంటూ పోస్టు వైరల్ అవుతూ ఉంది. 11000కు పైగా లైక్స్ వచ్చాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు.
వైరల్ అవుతున్న వీడియోను గతంలో పలు దేశాలలో రోబో ద్వారా పనులు చేయిస్తున్నారనే ప్రచారం జరిగింది.
Discover Agriculture అనే యూట్యూబ్ ఛానల్ లో The Future of Agriculture: Meet the Rice Harvesting Robot! #farming #agriculture అనే టైటిల్ తో అదే వీడియోను పోస్టు చేశారు. జనవరి 27, 2024 లో వీడియోను అప్లోడ్ చేశారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాలేదు.
BLUE CHEMP AGRO PRIVATE LIMITED అనే యూట్యూబ్ ఛానల్ లో మార్చి 5, 2024న ఇదే వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలను నిశితంగా పరిశీలించగా ఆ రోబో చుట్టూ ఇమేజ్ కాస్తా బ్లర్ గా అనిపిస్తోంది. AI సాధనాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో వేగవంతమైన పురోగతితో పాటూ, సృజనాత్మక కల్పన ఉన్న ఎవరైనా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను రూపొందించవచ్చు. అయితే, కొన్ని తప్పుదారి పట్టించే కథనాలలో భాగం అవుతాయి.
వైరల్ క్లిప్‌ను నిశితంగా పరిశీలించినప్పుడు, రోబోల కదలికలలో అనేక వైవిధ్యాలను మేము గమనించాము. పలు సందర్భాల్లో, రోబోట్ కాళ్ళు నేలను తాకనట్లు కనిపించాయి. రోబోట్ శరీరం చుట్టూ ఉన్న ప్రాంతం అస్పష్టంగా కనిపించింది, ఇవి అసలు ఫుటేజ్‌కు ఎడిట్ చేసినట్లుగా భావించవచ్చు.
ఇదే వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేయగా, పలువురు ఈ వీడియోను వండర్ స్టూడియో అనే ఏఐ టూల్ ద్వారా సృష్టించారని తెలిపారు.
How to use Wonder Studio for beginners (like me) అనే టైటిల్ తో AI Video School అనే యూట్యూబ్ పేజీలో చిన్న టెక్నీక్ ద్వారా రోబో యానిమేషన్ ను ఎలా సృష్టించారో చూపించారు.
వండర్ స్టూడియో ద్వారా లైవ్-యాక్షన్ విజువల్స్ ను మార్చవచ్చు. ఈ వీడియోలో వండర్ స్టూడియోని ఉపయోగించి సృష్టించిన వీడియోలకు సంబంధించిన అనేక అంశాలను చర్చించింది, కొన్ని సంక్లిష్టమైన మానవ కదలికలను కూడా ఇందులో ఎడిట్ చేయొచ్చని వివరించారు.
వైరల్ అవుతున్న వీడియో ఏఐ సృష్టి అంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ కూడా చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వరి పొలంలో రోబోట్ కోత పనులు చేస్తున్నట్లు చూపించే వీడియో ఒరిజినల్ ఫుటేజ్ కాదు. మానవ కదలికలను రోబోటిక్‌గా యానిమేషన్ గా మార్చి రూపొందించిన వీడియో. ముఖ్యంగా ఈ వీడియోకు అమరావతికి ఎలాంటి సంబంధం లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ వీడియోను డిజిటల్ గా సృష్టించారు
Claimed By : Social Media Users
Fact Check : False