ఫ్యాక్ట్ చెక్ :ప్రజాగళం మీటింగ్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఎగతాలి చేయలేదు
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కూటమి అభ్యర్థుల తరపున ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.;
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 మంది సభ్యులను ఎన్నుకోవడానికి మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4, 2024న ప్రకటించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కూటమి అభ్యర్థుల తరపున ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉమ్మడి బహిరంగ సభలకు ప్రజాగళం బహిరంగ సభలు అని కూడా పేరు పెట్టారు.
ఈ నేపథ్యంలో వేదికపై ఇరువురు నేతలూ ఉండగా.. చంద్రబాబు నాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో, టీడీపీ నాయకుడు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తలపై రూపాయి ఉంచినా పావలాకి కూడా అమ్ముడు పోడని చెప్పడం వినొచ్చు. సీనియర్ నేత చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజలు షాక్ అవుతూ ఉన్నారు.
“నెత్తిమీద రూపాయి పెడితే పావలాకి కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్: చంద్రబాబు” అంటూ వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జనసేన అధినేతపై టీడీపీ అధినేత కించపరిచే ప్రకటనలు చేయలేదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకున్నాం. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించాము. అనేక తెలుగు టెలివిజన్ ఛానెల్‌లు ప్రజాగళం బహిరంగ సభలను ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ బహిరంగ సభ ఏప్రిల్ 24, 2024న విజయనగరం జిల్లాలో జరిగింది, అక్కడ జరిగిన సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. న్యూస్ ఛానెల్స్ లైవ్ స్ట్రీమ్‌లలో టీడీపీ అధినేత అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా మాకు కనిపించలేదు. అందులో ఇద్దరు నాయకులు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు చేసిన కించపరిచే వ్యాఖ్యలు ఒరిజినల్ విజువల్స్ లో లేవు.
వారాహి న్యూస్ :
టీవీ 5 న్యూస్
టీవీ9
etemaaddaily అనే వెబ్‌సైట్ ప్రకారం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలను ఈ కథనంలో చూడొచ్చు. అయితే, వైరల్ వీడియోలో కనిపించే అవమానకరమైన వ్యాఖ్యలను నివేదించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు సంబంధించిన వైరల్ విజువల్స్ ను చూశాం. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఆడియోను ఎడిట్ చేశారు. అసలైన లైవ్ వీడియోలో ఈ అభ్యంతకరమైన వ్యాఖ్యలు లేవు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భారీ జన సమూహంలో పవన్ కళ్యాణ్ ని పనికిరాని వ్యక్తి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవమానించారు
Claimed By : Facebook Users
Fact Check : False