ఫ్యాక్ట్ చెక్: నకిలీ జీడిపప్పును తయారు చేస్తున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేసే అంతగా, నకిలీ జీడి పప్పు తయారు చేస్తున్నారు. పెళ్ళిలో ఫంక్షన్స్ లో లొట్టలు వేసి మరి వాయిన్ షాప్ లో తింటాము అవి నకిలి..... ఇదిగో ఇలా తయారు చేసి మనకి వడ్డిస్తున్నారు.;
“మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేసే అంతగా, నకిలీ జీడి పప్పు తయారు చేస్తున్నారు. పెళ్ళిలో ఫంక్షన్స్ లో లొట్టలు వేసి మరి వాయిన్ షాప్ లో తింటాము అవి నకిలి..... ఇదిగో ఇలా తయారు చేసి మనకి వడ్డిస్తున్నారు.*” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నకిలీ జీడిపప్పును తయారు చేస్తున్నాడంటూ ఓ వ్యక్తి వంటకాన్ని తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ కృత్రిమంగా తయారు చేసిన జీడిపప్పులు వివాహాలు, ఫంక్షన్లలో వడ్డిస్తారని.. వాటిని నిజమైన జీడిపప్పుగా మనం భావిస్తామని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
నకిలీ జీడిపప్పు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఆ వాదనే తప్పు.కృత్రిమ జీడిపప్పు తయారీ అంటూ వీడియోలో చూపిస్తున్నారనే వాదన తప్పు. ఉత్తర భారతదేశంలో ప్రముఖంగా అమ్ముడయ్యే జీడిపప్పు ఆకారపు చిరుతిండి తయారీకి సంబంధించిన వీడియో ఇది.వైరల్ అవుతున్న వీడియోలో ‘Spoons of Indore’ అని ఉంది. ఆ వీడియో మార్చి 16, 2023న ఫేస్‌బుక్ పేజీలో అప్లోడ్ చేశారు. “కృత్రిమ కాజును ఎలా తయారు చేస్తారు” అనే శీర్షికతో ప్రచురించారని మేము కనుగొన్నాము.మరింతగా శోధించినప్పుడు, 2020 సంవత్సరంలో చేసిన ఫ్యాక్ట్ చెక్ లను మేము కనుగొన్నాము. గతంలో కూడా జీడిపప్పును మెషిన్ సహాయంతో తయారు చేస్తారనే వాదన వైరల్ అయింది. అయితే ఆ యంత్రం జీడిపప్పు ఆకారంలో ఉండే బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు రుజువైంది.వీటిని మనం క్యాషూ బిస్కెట్లు అని అంటాం. ఆన్ లైన్ లో కూడా దొరుకుతూ ఉంటాయి.ఆన్‌లైన్‌లో జీడిపప్పు ఆకారపు బిస్కెట్‌ల కోసం వెతుకుతున్నప్పుడు, వాటి తయారీని చూపించే అనేక వీడియోలను మేము కనుగొన్నాము. ఈ వీడియోలలో, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి అనుసరించిన విధానాన్ని చాలా మంది కూడా అనుసరిస్తున్నట్లు మనం చూడవచ్చు.
Claim : Man in video preparing artificial cashew nuts
Claimed By : Social Media Users
Fact Check : False