నిజ నిర్ధారణ: తప్పుడు కధనంతో వైరల్ అవుతున్న వివాహ కామిక్ డ్రామా
వివాహ వేడుకలో వధూవరుల మధ్య గొడవ జరిగినట్టు చూపే వీడియో వైరల్ అవుతోంది, ఇది నిజంగా జరిగిన సంఘటన అంటూ సొషల్ మీడియా లో షేర్ అవుతోంది.
వివాహ వేడుకలో వధూవరుల మధ్య గొడవ జరిగినట్టు చూపే వీడియో వైరల్ అవుతోంది, ఇది నిజంగా జరిగిన సంఘటన అంటూ సొషల్ మీడియా లో షేర్ అవుతోంది. వీడియోలో, వరుడు ఫోటోషూట్‌లో నిమగ్నమై ఉండగా, వధువు అతనికి స్వీట్ తినిపించడానికి ప్రయత్నిస్తుంది. వరుడి నిర్లక్ష్యంతో కోపోద్రిక్తురాలైన వధువు బలవంతంగా అతని నోటిలోకి స్వీట్‌ను తోస్తుంది.
హిందీలో ఉన్న క్లెయిం ""*विवाह ब्रेकिंग न्यूज़* *सावधान रहें, सर्तक रहें मित्रों शादी का सीजन चल रहा है, जरूरत से ज्यादा फोटो शूट पर ध्यान ना दें नहीं तो मंहगा पड़ सकता है जनहित में जरूरी सुचना #MarriedAtFirstSight" ఇలా ఉంది.
అనువదించగా, ఇది "*పెళ్లి బ్రేకింగ్ న్యూస్* జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి మిత్రులారా, పెళ్లిళ్ల సీజన్ జరుగుతోంది, ఫోటోషూట్ పై అధికంగా దృష్టి పెట్టవద్దు. లేకుంటే చాలా ఖరీదైన తప్పుగా మారుతుంది. ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమైన సమాచారం"
నిజ నిర్ధారణ:
వీడియో డ్రామా సిరీస్‌లో భాగం కనుక వాదన అవాస్తవం.
వీడియో కుడి ఎగువ మూలలో, "AVI Music" లోగో చూడవచ్చు. ఈ సూచనను తీసుకొని, వీడియో కీఫ్రేమ్‌లను "AVI Music" అనే కీవర్డ్‌లతో పాటు శోధించాము.
AVI Music లోగో 'మిథిలాస్ నెం.1 కామెడీ ఛానెల్' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్ ఛానెల్ ఆవీ మ్యూజిక్‌కు దారితీసింది.
ఛానెల్ లో మైథిలీ భాషలో అనేక కామిక్ వీడియోలు ఉన్నాయి. వైరల్ వీడియో ఏప్రిల్ 5, 2022న ఆ ఛానెల్లో ప్రచురించిన సుదీర్ఘ వీడియోలోని ఒక భాగం. వీడియో పేరు 'స్వయంబర్ మే దుల్హా దుల్హిన్ కే భెలై ఝగ్దా'.
పెళ్లి వేడుకలో జరిగిన కామెడీ అని టైటిల్ స్పష్టంగా పేర్కఒనడం గమనించవచ్చు. ఈ వీడియో చాలా ప్రజాదరణ పొందింది, వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ ఉన్నాయి.
యూట్యూబ్ వీడియోలో 2.50 నిమిషాల నుంచి వైరల్ సీక్వెన్స్ చూడొచ్చు. వీడియోకు సంబంధించిన వివరణ ఉంది కానీ సినిమా నిర్మాణంలో పనిచేసిన ఆర్టిస్టులు, సిబ్బంది పేర్లు తప్ప ఇంక ఏమి లేవు.
ఛానెల్ అబౌట్ పేజీ ఆ చానల్ వినోదం, అవగాహన కోసం మైథిలీ భాషలో వీడియోలను హోస్ట్ చేస్తుందని పేర్కొంది.
వైరల్ వీడియోలో చూసిన అదే కళాకారులతో ఛానెల్‌లో అనేక కామిక్ స్కిట్‌లను చూడొచ్చు.
అందువల్ల, మైథిలీ భాషలో కామెడీ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన కామిక్ స్కిట్ వీడియోను నిజమైన సంఘటనగా వైరల్గా షేర్ చేస్తున్నరు . వాదన అవాస్తవం.