ఫ్యాక్ట్ చెక్: సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ దాటేస్తాడనే భయం పట్టుకుందంటూ గిల్ క్రిస్ట్ చెప్పలేదు

సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ దాటేస్తాడనే భయం పట్టుకుందంటూ గిల్ క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన

Update: 2023-09-28 03:06 GMT

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ రికార్డులను పోల్చుతూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారనే వాదన వైరల్ అవుతూ ఉంది. "ఈ రోజుల్లో కోహ్లికి రెగ్యులర్‌గా విశ్రాంతిని ఇస్తున్నారు.. సచిన్ రికార్డ్‌ను అజేయంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను" ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పినట్లుగా పోస్టులు వైరల్ చేస్తున్నారు.





ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వైరల్ పోస్టుకు సంబంధించి మేము కీవర్డ్ సెర్చ్ చేశాం. అయితే ఈ ప్రకటన ఎక్కడా కూడా ఆడమ్ గిల్ క్రిస్ట్ చేయలేదని మేము గుర్తించాం.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. కానీ ఈ ప్రకటన గురించి ఎటువంటి నివేదికలను కూడా కనుగొనలేకపోయాము. గిల్‌క్రిస్ట్ స్వయంగా వైరల్ అవుతున్న పోస్టుపై స్పందించి.. తాను అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని అన్నారు.
"నేను ఆ మాట ఎప్పుడూ చెప్పలేదు" అంటూ ఆడమ్ గిల్ క్రిస్ట్ చేసిన ప్రకటనను 'ఎక్స్' ఖాతాలో గుర్తించాం.


అదే ప్రకటనను దక్షిణాఫ్రికా క్రికెటర్ AB డివిలియర్స్‌ కూడా చేశారనే వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే డివిలియర్స్ ఈ ప్రకటన చేశాడని నిరూపించడానికి మేము ఎటువంటి విశ్వసనీయ నివేదికను కనుగొనలేకపోయాము.


ఇటీవల జరిగిన 2023 ఆసియా కప్ తర్వాత ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌పై వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో కోహ్లీ తన 47వ సెంచరీని సాధించాడు. కోహ్లి మరో రెండు సెంచరీలు సాధించితే, అతను టెండూల్కర్ రికార్డును చేరుకుంటాడు. ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీ కొన్ని మ్యాచ్‌లలో రెస్ట్ ఇవ్వడంతో.. టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కోల్పోయాడంటూ కొందరు అభిమానులు ఇలాంటి వదంతులను వైరల్ చేస్తూ ఉన్నారు.

కోహ్లి, టెండూల్కర్‌లను పోలుస్తూ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇలాంటి ప్రకటన చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది.


Claim :  Former Australian cricketer Adam Gilchrist states Virat Kohli has not been playing as much due to the probability of him breaking Tendulkar's record.
Claimed By :  Social media Users
Fact Check :  False
Tags:    

Similar News