నిజ నిర్ధరణ: ఆసియా కప్ ట్20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినందుకు దుబాయ్ షేక్‌లు సంబరాలు చేసుకున్నారా?
ఆసియా కప్ టి20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తర్వాత, దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. భారత్ విజయంపై సోషల్ మీడియా మీమ్స్ తో నిండిపోయింది.
ఆసియా కప్ టి20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తర్వాత, దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. భారత్ విజయంపై సోషల్ మీడియా మీమ్స్ తో నిండిపోయింది. కొంతమంది నెటిజన్లు అభ్యంతరకరమైన మీమ్‌లను పంచుకోగా, చాలా మంది రెండు జట్ల క్రికెటర్ల క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించారు.
ఇంతలో, కొంతమంది యూజర్లు భారత్ విజయాన్ని చూసి దుబయి షేక్‌లు సంబరాలు చేసుకుంటున్నారంటూ వీడియో తెలుగులో క్యాప్షన్‌తో వైరల్ అవుతోంది.
"#AsiaCup2022 పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన సందర్భంగా స్టేడియం లో దుబాయ్ షేక్ ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది"
ఆంగ్లం లో: Forget Indians, Dubai Sheikhs were also happy when INDIA WON the match yesterday. అంటూ వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
క్లెయిం అవాస్తవం. వీడియో ఎడిట్ చేయబడినది, క్రికెట్ మ్యాచ్ వీడియో, అరబ్ షేక్‌లు సంబరాలు జరుపుకునే వీడియో వేర్వేరు.
జాగ్రత్తగా గమనించినప్పుడు, స్టేడియం విజువల్స్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌గా పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది. క్రికెట్ ప్లేయర్‌లను చూపించే విజువల్స్ స్టేడియం ప్రేక్షకులతో నిండి ఉంది, అయితే షేక్‌లను చూపించే స్టేడియం విజువల్స్ ప్రేక్షకులు లేరు.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, వైరల్ వీడియోలో కనిపించే షేక్ చిత్రాన్ని గోల్జ్.కామ్ అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అబ్దుల్ అజీజ్ అషూర్. వెబ్‌సైట్ ప్రకారం, అతను కువైట్‌లోని సాకర్ టీమ్‌లో మేనేజర్ హోదాలో ఉన్నాడు.
ఈ సమాచారాన్ని క్యూగా తీసుకొని, అతని పేరును కీవర్డ్‌లుగా ఉపయోగించి శోధించగా అబ్దుల్ అజీజ్ అషూర్ అల్-అరబీ స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ అని తెలుస్తోంది.
అరబ్‌టైమ్ ఆన్‌లైన్‌లో ప్రచురించిన ఒక కథనం కువైట్ ఇంటర్నేషనల్ బ్యాంక్, అల్-అరబీ స్పోర్ట్స్ క్లబ్ అధికారుల చిత్రాన్ని చూపుతుంది, ఇందులో వైరల్ వీడియోలో కనపడిన షేక్‌ను కూడా చూడవచ్చు.
2020లో జరిగిన అమీర్ కప్‌లో అల్-అరబీ స్పోర్ట్స్ క్లబ్ ఫుట్‌బాల్ జట్టు ఫైనల్స్‌ను గెలుచుకున్నట్లు కథనం పేర్కొంది.
Kuna.net.kwలోని కథనం ప్రకారం, అమీర్ ఫుట్‌బాల్ కప్ లో అల్-అరబీ స్పోర్ట్స్ క్లబ్ విజయాన్ని వివరిస్తుంది.
మరింత శోధించగా, కువైట్‌లోని ఒక జర్నలిస్ట్ అరబిక్ భాషలో చేసిన ట్వీట్ లో అదే వీడియోను చూడవచ్చు. అనువాదం చేయగా "నేను చివరి నిమిషంలో ఫోన్‌ని ఆన్ చేసి, అరబ్ క్లబ్ ప్రెసిడెంట్ అజీజ్ అషూర్ వైపు కెమెరాను తిప్పాను. బోర్డ్ డైరెక్టర్లు, బోర్డు సభ్యులకు అభినందనలు, కువైట్‌కు కష్టం"
అందువల్ల, ఆసియా కప్ ట్20 క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినందుకు దుబాయ్ షేక్‌లు సంబరాలు చేసుకుంటున్నట్లు వీడియో చూపిస్తోందనే వాదన తప్పు. షేర్ చేసిన వీడియో ఎడిట్ చేసినది, అల్-అరబీ స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ తన ఫుట్‌బాల్ జట్టు విజయాన్ని జరుపుకుంటున్న వీడియో తప్పుడు క్లెయిం తో షేర్ చేసారు.