ఫ్యాక్ట్ చెక్: బాధితురాలి శవాన్ని నిశ్శబ్దంగా తరలించడాన్ని రాజకీయ నాయకులు, వైద్యులు అడ్డుకున్నారా?

కోల్‌కత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన ఈ సంఘటన.. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వైద్యుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది.

Update: 2024-08-26 11:36 GMT

Youth leaders

కోల్‌కత్తాలోని ఆర్‌ జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన ఈ సంఘటన, ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వైద్యుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు, మహిళా సంఘాల నుండి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అత్యవసర సేవలు మినహా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు నిలిపివేశారు.

సంజయ్ రాయ్ అనే 33 ఏళ్ల వ్యక్తికి ఈ నేరంతో సంబంధం ఉన్నట్లు ఆధారాలతో సహా అరెస్టు చేశారు. అతడిని సెప్టెంబర్ 6, 2024 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సీబీఐ ప్రకారం, విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
ఇంతలో, అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తరలిస్తున్న కారును వైద్యులు ఆపివేశారని.. వాహనానికి అడ్డుగా నిలబడ్డారంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక సీపీఎం నాయకుడు, ఆసుపత్రిలోని ఇతర వైద్యులు కూడా కారును ఆపారు. ఈ సంఘటన గురించి మొదట ఎవరికీ తెలియదు అంటూ వాదిస్తూ ఉన్నారు.
పలువురు ఎక్స్ యూజర్లు “This was the moment when CPIM leader Meenakshi Mukhopadhyay and Doctors from RG Kar Hospital stopped the car that was transporting the body of Moumita Debnath. Had they not stopped the car at that moment, we might never have known about this incident this case would have been a suicide case today. “ అంటూ పోస్టులు పెట్టారు. బాధితురాలి మృతదేహాన్ని తరలిస్తున్న కారును సీపీఐఎం నాయకురాలు మీనాక్షి ముఖోపాధ్యాయ, ఆర్‌జీ కర్ ఆస్పత్రి వైద్యులు ఆపిన క్షణం ఇది. వారు ఆ సమయంలో కారు ఆపకపోతే, ఈ సంఘటన గురించి మనకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు. ఈ కేసు ఈ రోజు ఆత్మహత్య కేసుగా ప్రచారం జరిగి ఉండేది అంటూ ఎక్స్ పోస్టుల్లో తెలిపారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ సంఘటన జరిగిన తర్వాత బాధితురాలి మృతదేహాన్ని తరలించడాన్ని నాయకులు, వైద్యులు ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు వైరల్ వీడియో చూపలేదు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు, యువకులు చేపట్టిన నిరసన ప్రదర్శనకు సంబంధించింది.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేశాం. ఆగస్టు 10, 2024న CPI (M) సోషల్ మీడియా ఖాతాలలో ప్రచురించిన పోస్ట్‌లను మేము కనుగొన్నాము.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇనిడా (మార్క్సిస్ట్) ఫేస్‌బుక్ పేజీ ఆగస్టు 10, 2024న 'పశ్చిమ బెంగాల్: ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థులు, యువకులు నిరసన చేపట్టారు. ' అని 
షేర్ చేసారు

నిరసనకారులు అనేక ప్రశ్నలను లేవనెత్తారు: మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలించే ప్రయత్నం ఎందుకు జరిగింది? అనుమానాస్పద మరణం సంభవించిన ఆసుపత్రిలోనే శవపరీక్ష ఎందుకు నిర్వహించారు? వామపక్ష విద్యార్థి-యువ నాయకత్వంతో మాట్లాడకుండా మృతురాలి కుటుంబాన్ని ఎందుకు అడ్డుకున్నారు? ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు యంత్రాంగం ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది? కుటుంబంతో మాట్లాడేందుకు ప్రయత్నించిన వామపక్ష కార్యకర్తలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? జూనియర్ డాక్టర్ మృతిపై తక్షణమే సమగ్ర విచారణ జరగాలి. మరణానికి నిజమైన కారణం బయటపెట్టాలి. బాధ్యులను శిక్షించాలి.' అంటూ పోస్టు పెట్టారు.
Full View
ఇది వారి X ఖాతాలో కూడా షేర్ చేశారు.
‘ఆర్‌జి కర్ హాస్పిటల్ ఆవరణలో సిపిఐ(ఎం) నిరసన’ శీర్షికతో సరబ్ మీడియా న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన అదే వీడియోను కూడా మేము కనుగొన్నాము.
Full View
అందువల్ల, అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేతలు, వైద్యులు నిరసనలు చేపట్టారని వైరల్ వీడియోలో ఉంది. బాధితురాలి శవాన్ని నిశ్శబ్దంగా తరలించడాన్ని అడ్డుకున్నారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 
Claim :  ఘటన అనంతరం పలువురు నాయకులు, వైద్యులు బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రి దాటకుండా అడ్డుకున్నారు
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News