ఫ్యాక్ట్ చెక్: మొబైల్ ఫోన్ ఓటీపీని ఉపయోగించి ఈవీఎంలను మానిప్యులేట్ చేయలేరు
ముంబై నార్త్-వెస్ట్ నియోజకవర్గంలో ఉద్ధవ్ థాకరే పార్టీ సభ్యుడు అమోల్ కిటికర్‌పై ఏకనాథ్ షిండే శివసేన పార్టీ సభ్యుడు రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్ రోజున – జూన్ 4, 2024న కౌంటింగ్ స్టేషన్‌కి మొబైల్ ఫోన్ తీసుకెళ్లినందుకు రవీంద్ర వైకర్ బంధువుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబై నార్త్-వెస్ట్ నియోజకవర్గంలో ఉద్ధవ్ థాకరే పార్టీ సభ్యుడు అమోల్ కిటికర్‌పై ఏకనాథ్ షిండే శివసేన పార్టీ సభ్యుడు రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్ రోజున – జూన్ 4, 2024న కౌంటింగ్ స్టేషన్‌కి మొబైల్ ఫోన్ తీసుకెళ్లినందుకు రవీంద్ర వైకర్ బంధువుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని గోరేగావ్‌లోని ఓ కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లాడన్న ఆరోపణలపై మంగేష్ పాండిల్కర్‌పై ముంబైలోని వాన్రాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌లో ఉన్న డేటాను రికవరీ చేయడానికి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. అధికారిక ఆదేశాలను ధిక్కరించినందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఈవీఎం మెషీన్‌ను అన్‌లాక్ చేయడానికి మొబైల్ ఫోన్ OTPని ఉపయోగించారంటూ మిడ్‌డే ఓ నివేదికను ప్రచురించింది. ఈ నివేదికను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. “EVM టాంపరింగ్ డొంక కదిలింది. ఇద్దరి ముసలోళ్ల జీవితాలు జైల్లో ముగిసేతట్టు ఉంది దొంగలు తప్పించుకోలేరు.” అంటూ పోస్టులు పెడుతున్నారు. రవీంద్ర వాయాకర్ బంధువులు మొబైల్ ఫోన్‌లో OTPని ఎంటర్ చేసి EVMని టాంపర్ చేశారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. EVMలలో ప్రత్యేకమైన, స్వతంత్ర వ్యవస్థ ఉంటది. వీటిని అన్‌లాక్ చేయడానికి OTP అవసరం లేదు.
మేము తదుపరి నివేదికలను వెతకగా.. ముంబై సబర్బన్ రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ వివరణను చూశాం. "ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి OTP అవసరం లేదు. ప్రోగ్రామబుల్ డివైజ్ కాదు కాబట్టి EVMని అన్‌లాక్ చేయడానికి మొబైల్ OTP అవసరం లేదు" అని ANI చేసిన ట్వీట్‌ని మేము కనుగొన్నాము. EVMలో ఎలాంటి కమ్యూనికేషన్ పరికరం లేదని తెలిపారు.
ది వైర్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం: రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ టాంపరింగ్ ఆరోపణలను ఖండించారు. ఈవీఎం మెషీన్లు లాక్ చేయడానికి OTP అవసరం లేదని సూర్యవంశీ వివరించారు. “ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి మొబైల్‌లో OTP అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ చేయదగినది కాదు. దీనికి వైర్‌లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు లేవు. ఒక వార్తాపత్రిక కథనం పూర్తిగా అబద్ధం, దీనిని కొందరు నాయకులు తప్పుడు వార్తలను సృష్టించడానికి ఉపయోగిస్తున్నారు.
సూర్యవంశీ ఇంకా ఇలా అన్నారు: "OTP జనరేట్ చేయాలంటే ENCORE, ఆన్‌లైన్ డేటా కంపైలేషన్ సిస్టమ్‌కి సంబంధించినది. ఇది ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లోని డేటాను నవీకరించడానికి మాత్రమే పరిమితం చేశారు." సిస్టమ్‌లోకి డేటాను ఇన్‌పుట్ చేయడానికి, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో కొంతమంది వ్యక్తులు ఈ కంపైలేషన్ సిస్టమ్‌ను యాక్సెస్ చేయగలరని సూర్యవంశీ పేర్కొన్నారు. "మా అధికారి ఒకరు ఉపయోగించిన మొబైల్ అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరం. మేము ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసాము" అని ఆమె తెలిపారు.
మిడ్-డే స్టోరీ వాదనలను ఖండిస్తూ వాన్రాయ్ పోలీస్ స్టేషన్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. “వార్తా నివేదిక ద్వారా తప్పుడు కథనాలను ప్రసారం చేసి అనవసర గందరగోళానికి కారణమవుతున్నారు. ఈ గందరగోళానికి కారణమైన మీడియా సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటాం" అని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఎలాంటి ఈవీఎం ట్యాపరింగ్ చేయలేదని.. కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా మాత్రమే మొబైల్ ఫోన్ లను ఉపయోగించారనే వాదన జరుగుతూ ఉంది.
ఎన్‌డిటివి నివేదిక ప్రకారం, ఈవీఎంల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, భారత ఎన్నికల వ్యవస్థలో సందేహాలు సృష్టించడంలో భాగమైన మిడ్-డే వార్తాపత్రికకు రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేసినట్లు EC తెలిపింది.
"EVMలు వైర్‌లెస్ కనెక్టివిటీ లేకుండా ఉంటాయి. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలోనే ప్రతిదీ జరుగుతుంది" అని EC తెలిపింది. ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) లెక్కింపు భౌతిక రూపంలో (పేపర్ బ్యాలెట్) జరుగుతుందని ఈసీ వివరణ ఇచ్చింది.
ముంబై సబర్బన్ డిస్ట్రిక్ట్ ఎన్నికల అధికారి చేసిన ట్వీట్‌ను చూడొచ్చు.
కాబట్టి, మొబైల్ ఫోన్ OTPని ఉపయోగించి EVM యంత్రాలను ట్యాంపరింగ్ చేయవచ్చనే వాదనలో ఎలాంటి నిజం లేదు. EVMలు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించి టాంపర్ చేయలేని యంత్రాలు.
Claim : మొబైల్ ఫోన్ OTPని ఉపయోగించి EVMలను ప్రభావితం చేయొచ్చు, మొబైల్ ఫోన్ OTPని ఉపయోగించి EV యంత్రాన్ని తారుమారు చేసిన సంఘటన ముంబైలో జరిగింది.
Claimed By : Social media users
Fact Check : False