ఫ్యాక్ట్ చెక్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ క్షమించమని వేడుకోలేదు

తెలుగు సినీ నిర్మాతలు చిత్ర పరిశ్రమ సమస్యల గురించి తెలియజేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం ను కలిశారు

Update: 2024-06-26 15:48 GMT

తెలుగు సినీ నిర్మాతలు జూన్ 24న.. విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్‌, సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, ఏ.ఎం.రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య, యార్లగడ్డ సుప్రియ, ఎన్వీప్రసాద్‌, బన్నీ వాస్‌, నవీన్‌ ఎర్నేని, సూర్యదేవర నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ యజమాని అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ ను కలవడంపై మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మెగా ఫ్యామిలీ హీరోలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు. అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి అయిన శిల్ప రవి చంద్ర రెడ్డి కోసం నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ వ్యవహారం తర్వాత మెగా అభిమానులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

అల్లు అర్జున్ ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి ఎన్నికల్లో ఓటమి పాలవ్వగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ కలవడానికి వెళ్లగా.. ఆయన అక్కడకు వెళ్ళింది అల్లు అర్జున్ తరపున క్షమాపణలు చెప్పడానికే అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నైల్స్ ను షేర్ చేశాయి.






 





ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.

ఆ వీడియోల్లో నిర్మాత అల్లు అరవింద్ చెప్పింది ఒకటైతే.. యూట్యూబ్ థంబ్నైల్స్ లో మరొకటి ఉంది. అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన అంశంపైన, క్షమాపణలు చెప్పినట్లుగా మాకు ఎలాంటి నివేదికలు కనిపించలేదు.

'అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్' అని కీ వర్డ్ సెర్చ్ చేయగా.. మాకు పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటీకి సంబంధించిన పలు మీడియా నివేదికలు కనిపించాయి.

ఈ నివేదికల్లో.. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పారంటూ కథనాలను కనుగొనలేకపోయాము. నిర్మాతల సమావేశంలో పవన్ కళ్యాణ్ పక్కనే అల్లు అరవింద్ కూడా కూర్చుని కనిపించారు.

పవన్ కళ్యాణ్- నిర్మాతల భేటీ అనంతరం అల్లు అరవింద్ మీడియాతో కూడా మాట్లాడారు. "పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం. ఈ సమావేశంలో మేం కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా... సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించడానికి ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించమని అడిగాం. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ లభిస్తే... ఇండస్ట్రీలో వివిధ విభాగాల వాళ్లందరం తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అభినందిస్తాం." అని అల్లు అరవింద్ తెలిపారు.

ఇదే వాదనతో పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి.


https://10tv.in/telugu-news/movies/allu-aravind-comments-after-movie-producers-meeting-with-deputy-cm-pawan-kalyan-837507.html

https://www.eenadu.net/videos/playvideo/video-film-producer-allu-aravind-comments-after-meeting-with-ap-deputy-cm-pawan-kalyan/2/54918

https://telugu.abplive.com/andhra-pradesh/producer-allu-aravind-comments-after-meeting-with-ap-deputy-cm-
pawan-kalyan-168553



వైరల్ థంబ్నైల్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అల్లు అర్జున్ విమానాశ్రయం నుండి బయటకు రావడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడినప్పటి విజువల్స్ గా మేము గుర్తించాం.

Full View


Full View

కాబట్టి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ క్షమించమని వేడుకున్నారంటూ వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు పెడుతున్నారు.


Claim :  అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ ని క్షమించమని పవన్ కళ్యాణ్ ను కోరారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News