ఫ్యాక్ట్ చెక్: అనంత్ అంబానీ-రాధిక మోటు-పట్లు పాటకు డ్యాన్స్ చేయలేదు.. "ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే" పాటకు డ్యాన్స్ చేశారు

అనంత్ అంబానీ-రాధిక మోటు-పట్లు పాటకు డ్యాన్స్ చేశారు

Update: 2024-07-16 04:48 GMT

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖులు, సెలెబ్రిటీలు అనంత్-రాధిక లను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి సంబంధించిన విశేషాలు ఎన్నో సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ పెళ్లిలోని వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

అనంత్ అంబానీ- అతని స్నేహితురాలు రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించి భారీగా చర్చ జరిగింది.
వీరి పెళ్లికి ముందు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో, జంట "మోటు పట్లు" పాటకు డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఇది "మోటు పట్లు కి జోడీ" అనే హాస్య శీర్షికతో ఈ వీడియోను పోస్టు చేసారు. అనంత్ అంబానీ పెళ్లిలో DJ ఈ పాటను ప్లే చేశారని.. పేర్కొంటూ ఓవర్‌లే టెక్స్ట్ కూడా ఉంది.





Full View

యూట్యూబర్ టియా అదే వీడియోను తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది.. ఆ వీడియోకు “ఏక్ మోటా హాతి” అనే పాటను ప్లే చేశారు. అది చిన్న పిల్లల రైమ్.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలలో ఎగతాళి చేసే విధంగా ఆడియోలను యాడ్ చేశారు. ఒరిజినల్ వీడియోలో మోటూ పట్లూ పాటను కానీ.. చిన్న పిల్లల రైమ్ ను కానీ ప్లే చేయలేదు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో ఆడియోను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో ఈ జంట "ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే" పాటకు డ్యాన్స్ చేశారు.
మా శోధనలో, మేము మార్చి 6, 2024న జూమ్ టీవీ వారి యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. “అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ డ్యాన్స్ టు 'ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే'" అనే శీర్షికతో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. కొన్ని లక్షల వ్యూస్, లైక్స్ సొంతం చేసుకుంది ఈ వీడియో.
Full View

“Anant Ambani and Radhika dance to "Aajkal Tere Mere Pyar Ke Charche" #ambani #radhika #redfmbengaluru" అనే టైటిల్ తో రెడ్ ఎఫ్ఎమ్ బెంగళూరు యూట్యూబ్‌ ఛానల్ లో అనంత్ అంబానీ, రాధిక డ్యాన్స్ వీడియోను అప్లోడ్ చేశారు.



 


“Radhika-Anant Dance to 'Aajkal Tere Mere Pyar Ke Charche' At Their Pre-Wedding Bash | Quint Neon" అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు.

Full View


రిపబ్లిక్ వరల్డ్ “అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ డ్యాన్స్ తో ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే” అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది.
పలువురు ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ లో ఎన్నో పాటలకు డ్యాన్స్ చేశారు. సంగీత్ ఫంక్షన్ లో సెలెబ్రిటీలు చేసిన డ్యాన్స్ వీడియోలు, అంబానీ కుటుంబం చేసిన డ్యాన్స్ కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రాధిక-అనంత్ డ్యాన్స్ కు సంబంధించి వీడియోను ప్రచురించింది “సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆ జంట ప్రముఖ బాలీవుడ్ పాట 'ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ జే చర్చే'కి డ్యాన్స్ చేయడాన్ని మనం చూడవచ్చు." అని అందులో ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము గుర్తించాం. వైరల్ వీడియోలోని ఆడియోను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో అనంత్- రాధిక కలిసి "ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే"కి డ్యాన్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News