ఫ్యాక్ట్ చెక్: ఒడిశాలో ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేడీ, బీజేపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు
BJP ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ సోషల్ మీడియా ఖాతాని సెర్చ్ చేయగా.. మార్చి 22, 2024న
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ-బీజేడీ కూటమి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ పొత్తుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఈ పుకార్లపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, “రెండు పార్టీలు మొదటి నుంచి కలిసి పనిచేస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన ఇప్పుడు చేశాయి.” అంటూ వివరించారు.
కొన్ని చోట్ల.. BJP, BJD సంకీర్ణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు.
కొందరు సోషల్ మీడియా వినియోగదారులే కాదు.. కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని బ్రేకింగ్ న్యూస్‌గా ప్రచారం చేశాయి.
వైరల్ సందేశం ప్రకారం “బీజేపీ-బీజేపీ కూటమి ఒప్పందం 2:1 ఫార్ములాపై ఖరారు చేశారు. లోక్‌సభకు సంబంధించి బీజేపీ 14, బీజేడీ 7 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ 100 స్థానాల్లో పోటీ చేస్తుంది.. బీజేపీ 47 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది.” అని ఉంది. 400 లోక్ సభ స్థానాల్లో గెలవాలన్నది ఎన్.డి.ఏ. ప్రభుత్వ కూటమి లక్ష్యం కావడంతోనే ఈ పొత్తు పెట్టుకుందని అంటున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
పొత్తుకు సంబంధించి బీజేపీ లేదా బీజేడీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మేము ‘BJP-BJD అలయన్స్’ అనే కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఆ పార్టీల సోషల్ మీడియా ఖాతాలలో అటువంటి అధికారిక పత్రికా ప్రకటన లేదా నోటిఫికేషన్ ఏదీ కనుగొనబడలేదు.
BJP ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ సోషల్ మీడియా ఖాతాని సెర్చ్ చేయగా.. మార్చి 22, 2024న పోస్ట్ చేసిన ఒక ప్రకటన మాకు కనిపించింది. తన పోస్ట్‌లో.. 21 లోక్‌సభ, 147 విధానసభ స్థానాల్లో BJP ఒడిశా స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టంగా తెలిపారు.
తదుపరి దర్యాప్తులో.. ఒడిశా BJD సంస్థాగత కార్యదర్శి, సీనియర్ BJD నాయకుడు ప్రణబ్ ప్రకాష్ దాష్ తన అధికారిక X ఖాతాలో “BJD మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు, మొత్తం 21 లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. అధిక శాతం సీట్లలో విజయం సాధిస్తుందని మేము భావిస్తున్నాం. ఒడిశా ప్రజల మద్దతు, శ్రీ నవీన్ పట్నాయక్ నాయకత్వంతో సీట్లు తిరిగి అధికారం లోకి వస్తాం” అని ఆయన అన్నారు.
మార్చి 24న బీజేపీ.. ఒడిశా నుంచి తమ 18 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది.
ఒడిశా టెలివిజన్ కూడా “బీజేపీ-బీజేడీ మధ్య పొత్తు లేదు!" అంటూ కథనాలను ప్రసారం చేశాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒడిశాలో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు లేదని తెలిపింది.
కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బీజేపీ లేదా బీజేడీ అధికారికంగా ఎటువంటి పొత్తును ప్రకటించలేదు. కాబట్టి ఒడిశా లోక్‌సభ & విధానసభలోని అన్ని స్థానాలకు రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయనున్నాయి.
Claim : BJP-BJD alliance deal finalized on 2:1 formula for general elections 2024
Claimed By : Social Media Users
Fact Check : False