ఫ్యాక్ట్ చెక్: భారత్-చైనా దేశాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత చైనా సైనికులు జై శ్రీరామ్ నినాదాలు చేయలేదు

భారత్-చైనా దేశాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత చైనా సైనికులు

Update: 2024-10-28 14:21 GMT
భారత్, చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు కాస్త సద్దుమణిగాయి. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) దగ్గర ఇరు దేశాల నుంచి బలగాల ఉపసంహరణ చేసుకోడానికి సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి భారత్-చైనా దేశాలు ప్రకటనలను విడుదల చేశాయి. ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైన్యాలు తమ సైనికులను వెనక్కు రప్పిస్తున్నాయి.

తూర్పు లడఖ్‌లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న చైనా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. భారత్-చైనా దేశాల మధ్య ఇటీవల చర్చలు జరిగాయి, ఇరు దేశాల సరిహద్దులో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఎల్ఏసీ వద్ద ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని, తాజా ప్రతిపాదనను అమలు చేసేందుకు చైనా ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు చైనా కూడా స్పష్టం చేసింది.

ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రెండు దేశాల పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. ఇరు దేశాలు తాత్కాలిక నిర్మాణాలను ఇప్పటికే ధ్వంసం చేశాయి. డెమ్‌చోక్, దేప్సాంగ్ పాయింట్ల వద్ద ఒప్పందం కుదిరింది. ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అక్టోబరు 28-29 నాటికి డెమ్‌చోక్, దేప్సాంగ్ నుండి భారత్ – చైనా దళాలు పూర్తిగా వెనక్కి తగ్గుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఇంతలో చైనా-భారత్ సైనికుల మధ్య ఓ స్నేహపూర్వక భేటీకి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో భారత్ ఆర్మీ చైనా ఆర్మీతో జై శ్రీరామ్ అని చెప్పిస్తూ ఉండగా, చైనా సైన్యం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం చూడొచ్చు. అయితే ఈ వీడియో ఇటీవల రికార్డు చేసిందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.

చైనా సైన్యం ఇటీవలి శాంతి చర్చల అనంతరం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిందంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.


 



ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ వీడియో ఇటీవలి శాంతి ఒప్పందం తర్వాత చోటు చేసుకున్న ఘటన కాదని, 2024 జనవరి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని ధృవీకరించాం.

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ప్రతిష్టంభనను ముగించడానికి అంగీకరించిన తరువాత, భారతదేశం, చైనాలు అక్టోబర్ 25న తూర్పు లడఖ్‌లో వెనక్కు వెళ్ళడానికి ప్రారంభించాయి. అంతేకానీ జనవరి నెలలో ఇరు దేశాల మధ్య ఎలాంటి డీల్ జరగలేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 'Indian soliders at Chinese Border Jai Shree Ram #ram #trending' అంటూ The Nation Times అనే యూట్యూబ్ ఛానల్ లో 25 జనవరి 2024న వీడియోను అప్లోడ్ చేశారని మేము గుర్తించాం.

Full View

వైరల్ వీడియో ఇప్పటిది కాదని స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ చేయగా 'Chinese PLA Troops Chant 'Jai Shri Ram' Slogans In Viral Video | Watch What Happened' అంటూ హిందుస్థాన్ టైమ్స్ జనవరి 23, 2024న వీడియోను పోస్టు చేసింది.

Full View


వీడియో డిస్క్రిప్షన్ లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా సైనికులు - భారత సైనికులతో కలిసి 'జై శ్రీరామ్' అని నినాదాలు చేస్తున్న తేదీ లేని వీడియో వైరల్‌గా మారిందని ఉంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రోజున ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో ప్రామాణికత ధృవీకరించలేదని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. ఈ వీడియోపై భారత సైన్యం కానీ, చైనా సైన్యం కానీ స్పందించలేదు.

ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది.

'A Warrior's Heart : Love stories of the Selfless Hero' అనే ఫేస్ బుక్ పేజీలో జనవరి 22, 2024న పోస్టు చేసినట్లు గుర్తించాం.

Full View


పానీయాలు, తినుబండారాలతో ఒక టేబుల్‌ దగ్గర ఇరు దేశాల సైనికులు కనిపించారు. ఒక సమావేశంలో భాగంగా భారత సైనికులు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలతో "జై శ్రీ రామ్" నినాదాన్ని నేర్పించడం చూడొచ్చు. వీడియో ఖచ్చితమైన తేదీ అస్పష్టంగానే ఉంది.

వైరల్ వీడియో ఇటీవలిది కాదని, జనవరి 22, 2024న నుండి ఆన్ లైన్ లో ఉందని మేము గుర్తించాం.

కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ ఇటీవలివి కావని, 2024 జనవరి నుండి ఆన్ లైన్ లో ఉన్నట్లు గుర్తించాం. ఈ కథనాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.


Claim :  భారత్-చైనా దేశాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత చైనా సైనికులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News