ఫ్యాక్ట్ చెక్: బెంగళూరులో కుక్క మాంసాన్ని అమ్మడం లేదు.. రెస్టారెంట్లకు కుక్క మాంసాన్ని సరఫరా చేయడం లేదు

బెంగుళూరులో మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ రాజస్థాన్ నుండి తెచ్చిన

Update: 2024-08-05 17:34 GMT
జులై 26, 2024న మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ రాజస్థాన్ నుండి బెంగళూరుకు రైలులో కుక్క మాంసాన్ని తెప్పించారని.. గొర్రెల మాంసంలో కుక్క మాంసం కలిపారని హిందూ సంస్థకు చెందిన పునీత్ కెరెహళ్లి, అతని బృందం ఆరోపించింది. బెంగళూరులోని మెజెస్టిక్‌లోని సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌లో రజాక్, పునీత్ బృందం మధ్య గొడవ కూడా జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. పునీత్ కెరెహళ్లితో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో.. BBMP ఆహార భద్రత, నాణ్యత విభాగం అధికారులు మాంసం నమూనాలను సేకరించారు. అవకతవకలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బెంగళూరు చేరుకున్న జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో 120 బాక్సుల్లో 4,500 కిలోల కుక్క మాంసం రవాణా చేశారని.. ఈ మాంసాన్ని అబ్దుల్ రజాక్‌కు చెందిన పలు దుకాణాల్లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల కారణంగా "ముస్లిం వ్యాపారులు కుక్క మాంసం ఇస్తూ.. హిందువులను మోసం చేస్తున్నారు.. దీనికి మద్దతుగా ముస్లింలు స్వయంగా నిధులు సేకరిస్తున్నారు" అని పేర్కొంటూ.. మితవాద యూట్యూబ్ ఛానెల్ TV విక్రమ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

https://youtube.com/@tvvikrama?si=lD7jO0CUEgpUeZl9


గతంలో ఆవులు మాత్రమే సురక్షితంగా లేవని భావిస్తూ ఉండేవాళ్లమని.. ఇప్పుడు కుక్కలు కూడా సురక్షితంగా లేవని టీవీ విక్రమ్ యాంకర్ నివేదించారు. అబ్దుల్ రజాక్, అతని గ్యాంగ్ కుక్క మాంసం విక్రయించడానికి వీధికుక్కలను, పెంపుడు కుక్కలను దొంగిలించారని ఆ వీడియోలో ఆరోపించారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

అబ్దుల్ రజాక్ రాజస్థాన్ నుంచి బెంగుళూరుకు మేక మాంసాన్ని తీసుకొచ్చాడని, అందులో కుక్క మాంసం కలిపారనే ఆరోపణలు అవాస్తవమని అధికారులు ధృవీకరించారు. ఈ సమాచారాన్ని కర్ణాటక హోంమంత్రి డా.జి.పరమేశ్వర్ స్వయంగా ధృవీకరించారు.

మాంసాహార వ్యాపారులు రాజస్థాన్ నుంచి ప్రతి వారం, 15 రోజులకు ఒకసారి, లేదా అవసరాన్ని బట్టి మాంసాన్ని తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దురుద్దేశంతో అనవసర హంగామా సృష్టించే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.

Full View


Full View


Full View


Full View


కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి ప్రకారం, రాజస్థాన్ నుండి వచ్చిన మాంసం నిజంగా మేక మాంసమని.. కుక్క మాంసం కాదని ప్రయోగశాల నివేదిక నిర్ధారించిందన్నారు.

హైదరాబాద్‌లోని నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు అనుబంధంగా ఉన్న లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ లాబొరేటరీలోని మీట్ స్పీసీస్ ఐడెంటిఫికేషన్ లాబొరేటరీ (ఎంఎస్‌ఐఎల్) బెంగళూరులోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు అందించిన నమూనాలు మేక మాంసమేనని ధృవీకరించింది.

కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ X లో ప్రకటించారు. రాజస్థాన్ నుండి రైలు ద్వారా బెంగళూరుకు మటన్, ఇతర జంతువుల మాంసాన్ని రవాణా చేయడం గురించి ఇటీవలి మీడియా కథనాలకు ప్రతిస్పందించారు.. శాస్త్రీయ ధ్రువీకరణ కోసం సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఖచ్చితత్వానికి సంబంధించి ల్యాబ్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ICAR-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపామని తెలిపారు. విస్తృతమైన పరీక్షల తరువాత ఆ మాంసం గొర్రె-మేకల నుండి తీసుకున్నారని ప్రయోగశాల పరిశోధనల్లో ఖచ్చితంగా నిర్ధారించాయన్నారు.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. బెంగళూరులో సీజ్ చేసిన మాంసం మేకకు సంబంధించినదేనని ల్యాబ్ పరిశోధనల్లో తేలింది.


Claim :  బెంగుళూరులో మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ రాజస్థాన్ నుండి తెచ్చిన కుక్కల మాంసాన్ని గొర్రె మాంసంతో కలిపాడు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News