ఫ్యాక్ట్ చెక్: గూగుల్ జీమెయిల్ ను నిలిపివేస్తోందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు
Google నుండి వచ్చిన ఇమెయిల్ సందేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
జీమెయిల్ సేవలను నిలిపివేస్తూ ఉన్నామని గూగుల్ సంస్థ నుండి ఓ ఈమెయిల్ వచ్చిందంటూ ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది.
Google నుండి వచ్చిన ఇమెయిల్ సందేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. గూగుల్ సంస్థ తన Gmail సేవను ఆగష్టు 01, 2024న నిలిపివేస్తున్నట్లు ఇమెయిల్ ఉంది. జీమెయిల్ మూసివేస్తున్నారంటూ పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు ఈ వైరల్ మెయిల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కు సంబంధించి పలు రకాల పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. HTML వ్యూవ్ కు సంబంధించిన మెసేజీ ఇది. ఆ ఈమెయిల్ ను ఎడిట్ చేసుకుని వైరల్ గా పోస్టు చేస్తున్నారు.
స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రాంతాల కోసం సాధారణంగా HTML view ను ఉపయోగించేవారు. పాత బ్రౌజర్లను వాడే వారి కోసం హెచ్టీఎమ్ఎల్ వ్యూ 2024 నుండి అందుబాటులో ఉండదని తెలిపారు. Gmail help center కూడా ఇదే విషయాన్ని యూజర్లకు తెలియజేసింది.
ఇంతలో ఎడిట్ చేసిన పోస్టులు వైరల్ అవ్వడంతో గూగుల్ దీనిపై స్పందించింది. “Gmail is here to stay,” అంటూ ఎక్స్ లో పోస్టు ఉంది.
NDTV ప్రకారం, Google సంస్థ Gmail ను ఆపివేస్తున్నట్లు వినియోగదారులకు ఎలాంటి మెయిల్స్ పంపలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.
ABP లైవ్ కూడా వదంతులు వైరల్ చేశారని.. ఏ మాత్రం నిజం లేదని పేర్కొంది.
Gmail షట్ డౌన్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం Google ఖండించినట్లు బీబీసీ కూడా ఒక ప్రకటనలో చేసింది.
Gmail షట్ డౌన్ చేస్తున్నారని.. తప్పుడు సందేశం వినియోగదారులలో ఆందోళనలకు కారణమైంది. బూటకపు సందేశానికి Google ప్రతిస్పందించి వివరణ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న చిత్రం కల్పితం. గూగుల్ జీమెయిల్ సేవలను ఆపివేయడం లేదు.
Claim : Google is sunsetting Gmail
Claimed By : Social Media Users
Fact Check : False