ఫ్యాక్ట్ చెక్: ఛత్రపతి శివాజీ మహారాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తాండూర్ పోలీసుల సమక్షంలో కొట్టలేదు

శివాజీ మహారాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని;

Update: 2024-08-30 05:10 GMT
శివ మాల వేసుకున్న కొందరు వ్యక్తులు పోలీసుల ఎదుటే చితక్కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పోలీసులు అడ్డుకుంటున్నా కూడా శివమాల వేసిన వ్యక్తులు ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించారు.

"తాండూర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి పారిపోయి పోలీస్ స్టేషన్ లో దాక్కున్న వ్యక్తిని లాక్కొచ్చి దేహశుద్ధి చేస్తున్న హిందూ యోధులు.... నోరు ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరికీ ఇదే జరగాలి" అనే శ్రీకృష్ణ దేవ రెడ్డి ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.

Full View


"శివాజీ పై అనుచిత వ్యాఖ్యలు చేసి తాండూర్ లోని యాలాల గ్రామ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించాడు.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులు ఎంత అడ్డుపడ్డ లాక్కొచ్చి మరి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టారు.. హిందువుల పవర్ ఏంటో చూపించారు.." అనే @Prabhakareddy5 ట్విట్టర్ ఖాతాలో కూడా ఆగస్టు 23న ఈ వీడియోను షేర్ చేశారు.




@SdnaiduK3082 అనే ట్విట్టర్ ఖాతాలో ఆగస్టు 24, 2024న అదే వాదనతో పోస్టు పెట్టారు. ఇందులో కూడా తాండూర్ ప్రాంతంలో జరిగిన గొడవ అనే వాదనతో పోస్టులు పెట్టారు.

*శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసి తాండూర్ లోని యాలాల గ్రామ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించాడు... పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులు ఎంత అడ్డుపడ్డ లాక్కొచ్చి మరి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టారు...* *హిందువుల పవర్ ఏంటో చూపించారు... చీము నెత్తురు ఉన్న వాళ్ళు ఎవరైనా హిందువులను,




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2023 సంవత్సరంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ చివరికి ఇంత పెద్దదిగా మారింది.

వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా TV9 తెలుగు వెబ్సైట్ లో "Telangana: కన్నెర్రచేసిన శివస్వాములు.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ దాడి చేసిన వైనం.." అనే టైటిల్ తో ఈ ఘటనను నివేదించారు.

https://tv9telugu.com/telangana/shiva-swamy-gang-attacked-on-man-in-vikarabad-telangana-au52-880400.html

ఫిబ్రవరి 1, 2023న కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంలో.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చివరికి పెద్ద వివాదానికి దారి తీసింది. శివ మాల వేసిన వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ శివ స్వాములు యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా దగ్గర మెరుపు ధర్నాకు దిగారని, ఆ తర్వాత శివ స్వాములపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత శివ స్వామిపై దాడి చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న శివ స్వాములు ఒక్కసారిగా పోలీసు స్టేషన్ కు వెళ్లిపోయారు. లక్ష్మీనారాయణపూర్ నుంచి నేరుగా యాలాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గొడవ పడడం మొదలు పెట్టారు. దాడి చేసిన వ్యక్తిని, మరో వ్యక్తిని కూడా చితక బాదారు. అడ్డుకోడానికి ప్రయత్నం చేసిన సందీప్ గౌడ్ అనే కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ రాంబాబు తన సిబ్బందితో హుటాహుటిన యాలాల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు." అని ఉంది.

దీన్ని బట్టి వైరల్ వీడియో ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. 2023 నుండి వీడియో ఆన్ లైన్ లో ఉంది.

ఇక దిశ డైలీ కథనం ప్రకారం.. బోయిని శ్రీనివాస్, మెట్లీ నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. శివస్వామి మాలలో ఉన్న నరేందర్ గొడవ ఆపడానికి ప్రయత్నించగా నరేష్ అనే వ్యక్తి నరేందర్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో అక్కడికి వచ్చిన మరికొందరు శివస్వాములు గొడవ సర్దు మణిగించి, నరేందర్ తో యాలాల పోలీస్ స్టేషన్ లో నరేష్ పై కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత గొడవ మరింత పెద్దదైంది. దీంతో శివస్వాములు కలిసి దాడి చేశారు. దళితుడైన నరేష్ పై దాడి చేసిన శివస్వాములపై ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు.

https://www.dishadaily.com/telangana/rangareddy/50-shivswamy-attack-a-person-in-yalal-184771


"Dalit youth attacked by mob of Shiva devotees in Telangana’s Vikarabad district" అంటూ 'ది న్యూస్ మినిట్' లో 02 ఫిబ్రవరి 2023న కథనాన్ని ప్రచురించారు.


https://www.thenewsminute.com/telangana/dalit-youth-attacked-mob-shiva-devotees-telangana-s-vikarabad-district-172804

ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. ను కూడా మేము యాక్సెస్ చేశాం. ఈ ఘటన 31-01-2023న చోటు చేసుకుందని తేలింది. 2023 జనవరి 31న యాలాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘర్షణ జరిగిందని నరేష్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. నరేందర్, ఇతరులు దుర్భాషలాడారని, నరేష్ కులాన్ని కించపరిచారని ఎఫ్ఐఆర్ లో ఉంది.



 



హిందూ-ముస్లింల గొడవ అంటూ పలుమార్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తెలిపాయి.

ఈ వైరల్ వీడియోను logicallyfacts గతంలో డీబంక్ చేసిందని గుర్తించాం.

https://www.logicallyfacts.com/en/fact-check/caste-clash-telangana-hindu-muslim-false-communal-spin

దీన్ని బట్టి ఈ ఘటన ఇటీవలిది కాదని, 2023లో జనవరి 31న చోటు చేసుకుందని స్పష్టంగా తెలుస్తోంది.

కాబట్టి, శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసి తాండూర్ లోని యాలాల గ్రామ పోలీస్ స్టేషన్ లో దాక్కున్న వ్యక్తిని శివ భక్తులు కొట్టారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  శివాజీ మహారాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తాండూర్ లో కొట్టారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News