ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తి ఈవీఎంల మీద ఇంకు చల్లుతున్న వీడియో ఇటీవలి ఎన్నికల పోలింగ్ కు సంబంధించినది కాదు

కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పారదర్శకతపై ప్రశ్నలు వేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల

Update: 2024-04-29 13:09 GMT

ఎన్నికల సమయంలో ఓట్లను నమోదు చేయడానికి EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) ఉపయోగిస్తూ ఉన్నారు. ఓట్ల తారుమారు లేదా మానవ తప్పిదాలను తగ్గించేందుకు మాత్రమే కాకుండా.. వేగంగా, ఖచ్చితమైన ఓట్ల లెక్కింపును నిర్ధారించడం ఈవీఎంలను తీసుకుని రావడం వెనుక ఉన్న లక్ష్యం. కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పారదర్శకతపై ప్రశ్నలు వేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల వినియోగం కావాలని పలువురు నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల వినియోగాన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల, పొడవాటి జుట్టుతో తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తి పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం మెషీన్లపై సిరా విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఇది 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనగా భావించి.. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులను పెడుతున్నారు.

“Nagpur man threw ink on EVM & was chanting anti-EVM slogans Public showing outrage towards EVM still why only public is punished is this forceful election ? The post was accompanied with hashtags #ElectionDay #ElectionCommissionofIndia #Elections2024 #LokSabhaElections2024 " అనే క్యాప్షన్ తో వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు పోస్టు చేస్తున్నారు. నాగ్ పూర్ కు చెందిన వ్యక్తి ఈవీఎం మెషీన్లపై సిరా విసరడమే కాకుండా.. ఈవీఎంలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అంటూ పోస్టులో ఆరోపించారు.




ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఈ వీడియో 2019 నాటిది. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించినది కాదు.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా మేము అక్టోబర్ 21, 2019న ANI సంస్థ సోషల్ మీడియా ఖాతాలో వైరల్ వీడియోను కనుగొన్నాం. థానేలో బహుజన సమాజ్ పార్టీ (BSP) నాయకుడు, సునీల్ ఖంబే ఈవీఎం మీద ఇంక్ పోశారనే శీర్షికతో వీడియోను అప్‌లోడ్ చేశారు. పోలింగ్ బూత్ వద్ద "ఈవీఎం ముర్దాబాద్" & "ఈవీఎం నహీ చలేగా" నినాదాలు చేయడంతో పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని మీడియా సంస్థ తెలిపింది.

Full View

“Sunil Khambe threw ink on the EVM” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలు ఆ సంఘటన గురించి నివేదించాయి.
The Print, ఏబీపీ న్యూస్ వంటి మీడియా సంస్థలు కూడా ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను పోస్ట్ చేశాయి.

Full View

Full View

పై మీడియా నివేదికల ఆధారంగా.. 2019లో మహారాష్ట్రలోని థానే జిల్లాలోని పోలింగ్ బూత్‌లో సునీల్ ఖంబే అనే BSP కార్యకర్త EVMపై ఇంక్ విసిరారని తేల్చగలిగాము. ఈ సంఘటన 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినది కాదని కూడా మేము నిర్ధారించాము.


Claim :  నాగ్‌పూర్ కు చెందిన వ్యక్తి ఈవీఎంపై ఇంక్ విసిరాడు, ఈవీఎం వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News