ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ పేరుతో ఎలాంటి లిక్కర్ ను అమ్మడం లేదు

సూపర్ సిక్స్ పేరుతో ఎలాంటి బ్రాండ్ అందుబాటులో లేదని గుర్తించాం;

Update: 2024-10-23 12:19 GMT

Super Six in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. అధికారం లోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం పాలసీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీలో కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 16, 2024 నుండి ప్రారంభం అయింది. అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లోకి త్వరాలోనే అందుబాటులోకి రానుంది. అక్టోబర్‌ చివరి నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ప్రియులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి రానున్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం షాపుల్ని దక్కించుకున్నవారు ఆర్డర్లు పెట్టిన బ్రాండ్‌లే సరఫరా చేసేందుకు ఏపీఎస్‌బీసీఎల్‌ సిద్ధమవుతోంది. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో అందుబాటులోకి వచ్చిన కొత్త బ్రాండ్ లలో సూపర్ సిక్స్ కూడా ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. సూపర్ సిక్స్ అంటూ మద్యాన్ని తీసుకుని వచ్చారంటూ పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు పెట్టారు.

"సూపర్ 6 వచ్చేసింది 🤣🤣
#super6" అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.


సూపర్ సిక్స్ అనే బ్రాండ్ తో మద్యం అమ్మకానికి ఉందంటూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో కూడా పోస్టులు పెట్టినట్లు మేము గుర్తించాం.

Full View


Full View




ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సూపర్ సిక్స్ పేరుతో ఎలాంటి బ్రాండ్ మద్యంను ఏపీ మద్యం షాపుల్లో అమ్మడం లేదు.

కొత్తగా సూపర్ సిక్స్ బ్రాండ్ పేరు మీద మద్యం లభిస్తుందేమో తెలుసుకోడానికి మా ఫ్యాక్ట్ చెక్ బృందం ఏపీలోని పలు ప్రాంతాల్లోని లిక్కర్ షాపులను సంప్రదించింది. అయితే ఎక్కడా కూడా సూపర్ సిక్స్ బ్రాండ్ మీద బీర్, విస్కీ అమ్ముతున్నట్లుగా సమాచారం లభించలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో లభించే మద్యం బ్రాండ్లు, వాటి ధరల వివరాలను కూడా మేము గమనించాం. 'S' లెటర్ తో ప్రారంభమయ్యే బ్రాండ్స్ లో ఎక్కడా సూపర్ సిక్స్ మాకు కనిపించలేదు. స్మిర్న్ ఆఫ్, స్టెర్లింగ్ రిజర్వ్.. లాంటి బ్రాండ్లు కనిపించాయి.

https://www.scribd.com/document/705906737/AP-Liquor-Price-List


వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అదే తరహాలో బాటిల్ ఉన్న బ్రాండ్ 'సిక్స్ ఫీల్డ్స్ బీర్' అని గుర్తించాం.




ఆ కంపెనీకి సంబంధించిన పలు రకాల మద్యం వెరైటీలు ఇక్కడ మీరు చూడొచ్చు.

2018లో సిక్స్ ఫీల్డ్స్ సంస్థను స్థాపించారు. బెల్జియన్-స్టైల్ బీర్‌లను భారతదేశానికి తీసుకువచ్చినట్లుగా సంస్థ తెలిపింది. తరతరాలుగా బీర్ తయారీకి ఉపయోగించే ఒరిజినల్ పద్ధతులనే ఇందులో కూడా ఉపయోగించినట్లు తెలిపారు. అత్యుత్తమ నాణ్యమైన పదార్థాలతో ఈ బీర్ ను తయారు చేస్తున్నామని వివరించారు.

https://www.sixfields.com/our-beers


వైరల్ అవుతున్న సూపర్ సిక్స్ బీర్ బాటిల్ ను, అసలైన సిక్స్ ఫీల్డ్స్ బాటిల్ ను పక్కన పక్కన ఉంచాం. ఒరిజినల్ బాటిల్ లోని సిక్స్ ఫీల్డ్స్ ను ఎడిట్ చేసి సూపర్ సిక్స్ గా మార్చారని భావిస్తున్నాం. ఇక బాటిల్ నెక్ దగ్గర కూడా సూపర్ సిక్స్ అని ఉండేలా ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.



 


వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారా? లేదా? అని తెలుసుకోడానికి మేము సంబంధిత ఏఐ టూల్స్ ను కూడా ఉపయోగించాం. వైరల్ ఫోటోను 87 శాతం ఏఐను ఉపయోగించి సృష్టించారని huggingface ఏఐ టూల్ తేల్చింది.



చివరిగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా సంప్రదించాం. వారు కూడా సూపర్ సిక్స్ పేరుతో మద్యం బ్రాండ్ ను తీసుకుని రాలేదని ధృవీకరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందంటూ తెలిపారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ పేరుతో మద్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుని రాలేదు.


Claim :  ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ పేరుతో లిక్కర్ అందుబాటులోకి వచ్చింది
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News