ఫ్యాక్ట్ చెక్: జూన్ 4 తర్వాత కూడా నరేంద్ర మోదీనే ప్రధానిగా కొనసాగుతారని రాహుల్ గాంధీ చెప్పలేదు

ఇకపై నరేంద్ర మోదీ భారత ప్రధానిగా కొనసాగలేరని రాహుల్ గాంధీ చెప్పారు

Update: 2024-05-29 05:18 GMT

రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్లు చూపుతున్న 56 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో రాహుల్ ‘నరేంద్ర మోదీ భారత ప్రధానిగా కొనసాగుతారు’ అని చెప్పడం మనం వినవచ్చు. జూన్ 4 తర్వాత కూడా మోదీ ప్రస్తుత హోదాలోనే కొనసాగుతారని.. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి ఒక్క సీటు కూడా గెలవదని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా వీడియోను వైరల్ చేస్తున్నారు.

“राहुल गांधी जी की बात एकदम सही है। "आएंगे तो मोदी जी ही रहेंगे तो मोदी जी ही बात खत्म।" అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ నిజమే చెబుతున్నారు.. మోదీనే మరోసారి ప్రధాని అవుతున్నారని చెప్పేశారంటూ వీడియో క్యాప్షన్ ద్వారా చెబుతున్నారు.
https://www.facebook.com/reel/292259490617124



ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఆ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు వీడియోలో రాహుల్ గాంధీ.. నరేంద్ర మోదీ ఇకపై ప్రధాని కాలేరని చెబుతున్నారు.
జూన్ 4 తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉండరని ఒరిజినల్ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమికి 50 సీట్లకు తక్కువ రావని కూడా రాహుల్ తన ప్రసంగంలో చెప్పారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) ఒరిజినల్ వీడియోను వైరల్‌ వీడియోతో పాటు పోస్ట్ చేసి.. ఏది నిజమైనదో.. ఏది నకిలీదో పోల్చి చూపించినట్లు మేము కనుగొన్నాము.
యూపీలో తమ కూటమికి 50 సీట్లకు తక్కువ రావని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తించాం. యూపీలో రాహుల్ గాంధీ బహిరంగ సభకు సంబంధించిన వీడియోల గురించి తెలుసుకుంటున్నప్పుడు మేము కాన్పూర్ బహిరంగ సభకు సంబంధించిన ఒక ఫ్రేమ్‌ ను చూశాం.
47:33 టైమ్‌స్టాంప్ వద్ద, "జూన్ 4, 2024న నరేంద్ర మోదీ భారత ప్రధాని కాలేరు" అని రాహుల్ గాంధీ ప్రకటనను మేము కనుగొన్నాము. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమికి కనీసం 50 సీట్లు వస్తాయని ఆయన అన్నారు.

Full View
తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై రాహుల్ గాంధీ విమర్శలు చేసిన పోస్టును కూడా మేము కనుగొన్నాం. “‘झूठ की फैक्ट्री’ भाजपा खुद को कितना भी दिलासा दे ले, कोई फर्क नहीं पड़ने वाला। एक बार फिर कह रहा हूं - 4 जून के बाद नरेंद्र मोदी प्रधानमंत्री नहीं रहेंगे। देश के हर कोने में INDIA की आंधी चल रही है”। అంటూ అసలు, నకిలీ వీడియోల మధ్య ఉన్న తేడాను చూడాలని అన్నారు. ఎన్ని అబద్ధాలనైనా బీజేపీ ప్రచారం చేయగలదని రాహుల్ విమర్శించారు. జూన్ 4 తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవ్వలేరని.. ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకోబోతోందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
ఆ ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు:


ఇదే వీడియోను INC బీహార్, INC ఉత్తరాఖండ్, INC ఢిల్లీ.. అనేక ఇతర కాంగ్రెస్ నేతలు కూడా షేర్ చేశారు.



హిందుస్థాన్ టైమ్స్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి తుఫాను రాబోతోందని, ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4న అధికార బీజేపీ అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూడబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
అందువల్ల, వైరల్ వీడియోను ఎడిట్ చేశారని, తప్పుడు వాదనతో ప్రసారం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. అసలు వీడియోలో జూన్ 4 తర్వాత నరేంద్ర మోదీ ఇకపై ప్రధానిగా కొనసాగలేరని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమికి 50 సీట్లకంటే ఎక్కువ వస్తాయని అన్నారు.


Claim :  భారత ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగుతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News