ఫ్యాక్ట్ చెక్: వాహనంపై ఏనుగు దాడి చేస్తున్న వీడియోకు, హైదరాబాద్ కు ఎలాంటి సంబంధం లేదు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతను సుప్రీంకోర్టు నిలిపివేసింది.;

Update: 2025-04-04 11:14 GMT
tusker attacking an excavator

tusker attacking an excavator

  • whatsapp icon

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతను సుప్రీంకోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్ల నరికివేత జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తాత్కాలిక ఉత్తర్వులో ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆన్-సైట్ తనిఖీ నిర్వహించి, మధ్యంతర స్థితి నివేదికను సమర్పించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.

ఓ ఏనుగు కొన్ని వాహనాలపై దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది, హెచ్‌సియు విద్యార్థులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బుల్డోజర్లపై ఏనుగులు దాడి చేయడానికి వచ్చాయనే వాదనతో పోస్టులు పెట్టారు. ఈ వీడియోలో, ఒక భారీ ఏనుగు ప్రధానంగా ఒక ఎక్స్‌కవేటర్‌పై దాడి చేయడాన్ని ప్రయత్నించడాన్ని మనం చూడవచ్చు.
“విధ్యార్ధులు చేస్తున్న యుద్ధానికి తోడుగా గజరాజుల తోడు #SaveHCU”, when translated, it claims “ అంటూ పోస్టులు పెట్టారు.


Full View


Full View
వైరల్ వీడియోకు సంబంధించిన ఆర్కైవ్ లింక్
ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్స్‌కవేటర్‌పై అడవి ఏనుగు దాడి చేయలేదు. ఈ సంఘటన ఫిబ్రవరి 1, 2025న పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతికాం. అది ఇటీవలిది కాదని, హైదరాబాద్‌కు సంబంధించినది కాదని నిర్ధారించిన కొన్ని మీడియా నివేదికలు లభించాయి. బెన్ సోజో అనే ఛానెల్ ఫిబ్రవరి 2025లో ప్రచురించిన యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది. “You won't believe what happens when elephants get mad” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. వీడియో వివరణలో “ఒక ఏనుగు తన ఇంటిని కూల్చివేస్తున్న ట్రాక్టర్‌పై దాడి చేయడం కనిపిస్తుంది. ఈ విధ్వంసం కారణంగా ఏనుగుకు కోపం రావడానికి కారణమైంది.”
Full View
“Elephant hit JCB, machine shook! The JCB machine and the crowd of people were chasing the elephant, the angry elephant hit the JCB so hard that the whole machine shook. The video is going viral on social media.” అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ నిడివి ఉన్న వీడియోను పోస్టు చేశారు.
న్యూస్ 18 లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో స్థానికులు రెచ్చగొట్టడం వలన ఒక అడవి ఏనుగు వాహనాలపై దాడి చేసింది. ఆహారం కోసం అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది ఆ ఏనుగు. స్థానికులు వేధించి, వెంబడించారని తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, ఆగ్రహించిన ఏనుగు వారిపై దాడి చేసి, ఆపై JCB యంత్రం, సమీపంలోని వాచ్‌టవర్‌తో సహా నిర్మాణ సామగ్రిని లక్ష్యంగా చేసుకుంది. ఫిబ్రవరి 1న పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. వైరల్ వీడియోలో జేసీబీ యంత్రాన్ని ఏనుగు ఢీకొట్టడం చూపిస్తుంది, డ్రైవర్ ఎక్స్‌కవేటర్ బకెట్‌తో దానిని భయపెట్టడానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిందని NDTV కూడా నివేదించింది. భారీ ఏనుగు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టగా, డ్రైవర్ ఎక్స్‌కవేటర్ బకెట్ ఉపయోగించి బెదిరించడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏనుగు వైపు పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు, అది పారిపోవడానికి తిరుగుతుండగా దానిని వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. ఏనుగు నుదిటి, తొండంపై గాయాలు అయ్యాయని, మరెవరికీ గాయాలు కాలేదని స్థానిక మీడియా నివేదించింది. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు, తరువాత జెసిబి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
కాబట్టి, వైరల్ వీడియో పాతది, ఇటీవలి హైదరాబాద్‌కు సంబంధించినది కాదు. ఫిబ్రవరి 1, 2025న పశ్చిమ బెంగాల్‌లోని ఒక గ్రామంలో జరిగిన ఘటన. వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు.
Claim :  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూల్చివేతలకు పాల్పడుతున్న వాహనంపై ఏనుగు దాడి చేసింది.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News