ఫ్యాక్ట్ చెక్: కొడాలి నాని గుండెపోటుతో చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. కోలుకుంటున్నారు;

ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలియని పరిస్థితి. ఆకస్మిక గుండెపోటు పలు కారకాల వల్ల వస్తుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి, కార్డియోమయోపతి, వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగా కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రోగి కార్డియోజెనిక్ షాక్‌లోకి వెళతాడు. సరైన విధంగా CPR ఇవ్వడం ద్వారా రోగి అప్పటికప్పుడు కోలుకునేలా చేయడం, రోగిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా మంచిది. ఎంతో హెల్తీగా ఉన్న వాళ్లు కూడా గుండెపోటు బారినపడుతూ ఉన్నారు. సరైన తిండి తినకపోవడం, మందు, సిగరెట్ లాంటి అలవాట్లు ఎక్కువగా ఉండడం కూడా గుండెపోటుకు కారణమవుతూ ఉంటాయి.
మార్చి 26, 2025న వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రి పాలయ్యారు. కొడాలి నాని బుధవారం నాడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. నివేదికల ప్రకారం, మాజీ మంత్రికి అంతకు ముందు రోజు రాత్రి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. వెంటనే అతనికి చికిత్స అందించారు, అనేక పరీక్షల తర్వాత, నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆసుపత్రి అధికారులు నిర్ధారించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నాని వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు.
అయితే కొడాలి నాని గుండెపోటుతో చనిపోయారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"BIG BREAKING NEWS
కొడాలి నాని గుండె పోటుతో మృతి
Rest in peace #Kodalinani
#YSRCongressParty
#YSRCP" అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
అయితే కొడాలి నాని గుండెపోటుతో చనిపోయారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"BIG BREAKING NEWS
కొడాలి నాని గుండె పోటుతో మృతి
Rest in peace #Kodalinani
#YSRCongressParty
#YSRCP" అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కొడాలి నానికి సంబంధించిన కథనాల కోసం మేము వెతికాం. ఆయన ఆసుపత్రి పాలయ్యారని, శస్త్రచికిత్స చేశారంటూ పలు కథనాలు మాకు లభించాయి.
కొడాలి నాని అధికారిక ఖాతాలో ఆయన టీమ్ వదంతులను నమ్మకండని మార్చి 26న పోస్టు కూడా పెట్టింది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కొడాలి నానికి సంబంధించిన కథనాల కోసం మేము వెతికాం. ఆయన ఆసుపత్రి పాలయ్యారని, శస్త్రచికిత్స చేశారంటూ పలు కథనాలు మాకు లభించాయి.
కొడాలి నాని అధికారిక ఖాతాలో ఆయన టీమ్ వదంతులను నమ్మకండని మార్చి 26న పోస్టు కూడా పెట్టింది.
మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత కొడాలి వెంకటేశ్వరరావు (నాని)ని మార్చి 31న చికిత్స కోసం ముంబైకి విమానంలో తరలించారు. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. మొదట్లో ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు, కానీ వైద్యులు ఇతర సమస్యలను నిర్ధారించినట్లు సమాచారం. నాని గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఆయనకు చికిత్స చేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్‌లో ఆయనను ముంబైకి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటు వెళ్లారు.
ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈ కథనాలు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కొడాలి నానిని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుండి ముంబైలోని ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారని నివేదించాయి. మెరుగైన వైద్య చికిత్స కోసం నాని కుటుంబ సభ్యులు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని ప్రఖ్యాత ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తారని తెలిపారు.
ఇక ముంబైకి తరలించిన తర్వాత కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేశారని, ఆయన కోలుకుంటున్నారంటూ పలు మీడియా సంస్థలు కథనాలను నివేదించాయి.
కొడాలి నాని ఆరోగ్యం గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయన ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. కొడాలి నాని గుండె నొప్పితో బాధపడుతున్నారని, వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కాబట్టి, కొడాలి నాని చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. కోలుకుంటున్నారు
Claimed By : Social Media Users
Fact Check : False