ఫ్యాక్ట్ చెక్: హెచ్ సీ యూ కూల్చివేతల తర్వాత జింకలు హైదరాబాద్ వీధుల్లో తిరగడం వైరల్ వీడియో చూపడం లేదు

హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోపల 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరసనలకు;

Update: 2025-04-07 13:15 GMT
Sambar Deer roaming

Sambar Deer roaming

  • whatsapp icon

హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోపల 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరసనలకు దారితీసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ భూమిని అధికారికంగా విశ్వవిద్యాలయం పేరిట నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. హైకోర్టు విచారణను వాయిదా వేస్తూ, ఈ విషయాన్ని తదుపరి విచారణ కోసం మే 24కి వాయిదా వేసింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు ఉందని డివిజన్ బెంచ్ తెలిపింది. అందువల్ల, సుప్రీంకోర్టు విచారణ కొనసాగే వరకు తదుపరి చర్చను వాయిదా వేయాలని హైకోర్టు నిర్ణయించింది. విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి తదుపరి విచారణ తేదీ నాటికి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వివాదాస్పద భూమికి సంబంధించిన అనేక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనితో సంబంధం ఉన్న అన్ని విభాగాల అధికారుల నుండి సమగ్ర నివేదికలు అవసరమని బెంచ్ తెలిపింది.

ఇంతలో, AI ద్వారా రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనేక పాత చిత్రాలు, వీడియోలు హైదరాబాద్ కు చెందినవిగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిని కంచ గచ్చిబౌలికి లింక్ చేస్తున్నాయి. రాత్రిపూట ఒక వీధిలో 3 జింకలు నడుస్తున్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. “Save HCU biodiversity Preying the wildlife and the only forest cover, home to thousand animals in the name of development needs to stop! #savehcu #savehcubiodiversity #hcu #saveanimal #saveland #hyderabad” అనే క్యాప్షన్ తో
వీడియోను
షేర్ చేస్తున్నారు.
“Destruction of HCU How the deers are on roads . We are responsible. They lost there homes #Save HCU” అంటూ పోస్టులు పెట్టారు.



క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

ఈ వీడియోలో హైదరాబాద్ వీధుల్లో జింకలు నడుస్తున్నట్లు చూపిస్తున్నారనే వాదన అబద్దం
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ వీడియో పాతదని తేలింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కారణంగా, జింకలు రోడ్డు మీదకు రావడం ఇఇ వీడియో 
చూపడంలేదని మాకు తెలిసింది
. ఈ వీడియో 2020 సంవత్సరం నాటిది, ఆ సమయంలో COVID లాక్‌డౌన్ అమలులో ఉంది. పెద్దగా మనుషులు బయట తిరగకపోవడంతో, జంతువులు బయట స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి.
మార్చి 28, 2020న ibtimesలో ప్రచురించిన ఒక కథనాన్ని చూశాం. సాకేత్ అనే యూజర్ ట్విట్టర్‌లో ఈ వీడియో ని షేర్ చేసారనీ, దానిని డియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన సుశాంత నందా ఈ క్లిప్‌ను షేర్ చేసి, డెహ్రాడూన్ వీధులలో డీర్ కనిపించిందని తెలిపారనేది ఈ కధనం తెలిపింది
. ఏడు సెకన్ల వీడియోను "డెహ్రాడూన్‌లో" చోటు చేసుకుందని క్యాప్షన్ తో షేర్ అయ్యింది.
మార్చి 27, 2020న IFS అధికారి సుశాంత నందా అప్లోడ్ చేసిన ట్వీట్‌ కూడా మాకు లభించింది. “Now Sambar deer herds on the road. Sender says that it’s near Rajaji National Park. Wildlife really claiming their space ( For some Cynical about WL reclaiming it’s area on my earlier posts-This is a recent video. Effects of lockdown. Not fake)” అంటూ పోస్టు పెట్టారు.

కరోనావైరస్ కారణంగా దేశ ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. జంతువులు తిరిగి పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయని ఒక 
వార్తా నివేదిక
పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని వీధుల్లో సాంబార్ జింకలు నడుస్తున్నట్లు కూడా కనిపించాయి.
ఇండియా టుడే వెబ్ సైట్ లో ప్రచురితమైన కథనం ప్రకారం వీడియోలో మూడు సాంబార్ జింకలు ఒక వీధిలో తిరుగుతున్నట్లు చూపిస్తుంది, ఇంట్లోని వ్యక్తులు ఆశ్చర్యంతో ఈ సంఘటనను రికార్డ్ చేశారు. కుక్కలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్న జింకలను చూసి మొరుగుతున్నట్లు వినవచ్చు.
కాబట్టి, మూడు సాంబార్ జింకలు తిరుగుతున్నట్లు చూపిస్తున్న వైరల్ వీడియో ఇటీవలిది కాదు. హైదరాబాద్‌కు చెందినది కాదు. ఈ వీడియో 2020 సంవత్సరంలో COVID లాక్‌డౌన్‌కు సంబంధించినది. ఈ మూడు జింకలూ కనపడిన స్థలం నిర్ధారించలేక పోయినా, వీడియో ఇటీవలది కాదు అని నిర్ధారించగలిగాము. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim :  HCU లో చెట్లను నాశనం చేసిన తర్వాత హైదరాబాద్ వీధుల్లోకి జింకలు వచ్చాయి
Claimed By :  Instagram Users
Fact Check :  False
Tags:    

Similar News