ఫ్యాక్ట్ చెక్: షారుఖ్ ఖాన్ చిన్నప్పటి ఫోటోలు ఏఐ ద్వారా సృష్టించినవి
సోషల్ మీడియాలో కొందరు ప్రముఖులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి
By - Sachin SabarishUpdate: 2024-02-27 13:23 GMT
కొందరు ప్రముఖులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రముఖుల చిన్నప్పటి వీడియోలు, ఫోటోలు అంటూ చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొందరు తాము అభిమానించే వ్యక్తికి సంబంధించింది అంటూ షేర్ చేస్తూ ఉండగా.. చాలా మంది నిజమేనేమో అని నమ్మేస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలు చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి.
తప్పుడు సమాచారాన్ని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫేక్ న్యూస్‌ల వ్యాప్తికి కారణం అవుతూనే ఉంది. భారీగా సాంకేతికత అభివృద్ధి చెందుతూ ఉండడంతో ఇలాంటివి సృష్టించడం కూడా పెద్ద కష్టమేమీ అవ్వడం లేదు.
దేశంలోనే స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో ఉన్న కొన్ని చిత్రాలు షారుక్ ఖాన్ చిన్నతనానికి సంబంధించినవి అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదని మేము గుర్తించాం.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసాము. ఆగస్ట్ 31, 2023న ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన గ్యాలరీలో షారుఖ్ ఖాన్ కు సంబంధించిన ఈ చిత్రం ఉందని మేము కనుగొన్నాము. ఈ చిత్రం కృత్రిమంగా రూపొందించారని వెబ్ సైట్ లో వివరించారు. కాబట్టి ఇది ఒరిజినల్ ఫోటో కాదు.. ఏఐ ద్వారా రూపొందించారని మేము ఓ స్పష్టతకు వచ్చాం.
మేము AI ద్వారా సృష్టించే చిత్రాల గురించి తెలుసుకోడానికి ఉపయోగించే హైవ్ మోడరేషన్ అనే టూల్ ను ఉపయోగించాము. వైరల్ ఫోటో 88.9%తో AI ద్వారా సృష్టించారని తేల్చేసింది.
మేము వైరల్ చిత్రాలను inuth.com , indiatvnews.com వంటి సైట్స్ లో ఉన్న షారుక్ ఖాన్ చిన్ననాటి ఫోటోలను పోల్చి చూశాం. అయితే వైరల్ చిత్రాలు కల్పితమని.. షారుఖ్ ఖాన్ చిన్నప్పటి ఫోటోలకు, వైరల్ ఫోటోలకు చాలా తేడాలు ఉన్నాయని నిర్ధారించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. షారుఖ్ ఖాన్ బాల్యానికి సంబంధించిన వైరల్ చిత్రాలు నిజానికి AI ద్వారా రూపొందించినవి.
Claim : A couple of pictures in circulation on social media claims to show Shahrukh Khan’s childhood
Claimed By : Social media users
Fact Check : False