ఫ్యాక్ట్ చెక్: 3 లక్షల లోపు ఎలక్ట్రిక్ టాటా నానో కారు వచ్చేస్తోందంటూ వైరల్ పోస్టులు నిజం కాదు.

3 లక్షల లోపు ఎలెక్ట్రిక్ టాటా నానో కారు

Update: 2024-08-19 13:28 GMT

మధ్య తరగతి ప్రజలకు కూడా కారు ఉండాలనే సంకల్పంతో టాటా నానో కారును అప్పట్లో తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఈ కారుకు ఎంతగానో ఆదరణ దక్కింది. అయితే కొన్ని కారణాల వలన టాటా కంపెనీ ఈ కారును కొనసాగించలేకపోయింది.

ఇక ఇప్పుడు ఎలెక్ట్రిక్ కార్ లకు సంబంధించిన చర్చ కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టాటా కంపెనీ నానో కారును మరోసారి తీసుకుని రాబోతోందంటూ చర్చ అయితే నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా, టాటా మోటార్స్ నుండి ఇండియన్ మార్కెట్లోకి టాటా నానో EV రాబోతోందంటూ చాలా వార్తలు వస్తున్నాయి. టాటా నానో EV గురించి వివిధ రకాల లాంచ్ తేదీలను చెబుతున్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 నుండి 400 కిలోమీటర్ల రేంజి వచ్చే టాటా నానో రాబోతోందంటూ గతంలో కొన్ని మీడియా సంస్థలు నివేదికలను పంచుకున్నాయి. అయితే టాటా నానో ఫీచర్ల గురించి పెద్దగా అప్‌డేట్ రాలేదు.

కానీ ఒక గ్రీన్ కలర్ కారు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. ఇదే సరికొత్త టాటా నానో కారు అంటూ ప్రచారం చేస్తున్నారు. కొన్ని పోస్టుల్లో 1,65,000 రూపాయలకే ఈ కారు లభిస్తుందని చెబుతూ ఉండగా.. ఇంకొన్ని పోస్టుల్లో 3-4 లక్షల రూపాయల రేంజిలో ఈ కారు లభిస్తుందని చెబుతున్నారు.




Full View


Full View


Full View


https://www.haribhoomi.com/
automobile/news/tata-nano-ev-car-features-price-and-know-latest-updates-17942



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఫోటోలలో ఉన్నది BYD కంపెనీకి సంబంధించిన సీగల్ ఎలెక్ట్రిక్ కారు.

టాటా నానో ఎలెక్ట్రిక్ వెహికల్ గురించి సమాచారం కోసం Tata మోటార్స్ సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్స్, సోషల్ మీడియా ఖాతాలను వెతికాం.. ఎక్కడా కూడా టాటా నానో ఎలెక్ట్రిక్ ను లాంఛ్ చేసినట్లుగా కథనాలను మేము చూడలేదు.

టాటా మోటార్స్ కు సంబంధించి ప్రెస్ రిలీజ్ పేజీని మేము యాక్సెస్ చేశాం. అందులో ఎక్కడా కూడా టాటా నానో లాంఛ్ కు సంబంధించిన సమాచారం లేదు.

https://ev.tatamotors.com/




 



ఇక వైరల్ పోస్టులు, వీడియోల కింద కామెంట్స్ విభాగంలో పలువురు ఇది BYD కంపెనీకి సంబంధించిన ఎలెక్ట్రిక్ వాహనం అని చెప్పారు. మేము గూగుల్ లో 'BYD ఎలెక్ట్రిక్ కారు' అంటూ కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. పలు మోడల్స్ కనిపించాయి.

అందులో BYD సీగల్ అనే కారు అచ్చం వైరల్ పోస్టులో ఉన్న కారు తరహాలోనే ఉందని గుర్తించాం. రెండు కార్ల మధ్య పోలికను మీరు చూడొచ్చు. కారు అలాయ్ వీల్స్ దగ్గర నుండి.. కారు నిలిపిన ఫ్లోర్ కూడా ఒకే రకంగా ఉన్నాయని మేము గుర్తించాం.



 


కారు ఒరిజినల్ లోగోలు, నేమ్స్ కనిపించకుండా ఫోటో షాప్ చేశారని వైరల్ ఫోటోను నిశితంగా గమనించగా తెలుసుకున్నాం.



 



వైరల్ ఫోటోను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. www.autocar.co.uk లో BYD సీగల్ కారుకు సంబంధించిన ఫోటోలను మేము చూశాం.

https://www.autocar.co.uk/car-news/new-cars/byd-seagull-sub-%C2%A38000-electric-supermini-china

ఎక్స్ లో కూడా ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.



పలువురు యూట్యూబర్లు కూడా విదేశాల్లో BYD సీగల్ కారుకు సంబంధించిన రివ్యూను ఇచ్చారు. ఈ వీడియోలలో ఉన్న కారు.. వైరల్ ఫోటోలో ఉన్న కారు ఒకటేనని మేము గుర్తించాం.

Full View


Full View

బీవైడీ కార్లకు సంబంధించిన బ్లాగ్ లో వైరల్ ఫోటోను మనం చూడొచ్చు.

https://bydauto.com.co/blog/byd-seagull-el-carro-electrico-que-debuto-en-shanghai/

కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది టాటా నానో ఎలెక్ట్రికల్ కారు కాదు. Byd కంపెనీకి చెందిన seagull కారు.


Claim :  3 లక్షల లోపు ఎలెక్ట్రిక్ టాటా నానో కారు మార్కెట్ లోకి వచ్చింది
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News