ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో కనిపించిన మహిళ బాధితురాలు కాదు.. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న ఓ మహిళ
కోల్‌కతా ఘటన తర్వాత బాధితురాలు ఆమె తల్లి కోసం వీడియో
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో 3డి లేజర్ మ్యాపింగ్‌ను నిర్వహించింది. ఈ కేసులో ప్రధాన నిందితులకు సీబీఐ మానసిక పరీక్షలు నిర్వహించింది. దర్యాప్తు బృందానికి సహకరించేందుకు సీబీఐ బృందంలోని సైకాలజిస్ట్ శనివారం కోల్‌కతా చేరుకున్నారు.
ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కలిసి ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. నేషనల్ మీడియా ప్రకారం, బాధిత కుటుంబం కొంతమంది వైద్యులు, ఇంటర్న్‌లు, వైద్యుల పేర్లను సీబీఐకి అందించింది. RG కర్ మెడికల్ సెంటర్ మాజీ ప్రిన్సిపాల్‌తో సహా 10 మందికి పైగా ఉద్యోగులను విచారిస్తున్నట్లు సమాచారం.
కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజీలో ఆగష్టు 9న అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తండ్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. తన కుమార్తెకు న్యాయం కోసం ఉద్యమిస్తున్న వారిని మమతా బెనర్జీ ప్రభుత్వం సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. న్యాయం చేయాలని సీఎం మాట్లాడుతున్నారని, సంఘీభావంగా వీధుల్లోకి కూడా వచ్చారన్నారు. మమతాబెనర్జీపై నమ్మకం పోయిందని అన్నారు. ఇంతకుముందు మమతా బెనర్జీపై ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడా భావన పోయింది. ఆమె కూడా న్యాయం చేయాలని అడుగుతున్నారు. కానీ ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదన్నారు. ఓవైపు ఆమె న్యాయం కావాలి అంటూనే... న్యాయం కావాలి అని నినదిస్తున్న సాధారణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఆమె ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. గాయపడిన స్థితిలో ఉన్న మహిళను చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలోని RG KAR మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (PGT) రెండవ సంవత్సరం చదువుతున్న 31 ఏళ్ల లేడీ" అనే శీర్షికతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరొక వినియోగదారు వీడియో స్క్రీన్‌షాట్‌ను పంచుకుని "పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ, అటువంటి సంఘటన జరిగిన తర్వాత నేరస్థుడిని మమతా బెనర్జీ ప్రభుత్వం శిక్షించకపోవడం చాలా గర్హనీయం!" అంటూ పోస్టులు పెట్టారు.

https://www.facebook.com/share/v/crLXdtyz57KbrRsd/?mibextid=oFDknk
https://www.facebook.com/share/v/VxFT9jJX7t9kVJpe/
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము కనుగొన్నాము. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై క్రూరత్వం, హత్యకు నిరసనగా వైరల్ వీడియో చేయబడింది.
వైరల్ వీడియోపై కామెంట్స్ ను చదువుతున్నప్పుడు, ఈ వీడియోను జీనత్ రెహమాన్ రూపొందించారని ఒక వినియోగదారు రాశారు.
మేము జీనత్ రెహమాన్ కోసం వెతికినప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనుగొన్నాం.
జీనత్ కలకత్తా నివాసి.. వృత్తి రీత్యా మేకప్ ఆర్టిస్ట్ అని ప్రొఫైల్ పేర్కొంది. ఆగస్ట్ 15, 2024న మేము కనుగొన్న ప్రొఫైల్ లో వీడియోను కనుగొన్నాం. “SHE IS NOT M#U#IT# అంటూ పోస్టు చేసింది. 'నేను ఈ చర్య ద్వారా ఆమె మానసిక స్థితిని పంచుకోవాలనుకున్నానని తెలిపింది. ఆ సమయంలో ఆమె ఎలా గడిచిందో మనం ఊహించలేము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. అమీన్.' అంటూ పోస్టు పెట్టింది. న్యాయం జరగాలని అందులో తెలిపింది.
మా టీమ్ మెంబర్ జీనత్ తో ఈ విషయం గురించి మాట్లాడారు. ఆ సమయంలో.. ఆమె స్వయంగా వీడియోను సృష్టించి, పంచుకున్నట్లు ధృవీకరించింది. జీనత్ మాట్లాడుతూ "కోల్‌కతాలో జరిగినది నిజంగా విషాదకరం. ఏ అమ్మాయి అయినా, కోల్‌కతాలోనే కాదు, ఎక్కడైనా ఈ వార్త విని షాక్‌కు గురవుతుంది. నేను మౌనంగా ఎలా ఉండగలను? ఆమె ఎవరికో కూతురు కావచ్చు, మరెవరికో చెల్లి కావచ్చు. నేను వారి బాధను అనుభవించాను. అందుకే ఈ వీడియో చేయగలిగాను." అని తెలిపింది.
కొంతమంది వ్యక్తులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే క్యాప్షన్‌లతో షేర్ చేశారని, వీడియోలోని అమ్మాయి బాధితురాలని భావిస్తూ ఉన్నారని చెప్పుకొచ్చింది జీనత్. కొంతమంది డిజిటల్ సృష్టికర్తలు లైక్స్, కామెంట్స్, షేర్స్ కోడం తమ అకౌంట్స్ లో తప్పుదారి పట్టించే శీర్షికలతో వీడియోను అప్‌లోడ్ చేసారన్నారు. ఆలోచించండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు వీడియో తీయగలరు? తమ ప్రాణాలను కాపాడుకోవడం కంటే కంటెంట్‌ని సృష్టించడంపై ఎవరు దృష్టి సారిస్తారు? నేను కేవలం బాధితురాలి వాయిస్‌ని వినిపించాలనుకున్నాను. బాధితులకు సత్వర న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి నా సహకారంగా ఈ వీడియో చేశానని జీనత్ తెలిపింది.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో ఉన్న మహిళ బాధితురాలు కాదు. బాధితురాలి తరపున న్యాయం కోసం వాదించేందుకు ఈ వీడియోను రూపొందించారు.
Claim : కోల్‌కతా ఘటన తర్వాత బాధితురాలు ఆమె తల్లి కోసం వీడియో సందేశం పంపింది
Claimed By : social media users
Fact Check : False