ఫ్యాక్ట్ చెక్: గోవాలో బోటు బోల్తా పడి పదుల సంఖ్యలో మరణించారనే వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదు.
ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్
భారత దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా. హాలిడే వస్తే చాలు అక్కడికి వెళ్లాలని భారతీయులే కాదు, విదేశాలకు చెందిన వారు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. గోవా టూరిజం ద్వారా భారీగా ఆదాయం భారతదేశానికి వస్తూ ఉంది. గోవా చుట్టు పక్కల ప్రాంతాలకు తిరగాలంటే ఫెర్రీ సర్వీసులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక కెసినో, సముద్రం మీద పార్టీలకు పెద్ద పెద్ద ప్రైవేట్ బోట్లను ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే ఓ బోటు నీటిలో మునిగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అది గోవా తీరంలో చోటు చేసుకుందంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
అయితే ఓ బోటు నీటిలో మునిగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అది గోవా తీరంలో చోటు చేసుకుందంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన కాంగోలో చోటు చేసుకుంది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటన కాంగోలో చోటు చేసుకుందంటూ పలు మీడియా కథనాలను కూడా మేము కనుగొన్నాం.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కివు సరస్సు తీరానికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో 278 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 78 మంది మునిగిపోయారని, చాలా మంది కనిపించకుండా పోయారని ది గార్డియన్ పత్రిక అక్టోబర్ నాలుగున నివేదించింది.
MV మెర్డీ అనే ఓడ మినోవా పట్టణం నుండి సరస్సు దాటిన తర్వాత గోమా నగరానికి వెలుపల ఉన్న కిటుకు ఓడరేవు వద్ద వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కేవలం 80 మంది మాత్రమే ప్రయాణించగలిగే పడవలో 278 మంది ఉన్నారని నివేదికలు తెలిపాయి.
https://www.theguardian.com/
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 78 కాగా, ఆ బోట్ లో 278 మంది ఉన్నారని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఖచ్చితమైన వివరాలను చెప్పడానికి కనీసం మూడు రోజులు పడుతుంది, మృతదేహాలు ఇంకా కనుగొనాల్సి ఉందని కాంగో అధికారులు తెలిపారు. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య పోరాటం జరుగుతూ ఉండడంతో రోడ్లకు బదులుగా ఎక్కువ మంది పడవల్లో ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటారు.
కాంగో లోని 'గోమా'కు భారత్ లోని 'గోవా' కు ఉన్న తేడాను గుర్తించని చాలా మంది ఇది గోవాలో చోటు చేసుకుందని భావించారు.
ఈ ఘటనకు సంబంధించి గోవా పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. ఈ వీడియోకు గోవాకు ఎలాంటి సంబంధం లేదని గోవా పోలీసులు సోషల్ మీడియాలో తెలిపారు.
"గోవా తీరానికి సమీపంలో పడవ బోల్తా పడిందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలో ఉన్న గోమాలో జరిగింది" అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటన గోవాలో చోటు చేసుకోలేదంటూ పలు మీడియా సంస్థలు కూడా ఫ్యాక్ట్ చెక్ చేశాయి. ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన గోవాలో చోటు చేసుకుంది కాదు.
Claim : గోవాలో బోటు బోల్తా పడి 20 మందికి పైగా మరణించారు. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇవి.
Claimed By : social media users
Fact Check : False