ఫ్యాక్ట్ చెక్: రోబో.. బ్యాడ్మింటన్ ఆడుతోందంటూ వైరల్ అవుతున్న వీడియో ఏఐ ద్వారా జెనరేట్ చేసినది
ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాడ్మింటన్ గేమ్‌లో రోబో సత్తా చాటినట్లు వీడియో చూపిస్తుంది
ఇద్దరు పిల్లలతో కలిసి ఓ 'రోబో' బ్యాడ్మింటన్ గేమ్‌లో పాల్గొంటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది రోబోకు, మనుషులకు మధ్య సాగిన నిజమైన మ్యాచ్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లపై రోబో విజయం సాధించిందని చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి వైరల్ వీడియోను రూపొందించినట్లు మేము కనుగొన్నాము. ఇద్దరు పిల్లలతో కలిసి ఒక వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను డిజిటల్‌గా రోబోతో మార్చారు. మనిషి స్థానంలో రోబోను ఉంచారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫేస్‌బుక్‌లో అసలు వీడియోను కనుగొన్నాము. అక్టోబర్ 2021లో, ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాడ్మింటన్ గేమ్‌లో నిమగ్నమైన వ్యక్తి వీడియోను ఒక పేజీ షేర్ చేసింది.
వైరల్ వీడియో, ఒరిజినల్ ఫేస్‌బుక్ వీడియో మధ్య ఉన్న పోలికలను మీరు చూడొచ్చు. బ్యాగ్రౌండ్, పిల్లలు వేసుకున్న డ్రెస్, ఆడిన షాట్లు, ఆటగాళ్ల హావభావాలు దాదాపు అన్నీ ఒకేలా ఉన్నాయి. వైరల్ వీడియోలో మనిషి స్థానంలో రోబోట్ ను ఉంచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
వీడియో కు సంబంధించిన TikTok వెర్షన్ లో AI ద్వారా రూపొందించారు అనే వివరణతో అప్లోడ్ చేశారు. "AI" అనే హ్యాష్‌ట్యాగ్‌తో వీడియో పోస్ట్ చేశారు.
వీడియో సృష్టికర్త ఎవరో మేము నిర్ధారించలేనప్పటికీ, మనిషి స్థానంలో రోబోట్ ను ఉంచి పిల్లలతో బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Video shows robot participating in a badminton game with two children
Claimed By : Social media
Fact Check : False