ఫ్యాక్ట్ చెక్: పాఠశాల పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటుతున్నట్లు చూపుతున్న వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు

నేపాల్‌లోని కుంపూర్‌కు చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు

Update: 2024-08-02 04:45 GMT
భార‌త‌దేశంలోని వివిధ ప్రాంతాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో ఊహించని విధంగా వరదలు సంభవించాయి. అనేక మంది ప్రజలు తమ స్వగ్రామాలను, సొంతిళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. సోషల్ మీడియా వరదలను చూపించే చిత్రాలు, వీడియోలతో నిండిపోయింది. అనేక నగరాలను కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.

పాఠశాల యూనిఫాం ధరించిన పిల్లలు ప్రాణాలకు తెగించి పుల్లీ కేబుల్‌ని ఉపయోగించి నదిని దాటుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. పిల్లలు ఆ కేబుల్ మీద నుండి దాటుతూ వెళుతుండగా.. కింద నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తూ ఉండడం చూడొచ్చు. ఈ వీడియో హిందీలో “सरकार ने जितनी ताकत कावड़ यात्रा पर लगाई है काश कि थोड़ा सा ध्यान इन स्कूल जाते बच्चों के रास्ते के लिए भी दे देते।” శీర్షికతో షేర్ చేస్తున్నారు.

"మతపరమైన యాత్రలపై దృష్టి పెట్టడమే కాకుండా.. ఈ పాఠశాల విద్యార్థులకు మంచి రహదారిని అందించడంలో ప్రభుత్వం కొంచెం ప్రయత్నం చేయాలి." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.

https://x.com/DhruvRatheFc/status/1817551131628704010














ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో నేపాల్‌కు చెందినది.

మేము వీడియో నుండి కీఫ్రేమ్‌ను సంగ్రహించి.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వీడియో నేపాల్‌కు చెందినదని పేర్కొంటూ అదే విజువల్స్‌తో కూడిన యూట్యూబ్ వీడియోను మేము కనుగొన్నాము.

Full View

“The daily struggle of Nepal school students” అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియోలను పోస్టు చేశారు. నేపాల్ పాఠశాల విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లడానికి ఎంతగానో పోరాడుతూ ఉన్నారనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము.



మేము ఫ్రీ డాక్యుమెంటరీ పేరుతో ఫేస్‌బుక్ పేజీని కనుగొన్నాము. “Most Dangerous Ways of School I Nepal I Free Documentary” అనే శీర్షికతో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను ప్రచురించింది. నేపాల్ లోని స్కూల్ విద్యార్థులు పడుతున్న కష్టం ఇదంటూ అందులో తెలిపారు.

వీడియో డిస్క్రిప్షన్ లో.. కుంపూర్ పర్వత గ్రామంలో పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు కొండల్లో నడవాల్సి ఉంటుంది. పిల్లల కుటుంబాలు నిరంతరం భయపడుతూనే పిల్లలను స్కూల్ కు పంపిస్తూ ఉన్నాయి. తమ పిల్లలను ఒక రోజు తర్వాత మరో రోజు పాఠశాలకు పంపుతారు.


Full View



మేము IMDb పేజీని కూడా కనుగొన్నాము. ఈ వీడియో 'ది మోస్ట్ డేంజరస్ వేస్ టు స్కూల్' అనే డాక్యుమెంటరీ సిరీస్‌లోని ఎపిసోడ్‌లలో ఒకటి అని పేర్కొంది.

https://www.imdb.com/title/tt3149796/plotsummary/?ref_=tt_ov_pl


మే 2024లో కేరళకు చెందిన పాఠశాల విద్యార్థుల దీనస్థితిని చూపిందనే వాదనతో వైరల్ అయిన వీడియో కూడా నిజం కాదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను ఖండించాయి.

https://factly.in/a-video-clip-from-a-documentary-about-school-kids-of-nepal-crossing-rivers-to-attend-school-is-falsely-linked-to-kerala-india/

వైరల్ వీడియో నేపాల్ కు చెందిన పాఠశాల విద్యార్థులు కేబుల్ కార్ వంతెనను ఉపయోగించి నదిని దాటుతున్నారు. ఇది డాక్యుమెంటరీ ఎపిసోడ్‌లో ఒక భాగం. ఆ వీడియో భారత్‌కు చెందినదనే వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  పాఠశాల పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటుతున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది. అది భారతదేశానికి చెందినదని చెబుతున్నారు.
Claimed By :  social media
Fact Check :  False
Tags:    

Similar News