ఫ్యాక్ట్ చెక్: పారిపోతున్న ఏనుగులకు సంబంధించిన విజువల్స్ వాయనాడ్ ఘటనకు చెందింది కాదు

పారిపోతున్న ఏనుగులకు సంబంధించిన విజువల్స్

Update: 2024-08-11 14:10 GMT
కేరళ లోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని వివిధ వర్గాల నుండి వచ్చిన డిమాండ్‌కు న్యాయబద్ధతను కేంద్రం పరిశీలిస్తుందని 4 ఆగస్టు 2024న కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు. వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో వందలాది ఇళ్లను ధ్వంసం చేశాయి ఈ కొండచరియలు.

కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. సహాయ, పునరావాస చర్యలలో కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. ప్రకృతి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోందని ప్రధాని అన్నారు. విపత్తులో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని.. నిధుల కొరత కారణంగా ఏ పనికి ఆటంకం ఉండదని భరోసా కల్పించారు.

కేరళలోని ఏనుగులు తమ పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, ఏనుగులకు దగ్గరగా వెళ్లడం వల్ల చాలా మంది మనుషులు చనిపోయారు. ఈ ప్రమాదకర పరిస్థితి మధ్య ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక ఏనుగు వాయనాడ్ మహిళ సుజాత అనినచిరా, ఆమె కుటుంబాన్ని రక్షించడానికి వచ్చింది.

కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుజాత అనినచిరా, ఆమె కుటుంబం అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. విపత్తు సంభవించినప్పుడు, వారు ఒక కొండ ఎక్కి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఒక అడవి ఏనుగు, రెండు ఆడ ఏనుగులు వారికి ఎదురయ్యాయి. తన ఇంటి పొరుగున ఉన్న రెండంతస్తుల ఇల్లు కూలిపోయిందని, తన సొంత ఇంటిని ధ్వంసం చేసిందని సుజాత వివరించింది. ఆమె, ఆమె కుటుంబం, ఆమె కొడుకు గిరీష్, కోడలు సుజిత, మనవరాలు మృదుల శిథిలాల కింద చిక్కుకున్నారు. సుజాత మృదులని బయటకు లాగి, ఆమెకు గుడ్డ కప్పి, వరదనీటిలో ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చింది.

చివరికి ఆమె కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా తమను తాము రక్షించుకుని, కొండపైకి చేరుకున్నారు. అక్కడ వారు ఏనుగులకు అతి దగ్గరగా ఉన్నారు. భయాందోళనకు గురైన సుజాత తమ ప్రాణాలు కాపాడాలని ప్రార్థిస్తూ ఉంది. అయితే ఆ ఏనుగులు ప్రశాంతంగా ఉండి ఉదయం వరకు రక్షణ సిబ్బంది వచ్చే వరకు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. తమను అధికారులు రక్షించేంత వరకు ఏనుగు తమ వెంటే ఉందని సుజాత చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో 26 సెకన్ల వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో.. భారీ వర్షం వస్తున్న సమయంలో అడవి నుండి ఏనుగుల సమూహం దిగువకు కదులుతున్నట్లు కనిపిస్తుంది.

“కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి 1 గంట ముందు ఏనుగులు సురక్షితంగా పరుగెత్తుతున్నాయి” అనే శీర్షికతో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేశారు. జంతువులకు విపత్తులను ముందే పసిగట్టే అవకాశం ఉంటుందని అందులో తెలిపారు.




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం. ఇది ఇటీవలి వాయనాడ్ కొండచరియలు విరిగి పడిన ఘటనకు ఎలాంటి సంబంధం లేని పాత వీడియో.

వైరల్ వీడియో కామెంట్స్ విభాగంలో.. ఒక వినియోగదారు స్క్రీన్‌షాట్‌ను షేర్ ను షేర్ చేసి "ఆ వీడియో జనవరి లో వచ్చింది" అని వివరించారు.



స్క్రీన్ షాట్‌లో weanadn అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీకి సంబంధించిన పోస్టు అని మేము కనుగొన్నాము. మేము Instagramలో wayanadn కోసం సెర్చ్ చేయగా.. వినియోగదారు అదే వీడియోను జనవరి 12, 2024న పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము.



వైరల్ అయిన వీడియోని పోలిన మరో వీడియోను కూడా కనుగొన్నాం.

"Travel with AJ." అనే యూట్యూబ్ ఛానెల్ లో అదే వీడియోను ఏప్రిల్ 3, 2024న అప్‌లోడ్ చేసినట్లు తదుపరి విచారణలో గుర్తించాం.



 



వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనకు ముందే ఈ ఏనుగుల గుంపు వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో ఉందని ఇది నిర్ధారిస్తుంది.

Red FM Bengaluru పోస్టుకు సంబంధించిన కామెంట్స్ విభాగంలో పలువురు ఈ వీడియో పాతది అంటూ కామెంట్లలో చెప్పడం మేము గమనించాం.



 



వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటన రాత్రి సమయంలో చోటు చేసుకుందని.. అయితే వైరల్ వీడియోలో చాలా వెలుగు ఉందని కామెంట్లలో తెలిపారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో పాతది.. వాయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించినది కాదు.


Claim :  కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటానికి గంట ముందు ఏనుగులు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాయి. జంతువులకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టే శక్తి ఉంటుందని చెబుతున్నారు.
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News