ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేవాలయాన్ని సందర్శించలేదు
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు మాధవి లత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసురుతున్నారు. తెలంగాణ రాజధాని 'హైదరాబాద్' లోక్ సభ ఎన్నికల్లో చాలా ముఖ్యమైన స్థానాల్లో ఒకటి
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు మాధవి లత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసురుతున్నారు. తెలంగాణ రాజధాని 'హైదరాబాద్' లోక్ సభ ఎన్నికల్లో చాలా ముఖ్యమైన స్థానాల్లో ఒకటి. గత మూడు దశాబ్దాలుగా ఈ సీటుపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లి
అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందూ దేవాలయాన్ని సందర్శించి దేవుడికి ప్రార్థనలు చేశారనే వాదనతో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆలయ పూజారి ముందు పూలహారంతో అసదుద్దీన్ ఓవైసీ కనిపిస్తున్న చిత్రం వైరల్ అవుతూ ఉంది. బీజేపీ అభ్యర్థి నుండి తీవ్ర పోటీ ఎదురైన కారణంగా హిందూ సమాజాన్ని సంతోషపెట్టడానికి MIM నాయకుడు దేవాలయాలను సందర్శిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
“ఇవాళ ప్రచార సమయం లో గుడికి వెళ్లి అర్చన చేయించుకున్న అసద్దుద్దీన్ ఒవైసీ.ఈ బీజేపీ వాళ్ళు మామూలోళ్ళు కాదు. జీవితంలో గుడి ముఖం చూడడానికి కూడా ఇష్ఠపడని వాన్ని దేవాలయం మెట్లు ఎక్కేలా చేస్తున్నారు.” అనే వాదనతో పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి చిత్రాన్ని సెర్చ్ చేయగా.. ఈ చిత్రం AIMIM అధికారిక X (Twitter) హ్యాండిల్ లో అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము. మూసారాంబాగ్, ఇందిరా నగర్... సమీప ప్రాంతాల్లో ఒవైసీ ప్రచారం చేస్తున్నప్పుడు తీసిన చిత్రాలని చిత్రం శీర్షిక పేర్కొంది. ప్రచారం సందర్భంగా ఆయన నియోజకవర్గంలో కాలినడకన పర్యటించారు. ఆయన ఏ ఆలయాన్ని సందర్శించిన ప్రస్తావన రాలేదు.
తదుపరి సెర్చ్ లో, AIMIM చీఫ్, హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనకు కొంతమంది పూజారులు స్వాగతం పలికారని పేర్కొన్న వీడియోను ANI తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
మైక్ టీవీ న్యూస్ ప్రచురించిన మరో యూట్యూబ్ వీడియోలో ఓవైసీని వీధిలోకి వచ్చినప్పుడు కొందరు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరిస్తున్నట్లు చూడొచ్చు. అదే సమయంలో, ఆయనను కొంతమంది పూజారులు సత్కరించారు. ఇక ఆ రోజు ఆయన ఆలయాన్ని సందర్శించినట్లు ఎలాంటి నివేదికలు లేవు.
ఇదే విధమైన వీడియోను 'ది ప్రింట్' యూట్యూబ్ ఛానెల్ కూడా అప్లోడ్ చేసింది. “అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నప్పుడు పూజారులు ఆయనను సత్కరించారు” అనే శీర్షికతో ప్రచురించింది.
అందువల్ల, వైరల్ చిత్రాన్ని తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయలేదు.
Claim : హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం సమయంలో హిందూ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు
Claimed By : Social media users
Fact Check : False