ఫ్యాక్ట్ చెక్: బంగారంతో చేసిన బట్టలు ధరించినట్లుగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల చిత్రం ఏఐ ద్వారా రూపొందించారు
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12, 2024న నిర్వహించారు. కెనడియన్ గాయకుడు జస్టిన్ బీబర్ పెళ్ళికి సంబంధించిన సంగీత్ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12, 2024న నిర్వహించారు. కెనడియన్ గాయకుడు జస్టిన్ బీబర్ పెళ్ళికి సంబంధించిన సంగీత్ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, రణవీర్ సింగ్ వంటి స్టార్లు అంబానీలతో కలిసి వేడుకలకు హాజరయ్యారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ స్వచ్ఛమైన బంగారంతో చేసిన దుస్తులను ధరించిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఇద్దరూ బంగారంతో చేసిన బట్టలు ధరించేందుకే జియో ధరలను పెంచిందనే వాదనతో పోస్టులు పెడుతున్నారు.
“జియో మరియు మీ ఇతర నెట్వర్క్ ధరలు పెంచింది, వీళ్లు బంగారు వస్త్రాలు ధరించడానికి.” అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు.
చిత్రాన్ని తనిఖీ చేసిన తర్వాత.. ఆ చిత్రంలో ఏ మాత్రం క్వాలిటీ లేదని మేము కనుగొన్నాము. బట్టల రంగు కూడా తేడాగా ఉందని మేము గమనించాం. ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల్లో ఎక్కడా కూడా ఈ చిత్రాన్ని ప్రచురించలేదు.
జూన్ 1, 2024న 'బ్యూటీ ఆఫ్ AI' అనే క్యాప్షన్‌తో అనంత్ అంబానీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ చిత్రాన్ని పంచుకున్నారు. మేము AI డిటెక్షన్ సాధనాలను ఉపయోగించి చిత్రాన్ని పరీక్షించాము. AI సాంకేతికతను ఉపయోగించి చిత్రం ఎడిట్ చేశారని మేము కనుగొన్నాము. ‘ఈజ్ ఇట్ AI’ అనే టూల్ లో ఈ ఫోటోను చెక్ చేయగా.. 95% AI ద్వారా సృష్టించారనే అవకాశం ఉందని నిర్ధారించింది.
అక్టోబర్ 31, 2023న ఇండియా టుడేలో ‘రాధికా మర్చంట్, అనంత్ అంబానీ జియో వరల్డ్ ప్లాజా ఓపెనింగ్‌లో ముఖేష్ అంబానీతో కలిసి పోజులిచ్చారు’ అనే శీర్షికతో ప్రచురించబడిన కథనం మేము గమనించాం. అందులో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్.. ఇతరులకు సంబంధించిన అనేక చిత్రాలను చూశాం.
వైరల్ ఇమేజ్‌తో ఉన్న ఇమేజ్‌లలో ఒకదానిని పోల్చి చూస్తే రెండూ ఒకే ఫోటో అని గుర్తించాం. దీన్నే డిజిటల్‌గా మార్చారని చూపిస్తుంది.
అందువల్ల, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ వివాహానికి ముందు జరిగిన ఒక వేడుకలో స్వచ్ఛమైన బంగారు దుస్తులను ధరించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. AI టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించారు.
Claim : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ వివాహానికి ముందు జరిగిన వేడుకల్లో స్వచ్ఛమైన బంగారుతో చేసిన దుస్తులను ధరించారు
Claimed By : Social media users
Fact Check : False