ఫ్యాక్ట్ చెక్: బ్లాక్ బ్యాట్ పువ్వుల చిత్రం ఏఐ టెక్నాలజీ వాడి రూపొందించారు

ప్రకృతిలో పువ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థల విషయంలో ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-09-09 14:39 GMT

Black Bat flowers

ప్రకృతిలో పువ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థల విషయంలో ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పించే మొక్కలకు సంబంధించిన శ్రేణిలో, కొన్ని జాతులు అత్యంత అరుదైనవిగా చెప్పుకోవచ్చు, అంతేకాకుండా అసాధారణమైనవి కూడా! నిర్దిష్ట ప్రాంతాలలో, ప్రత్యేక పరిస్థితులలో అరుదైన పువ్వులు కనిపిస్తాయి. ఈ పువ్వులను గుర్తించడం కష్టం.

అసాధారణమైన పువ్వులు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, కార్ప్స్ ఫ్లవర్, దాని పరిమాణం. అది వెదజల్లే వాసన చాలా ప్రత్యేకమైనది. ఇది నిర్దిష్ట పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ అరుదైన అసాధారణమైన పుష్పాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంతేకాకుండా జీవవైవిధ్యాన్ని సంరక్షించే ప్రాముఖ్యతను గుర్తించాల్సి ఉంటుంది. వాటి ఉనికి పర్యావరణ వ్యవస్థల సంక్లిష్టతను, ఈ ప్రత్యేక జాతులను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
అయితే, ఇటీవల సోషల్ మీడియా లో గబ్బిలాల ముఖాలను పోలి ఉండే నలుపు రంగు పూలను చూపే చిత్రాలు 'బ్లాక్ బ్యాట్' పువ్వులంటూ వైరల్‌ అవుతూ ఉంది. ఆ పువ్వులకు గోధుమ-రంగు నాలుక ఆకారపు నిర్మాణం కూడా ఉంది.
“Black Bat Flower (Tacca chantrieri) A mysterious plant with striking black bracts and whisker-like filaments, resembling eerie bat faces hanging in the jungle! Light: Bright, indirect. Water: Keep soil consistently moist, but not waterlogged. Soil: Well-draining, rich in organic matter. Temp - °60-70°F (20-26°C). Humidity: High, 60-80%. Fertilizer: Monthly, diluted balanced fertilizer during the growing season. A truly unique and spooky addition to your plant collection!” అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ (టాక్కా చాంట్రీరి) అడవిలో వేలాడుతున్న గబ్బిలాల ముఖాలను పోలి ఉంటాయని, వాటికి ఎలాంటి వాతావరణం ఉండాలి? ఎలాంటి నేలపై బతుకుతాయి? నీరు ఎంత అందుబాటులో ఉండాలనే విషయాన్ని ఈ సోషల్ మీడియా పోస్టుల్లో తెలిపారు.
Full View

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. చెలామణిలో ఉన్న చిత్రం AI ద్వారా రూపొందించిన చిత్రం. అసలు బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ కు గరాటు ఆకారపు నిర్మాణం, పొడుచుకు వచ్చిన నాలుక లాంటి నిర్మాణం ఉండదు. మేము ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్షన్ టూల్- '
Is It AI
' ను ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేసినప్పుడు, చిత్రం AI ద్వారా రూపొందించారని కనుగొన్నాం.


 

మేము మరొక AI ఇమేజ్ డిటెక్టర్ టూల్ 'హైవ్ మోడరేషన్‌' ని ఉపయోగించి కూడా చిత్రాన్ని తనిఖీ చేసాము. ఈ చిత్రం AI ద్వారా సృష్టించే అవకాశం 99% ఉన్నట్లు కనుగొన్నాం.


 ప్రకృతిలో నల్ల గబ్బిలం పువ్వు నిజంగా ఉందో లేదో నిర్ధారించడానికి, మేము 'బ్లాక్ బ్యాట్ ఫ్లవర్' అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేశాం. నిజమైన బ్లాక్ బ్యాట్ పువ్వులను చూపించే అనేక కథనాలను మేము కనుగొన్నాము. అరిజోనా విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ విభాగం ప్రకారం, బ్లాక్ బ్యాట్ పువ్వును 'డెవిల్ ఫ్లవర్' అని కూడా పిలుస్తారు. ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి. ప్రకృతిలో సుమారు 15 జాతులు ఉన్నాయి. వాటిలో ఒకటి మలేషియాకు చెందినది. ఈ కథనంలో బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ చిత్రాన్ని కూడా చూడొచ్చు. ఈ పువ్వుపై నాలుక లాంటి నిర్మాణం కనిపించలేదు.

Searles gardening.com.au ప్రకారం, బ్లాక్ బ్యాట్ పువ్వు నలుపు, గోధుమ, ఊదారంగులలో ఉంటుంది. వెబ్‌సైట్ కథనంలో పువ్వు చిత్రాన్ని కూడా చూడొచ్చు. ఇది వైరల్ చిత్రానికి పూర్తిగా భిన్నంగా ఉంది.
రెండు పువ్వుల చిత్రాల మధ్య పోలికలను మనం గమనించవచ్చు.


 వైరల్ చిత్రంలో ఉన్నది నిజమైన బ్లాక్ బ్యాట్ ఫ్లవర్‌ కాదు. దీన్ని AI ద్వారా రూపొందించారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది.

Claim :  వైరల్ చిత్రంలో ఉన్నవి బ్లాక్ బ్యాట్ పువ్వులు. రహస్య ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. గబ్బిలం ముఖాన్ని పోలి ఉంటాయి
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News