నిజ నిర్ధారణ: ఏపి కి సంబంధించినదిగా షేర్ అవుతున్న గంజాయి ప్యాకెట్ల చిత్రం తప్పుదారి పట్టిస్తోంది

"గంజాయిలో ఆంధ్ర టాప్!!#ఏంద్ ఒఫ్ య్చ్ప్" అనే క్యాప్షన్‌తో ఇంటర్నెట్‌లో ఒక చిత్రం విస్తృతంగా షేర్ అవుతోంది, అంటే గంజాయి సరఫరాలో ఆంధ్ర పేదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అర్ధం. ఈ చిత్రం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలో ఉంది.

Update: 2022-09-30 13:18 GMT

"గంజాయిలో ఆంధ్ర టాప్!!#ఏంద్ ఒఫ్ య్చ్ప్" అనే క్యాప్షన్‌తో ఇంటర్నెట్‌లో ఒక చిత్రం విస్తృతంగా షేర్ అవుతోంది, అంటే గంజాయి సరఫరాలో ఆంధ్ర పేదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అర్ధం. ఈ చిత్రం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలో ఉంది.


Full View
Full View


నిజ నిర్ధారణ:

పోస్ట్ తో షేర్ చేసిన చిత్రం ఆంధ్ర ప్రదెశ్ కి సంబంధించినది కాదు. ఈ క్లెయిం తప్పుదారి పట్టించేది. చిత్రం పాతది.

మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ చిత్రం ఫిబ్రవరి 2022 నాటిదని తెలుస్తోంది.

ఫిబ్రవరి 2022లో హైదరాబాద్ ఎన్సిబి స్వాధీనం చేసుకున్న గంజాయి (మారుజియానా అని కూడా పిలుస్తారు)కి సంబంధించిన కథనాలలో ఈ చిత్రం మొదటగా ప్రచురించారు.

ఈటీవిభారత్.కాం ప్రకారం, హైదరాబాద్ ఎన్సిబి ఇన్వెస్టిగేటర్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఎగుమతి చేయబడిన ఒక పార్శిల్‌లో 1.42 కిలోల హై-గ్రేడ్ గంజాయిని కనుగొన్నారు. ఈ నేరానికి సంబంధించి ఇద్దరు భారతీయులను కూడా ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ కొరియర్ కంపెనీకి ఎగుమతి చేసిన పరుపు లో నిషిద్ధ వస్తువులు ప్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఇదే చిత్రాన్ని ఈనాడు.నెట్ తెలుగు ఎడిషన్, ఈటివి భారత్ హిందీ ఎడిషన్ లు ఫిబ్రవరి 2022లో షేర్ చేసాయి.

'ఎన్సిబి అమెరికా నుండి గంజాయిని స్వాధీనం చేసుకుంది' అనే కీలక పదాలను ఉపయోగించి శోధించినప్పుడు, ఫిబ్రవరి 22, 2022న ఇండియా టుడేలో ప్రచురించిన కథనాలు కూడా లభించాయి, ఫిబ్రవరి 19న లక్డికాపూల్‌లోని ఒక కొరియర్ కంపెనీలో ఒక అనుమానాస్పద పార్శిల్‌ను ఎన్సిబి అధికారులు అడ్డుకున్నారని పేర్కొంది. దర్యాప్తు చేయగా, గాలి చొరబడని ప్యాకెట్‌లో 1.42 కిలోల బరువున్న గంజాయిని బ్లూమ్ పరుపులో దాచి ఉంచారు. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో, ఎన్‌సిబి అధికారులు నిఘాలో పార్శిల్ డెలివరీని వేగవంతం చేశారు, నిందితులు దానిని అందుకోగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోస్ట్‌లలో ఉపయోగించిన చిత్రం పాతదని, అది తెలంగాణకు సంబంధించినదనీ ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ క్లెయిం ను కొట్టిపారేసింది.

ఎన్సిబి 2021 వార్షిక నివేదికలో గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న అనేక కధనాలు ఉన్నప్పటికీ, ఎన్సిబి ద్వారా విలువడిన నివేదికను కనుగొనలేకపోయాము.

అందువల్ల, ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించినట్టు ప్రచారం చెందుతున్న గంజాయి ఫోటొ తప్పుదారి పట్టించేది.

Claim :  Image of ganja packets with connection to AP
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News