ఫ్యాక్ట్ చెక్: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య తమ కుమారుడిని యుద్ధానికి పంపుతున్న చిత్రం తప్పుదారి పట్టించేలా చేసింది
ఇజ్రాయెల్ దేశస్థులు సైన్యంలో తప్పనిసరిగా సేవ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండాక సైన్యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్ దేశస్థులు సైన్యంలో తప్పనిసరిగా సేవ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండాక సైన్యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పురుషులు 32 నెలలు, మహిళలు 24 నెలలు సైన్యంలో ఉండి సేవ చేయాలి. ఈ తప్పనిసరి సేవ తర్వాత, హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో, చాలా మందిని 40 ఏళ్ల వయస్సు వరకు రిజర్వ్ యూనిట్లకు పిలవవచ్చు.
ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. అనేక పాత చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అతని భార్య, వారి కుమారుడితో కలిసి ఉన్న ఫోటోను ప్రస్తుతం అతన్ని యుద్ధానికి పంపుతున్నారనే వాదనతో వైరల్ అవుతోంది.
“ఇజ్రాయెల్ ప్రధాని కొడుకు యుద్ధానికి దిగుతున్నాడు. తమ కుమారుడికి వీడ్కోలు పలకడంతో తల్లిదండ్రులు గర్వంగా ఉన్నారు. ఈ చిత్రం, ఈ భావన ఇజ్రాయెల్ పౌరులకు ఎంతగా స్ఫూర్తినిస్తుందో మరియు ప్రోత్సహిస్తుందో పరిశీలించండి! దేశం పట్ల అలాంటి ప్రేమే ఇజ్రాయెల్ను గొప్పగా చేస్తుంది. మన దేశంలో ఎంతమంది నాయకులు సైన్యంలో ఉన్నారు? యుద్ధ సమయంలో తమ పిల్లలను యుద్ధభూమికి పంపాలని ఎంతమంది నాయకులు ఆలోచించగలరు? " అద్భుతమైన ఇజ్రాయెల్” అంటూ పోస్టులు పెట్టారు.
“Israel PM Netanyahu sending his son to serve the country as a soldier. Most heart touching pic. Will any Indian leader even do that??” అంటూ ఇంగ్లీష్ లో కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలో సేవ చేయడానికి పంపుతున్నాడు.. ఈ పనిని భారతదేశంలోని నేతలు చేయగలరా అని పోస్టుల్లో ప్రశ్నిస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఈ ఫోటో పాతది. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంది కాదు. 2014లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి తన కుమారుడిని సైన్యంలో సేవ చేయడానికి పంపుతున్నట్లు తెలిపింది.మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ చిత్రం 2014 సంవత్సరంలో పలు వార్తా కథనాలలో ప్రచురించారని మేము కనుగొన్నాము.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్.కామ్‌లో డిసెంబర్ 1, 2014న ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చిన్న కుమారుడు అవ్నర్ నెతన్యాహును అతని తల్లిదండ్రులు హృదయపూర్వకంగా సైన్యంలోకి పంపించారు. అవ్నర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో తన మిలిటరీ సర్వీసును ప్రారంభించాడు. అతనిని బస్ ఎక్కించడానికి కుటుంబ సభ్యులు తోడుగా వచ్చారు. డ్యూటీలో భాగంగా అవ్నర్ ను అమ్యునేషన్ హిల్ కలెక్షన్ పాయింట్ లో విధులను ఇచ్చారు. రాజధాని నుండి కొత్త రిక్రూట్‌మెంట్‌లు టెల్ అవీవ్ సమీపంలోని IDF ఇండక్షన్ సెంటర్‌కు పంపుతారు.
The Jerusalem Post.com ప్రకారం, నెతన్యాహు, అతని భార్య సారా తమ కొడుకు సైన్యంలో చేరడాన్ని చూసి ఎంతగానో గర్వపడ్డారు. దేశాన్ని రక్షించడమే కాకుండా.. తనను తాను రక్షించుకోమని కొడుకుకు చెప్పారు.
అందువల్ల, వైరల్ ఫోటో ఇజ్రాయెల్ ప్రధాని తన చిన్న కొడుకును తప్పనిసరి మిలిటరీ సర్వీసుకు పంపుతున్న పాత చిత్రం ఇది. ఇజ్రాయెల్ ప్రధాని తన కొడుకును యుద్ధానికి పంపుతున్నది ఇటీవల జరిగిన సంఘటనగా ప్రచారం చేస్తున్నారు. ఈ వైరల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : Israel Prime Minister is sending his son to serve the country in the ongoing war with the Hamas militants as a soldier.
Claimed By : Social media users
Fact Check : Misleading