ఫ్యాక్ట్ చెక్: బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని చిత్రాన్ని ప్రొజెక్ట్ చేయలేదు
శ్రీరామ నవమి శుభ సందర్భంగా,ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు మన దుబాయ్ గర్వించదగిన భవనం బుర్జ్ ఖలీఫాలో శ్రీరాముని చిత్రపటం...జై శ్రీరామ్!” అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
“శ్రీరామ నవమి శుభ సందర్భంగా,ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు మన దుబాయ్ గర్వించదగిన భవనం బుర్జ్ ఖలీఫాలో శ్రీరాముని చిత్రపటం...జై శ్రీరామ్!” అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.శ్రీ రామ నవమి సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంపై శ్రీరాముడి చిత్రంను డిస్ప్లే చేశారని సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫాలో రాముడి LED చిత్రాన్ని ఉంచారని చెబుతూ ఉన్నారు.శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది మార్చి 30, 2023న శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. రాముడి చిత్రం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించలేదు, ఈ చిత్రం డిజిటల్‌గా ఎడిట్ చేశారని మేము గుర్తించాం. మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా, వైరల్ అవుతున్న చిత్రం 2015లో ప్రచురించిన స్టాక్ చిత్రం అని మేము కనుగొన్నాము.మేము బుర్జ్ ఖలీఫా అధికారిక Facebook పేజీలో వైరల్ చిత్రం కోసం శోధించాము. ఖాతాలో భాగస్వామ్యం చేసిన అటువంటి చిత్రాలు ఏవీ కనుగొనబడలేదు. లేటెస్ట్ గా అయితే ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ దినోత్సవం సందర్భంగా చిత్రాన్ని ఉంచారు.ఇక ఇటీవల బంగ్లాదేశ్ 52వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై డిజిటల్ గా ఆ దేశ ఫ్లాగ్ ను ఉంచారు.
రామ నవమి సందర్భంగా ఎటువంటి పోస్ట్ ను సోషల్ మీడియాలో ఉంచలేదు. అలాంటి లైటింగ్ షో గురించి ఎటువంటి వార్తా నివేదికలు లేవు. istockphoto.comలో అదే బ్యాగ్రౌండ్ ఉన్న చిత్రం కనుగొన్నాం. భవనంపై రాముడికి సంబంధించిన లైటింగ్ లేదు కానీ.. ప్రతి ఇతర వివరాలు వైరల్ ఇమేజ్‌కి సరిపోతాయి.
అదే చిత్రం అడోబ్ స్టాక్ చిత్రాలలో కూడా కనుగొన్నాం.బుర్జ్ ఖలీఫా శ్రీరాముడి చిత్రంతో శ్రీరామ నవమి రోజు వెలిగిపోయిందనే వాదన తప్పు. చిత్రాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
Claim : Image of Lord Sri Ram projected on Burj Khalifa
Claimed By : Social Media Users
Fact Check : False