ఫ్యాక్ట్ చెక్: భవన నిర్మాణ కార్మికులతో మోదీ భోజనం చేస్తున్న చిత్రం రామమందిరానికి సంబంధించినది కాదు, కాశీ విశ్వనాథ్ ధామ్‌కు సంబంధించినది

అయోధ్యలో రామమందిర నిర్మాణం జనవరి 24, 2024 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆలయం 380 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ నిర్మాణం పూర్తీ అయితే ప్రపంచంలోని మూడవ అతిపెద్ద హిందూ మందిరం అవుతుంది. ఆగస్ట్ 2020లో రామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి

Update: 2023-12-21 13:28 GMT

Ayodhya Ram Mandir

అయోధ్యలో రామమందిర నిర్మాణం జనవరి 24, 2024 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆలయం 380 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ నిర్మాణం పూర్తీ అయితే ప్రపంచంలోని మూడవ అతిపెద్ద హిందూ మందిరం అవుతుంది. ఆగస్ట్ 2020లో రామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణం ముగింపు దశకు చేరుకోవడంతో.. అయోధ్య రామమందిరానికి అనుసంధానించే అనేక పాత వీడియోలు, చిత్రాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయానికి సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతూ ఉంది.


అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికులతో కలిసి ప్రధాని మోదీ భోజనం చేస్తున్నారనే వాదనతో.. ప్రధాని మోదీ కొందరు భవన నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Full View

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. 2021లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన నిర్మాణ కార్మికులతో కలిసి ప్రధాని మోదీ భోజనం చేస్తున్న చిత్రం ఇది.

మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.. 2021లో ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహా చిత్రాలను షేర్ చేస్తున్నట్లు మేము కనుగొన్నాము.

ఇండియా టుడే ప్రకారం, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన భవన నిర్మాణ కార్మికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ భోజనం చేశారు. రెండు రోజుల వారణాసి పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా నది వెంట అనేక ఘాట్‌లతో కలుపుతుంది.

news18.com ప్రకారం, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో ప్రాజెక్ట్ నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ప్రధానమంత్రి వారి మధ్య కూర్చుని ఫోటో దిగారు. ప్రధాని నరేంద్ర మోదీని చూడగానే కార్మికులు ఆయన చుట్టూ కూర్చుని ఎంతో ఆనందించారు. ప్రధాని మోదీ కార్మికులకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు.

ANI న్యూస్ X హ్యాండిల్ లో కూడా ఈ ఫోటోలను షేర్ చేశారు. “Varanasi: PM Narendra Modi had lunch with the workers involved in construction work of Kashi Vishwanath Dham Corridor” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. దీన్ని బట్టి ఆయన కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ లో కార్మికులతో ఫోటోలు దిగారని తెలుస్తోంది.

కాబట్టి, వైరల్ చిత్రం ఇటీవలిది కాదు. 2021 సంవత్సరంలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణ కార్మికులతో కలిసి భారత ప్రధాని భోజనం చేస్తున్న ఫోటోలు ఇవి. కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  The image shows Indian Prime Minister Modi having lunch with the construction workers of the Ram Mandir in Ayodhya
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News