నిజ నిర్ధారణ: ప్రభుత్వం బూట్లు ఇవ్వనందున భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఉత్తికాళ్లతో మ్యాచులు ఆడారా? లేదు

బూట్లు లేకుండా ఆడుతున్న భారతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లను చూపించే పాత చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక కథనంతో వైరల్ అవుతోంది. 1948 ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ క్రీడాకారులు షూ లేకుండా ఆడారనీ ఎందుకంటే వారికి ప్రభుత్వం బూట్లు అందించలేదు, స్వంతంగా బూట్లు కొనుగోలు చేసుకోలేక అలాగే ఆడారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.

Update: 2022-08-24 13:13 GMT

బూట్లు లేకుండా ఆడుతున్న భారతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లను చూపించే పాత చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక కథనంతో వైరల్ అవుతోంది. 1948 ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ క్రీడాకారులు షూ లేకుండా ఆడారనీ ఎందుకంటే వారికి ప్రభుత్వం బూట్లు అందించలేదు, స్వంతంగా బూట్లు కొనుగోలు చేసుకోలేక అలాగే ఆడారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.

ఇదిగో ఆ క్లెయిం ' ఈ చిత్రం వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే... మనం జాతిపిత అనుకునే వారిపైన అసహ్యం వేయకమానదు... 1948లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌కు సంబంధించిన చిత్రమిది.

ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను మన ఫుట్‌బాల్ జట్టు 1-1తో సమం చేసింది. కానీ ఆ తర్వాత మ్యాచ్లను భారతదేశ ఆడలేదు ఎందుకంటే షూస్ లేని జట్లను డిస్క్ క్వాలిఫై చేశారు నిర్వాహక జట్టు...బూట్లు లేని కారణంగా మన ఆటగాళ్లు గెలవలేకపోయారు. ఆడిన ఒక్క మ్యాచ్ కూడా షూస్ లేకుండానే మన ఆటగాళ్లు ఆడారు
షూస్ ఉన్న ప్రత్యర్థి జట్ల తోటి మనవారు షూస్ లేకుండా ఆడటం వల్ల మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా మనవారు ఎన్నో గాయాల పాలు అయ్యారట.. అయినా మ్యాచ్ సమంగా సాగింది. ఈ జట్టుకు శైలేంద్ర నాథ్ మన్నా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ప్రభుత్వం వద్ద అంత డబ్బు కూడా లేదా... ప్రభుత్వం బూట్లు ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్లకు పరికరాలు తేవలసిన సమయంలో ఆ విమానాన్ని నెహ్రూ గారి బట్టలు డ్రై క్లీనింగ్ చేసేదానికి ప్యారిస్ తీసుకువెళ్లారట... సాహబ్ తన కుక్కతో ప్రైవేట్ జెట్‌లో తిరిగేవాడు. 1950 ప్రపంచకప్‌లో షూస్ లేకుండా ఏ జట్టు కూడా మ్యాచ్ ఆడదు కాబట్టి ఫిఫా భారత్‌పై నిషేధం విధించింది. ఫిఫా ప్రపంచకప్‌కు భారత జట్టు మళ్లీ వెళ్లలేదు. కానీ నేడు దేశంలోని చాలా స్టేడియాలకు నెహ్రూ గాంధీ కుటుంబం పేరు పెట్టారు.'

Full View


Full View

ఈ క్లెయిం 2019లో భారతదేశంలోని ఇంగ్లీష్, హిందీలలో, 2021లో తెలుగులో కూడా వైరల్ అయింది.

నిజ నిర్ధారణ:

1948లో భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ళు బూట్లు లేకుండానే మ్యాచ్‌లు ఆడారు, అయితే ఇది వారికి ప్రభుత్వం బూట్లు అందించపోవడం వల్ల కాదు. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు బూట్లు ధరించే అలవాటు వారికి లేని కారణంగా ఆటగాళ్లు చెప్పులు లేకుండా ఆడారు.

'1948 ఒలింపిక్స్ ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్' అనే కీవర్డ్‌లతో పాటు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి ఇమేజ్‌ని సెర్చ్ చేసినప్పుడు, ఒలింపిక్స్.కామ్‌ వెబ్సైట్ లో ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించిన వివరాలు చూడవచ్చు. పదకొండు మంది గల భారత జట్టులోనుంచి ఎనిమిది మంది షూ లేకుండానే ఆడారని కథనం పేర్కొంది.

1948 ఆగస్టు 1న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన నివేదిక ద్వారా కూడా భారత్ 2-1 స్కోరుతో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయిందని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్‌లో 11 మంది ఆటగాళ్లలో 8 మంది షూ లేకుండా ఆడినట్లు కూడా పేర్కొంది.

The Indian Express - Google News Archive Search

2018లో ప్రచురించబడిన ది హిందూ స్పోర్ట్స్‌స్టార్‌లోని కథనం జట్టులోని సభ్యులందరూ ఉన్న చిత్రాన్ని చూపిస్తుంది, ఇక్కడ కొంతమంది ఆటగాళ్ళు బూట్లు ధరించడం చూడవచ్చు. ఆ కథనంలో ఆడటానికి పెద్దగా ఉపయోగించని కారణంగా, ఆటగాళ్లు బూట్‌లను సరఫరా చేసారు. ఆల్-ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) వారు ఆటగాళ్లకు బూట్లు సరఫరా చేసారు, అయితే పెద్దగా బూట్లు వేసుకునే అలవాటు లేని కారణంగా చాలామద్ని ఆటగాళ్లు వాటిని ధరించలేదు. తడిగా జారుతూ ఉండే పరిస్థితుల కారణంగా వాటిని ధరించడం తప్ప వారికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది అంటూ పేర్కొన్నారు.

భారత ఫుట్‌బాల్ జట్టు అధికారిక ట్విట్టెర్ ఖాతా కూడా అదే చిత్రాన్ని పంచుకోవడం మనం చూడవచ్చు.

మరింత శోధించగా, అసలు చిత్రం గెట్టి స్టాక్ చిత్రాలలో ఉండడం చూడవచ్చు, ఇక్కడ భారతీయ ఫుట్ బాల్ ఆటగాళ్ళలో ఒకరు బూట్లు ధరించడం చూడవచ్చు.

ఇదే చిత్రాన్ని ఫీఫా.కాం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

అందువల్ల, 1948లో ప్రభుత్వం భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లకు బూట్లు ఇవ్వలేదనే వాదన అబద్దం. చెప్పులు లేకుండా ఆడటం సౌకర్యంగా ఉన్నందున ఆటగాళ్లు తమ వద్ద బూట్లు ఉన్నప్పటికీ ఉత్తి కాళ్లతో ఆడారు. ప్రభుత్వం క్రీడాకారులకు బూట్లను అందించలేదన్నది వాస్తవం కాదు.

Claim :  Indian Football players played matches barefoot because they were not given shoes by the government
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News