ఫ్యాక్ట్ చెక్: పెడోఫిలిక్ వీడియోలను చూస్తున్న వ్యక్తులకు హెచ్చరిక అంటూ చెలామణిలో ఉన్న లేఖ నకిలీది

సైబర్ సెల్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో మొదలైన వాటి లోగోలు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో ఉంది, చాలా మంది వినియోగదారులు ఆ లేఖ నిజమైనదా కాదా అని అడుగుతున్నారు. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా మరేదైనా ప్రభుత్వ సంస్థ అలాంటి లేఖను జారీ చేసిందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

Update: 2024-08-23 14:15 GMT

Fake letter

సైబర్ సెల్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో మొదలైన వాటి లోగోలు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో ఉంది, చాలా మంది వినియోగదారులు ఆ లేఖ నిజమైనదా కాదా అని అడుగుతున్నారు. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా మరేదైనా ప్రభుత్వ సంస్థ అలాంటి లేఖను జారీ చేసిందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. లేఖ జారీ చేసిన వ్యక్తి IP చిరునామాను సైబర్ క్రైమ్ అధికారులు చూస్తున్నారని లేఖ పేర్కొంది. పిల్లల అశ్లీల, పెడోఫిలిక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం, చూడటం వంటి పనులు చేస్తున్న వ్యక్తుల IP అడ్రెస్ క్యాప్చర్ చేశారని ఆ లేఖలో ఉంది. 24 గంటలలోపు లేఖకు తక్షణమే ప్రతిస్పందించాలని.. అలా స్పందించడంలో విఫలమైతే, స్థానిక పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తారు. ఈ లేఖపై ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, శ్రీ ప్రశాంత్ గౌతమ్ పోలీస్/చీఫ్ ఆఫ్ పోలీస్ సంతకం చేసినట్లు ఉంది.

ఈ లేఖలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ నేషనల్ హైవే-8 మహిపాల్‌పూర్, న్యూఢిల్లీ- 110037 నుండి వచ్చినట్లుగా ఉంది.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారత ప్రభుత్వ పరిధిలోని ఏ సంస్థ కూడా అలాంటి లేఖను జారీ చేయలేదు.
మేము కొన్ని కీ వర్డ్స్ ను ఉపయోగించి అటువంటి లేఖ కోసం వెతకగా.. ఆ లేఖ నకిలీదని పేర్కొంటూ సైబర్ దోస్త్ అనే X హ్యాండిల్ ద్వారా చేసిన ట్వీట్‌ని మేము కనుగొన్నాము. జాగ్రత్తగా గమనించగా.. మేము డాక్యుమెంట్‌లో అనేక స్పెల్లింగ్ తప్పులు, ఫాంట్ లలో తేడాలను కనుగొన్నాము.
పోస్టు లోని క్యాప్షన్ లో “In a letter purportedly issued by Indian Cyber Crime Coordination Center (I4C), several allegations are being leveled at the recipient & a reply is being sought to the letter This letter is #fake. No such letter has been issued by any organization under GOI #I4C #MHA” అంటూ ఉంది. దీన్ని బట్టి ఈ లెటర్ ఫేక్ అని తెలుస్తోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జారీ చేసిన లేఖను నమ్మకండి. ఈ లేఖ నకిలీ అని, ఏ ప్రభుత్వ సంస్థచే కూడా అటువంటి లేఖను జారీ చేయలేదు
ఆల్ ఇండియా రేడియో న్యూస్ అలర్ట్స్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, సైబర్ క్రైమ్ జారీ చేసినటువంటి అనేక నకిలీ, మోసపూరిత ఇ-మెయిల్‌లకు వ్యతిరేకంగా కేంద్రం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందనే పోస్టును చూడొచ్చు. చైల్డ్ పోర్నోగ్రఫీ, పెడోఫిలియా, సైబర్ పోర్నోగ్రఫీ, లైంగిక అసభ్యకరమైన ప్రదర్శనలు, ఈ-మెయిల్స్ రిసీవర్లపై గ్రూమింగ్ ఆరోపణలు ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మేము మరింత శోధించగా డెక్కన్ హెరల్డ్ లో ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. కేవలం చైల్డ్ పోర్న్ డౌన్‌లోడ్ చేయడం లేదా చూడటం నేరం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జె బి పార్దివాలా బెంచ్ తెలిపింది. అయితే పిల్లలను ఉపయోగించడం పోర్నోగ్రఫీలో ఖచ్చితంగా నేరం అవుతుందని అభిప్రాయపడింది.
పిల్లలతో కూడిన కొన్ని అశ్లీల కంటెంట్‌ను తన మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి చూస్తున్నందుకు ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపిన 28 ఏళ్ల ఎస్ హరీష్‌పై క్రిమినల్ కేసును మద్రాస్ హైకోర్టు జనవరి 11న కొట్టి వేసింది.
అటువంటి లేఖలు లేదా ఇమెయిల్‌లు ప్రామాణికమైనవో కాదో ఎలా గుర్తించాలో మీకు కొన్ని సూచనలు:
- ఏదైనా స్పెల్లింగ్ లేదా వ్యాకరణ తప్పుల కోసం తనిఖీ చేయండి
- లెటర్లలో ఉపయోగించిన లోగోలు, సంస్థల పేర్ల కోసం వెతకండి
- డాక్యుమెంట్‌లో ఉపయోగించిన సంస్థల పేర్లు, పేర్కొన్న చర్యలను అమలు చేశారో లేదో తనిఖీ చేయండి
- ‘gov.in’తో ముగిసే అధికారిక ఇమెయిల్ చిరునామాల నుండి ప్రామాణికమైన ప్రభుత్వ సమాచారాలు పంపుతారు
కనుక, చెలామణిలో ఉన్న లేఖ నకిలీది. ఏ ప్రభుత్వ సంస్థలు కూడా పౌరులకు ఇమెయిల్ ద్వారా ఇటువంటి లేఖలను జారీ చేయవు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  పెడోఫిలిక్ వీడియోలను చూస్తున్న వ్యక్తులకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, సీబీఐ ఆన్‌లైన్‌లో లేఖలు పంపుతున్నాయి.
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News