ఫ్యాక్ట్ చెక్: క్రిస్మస్ సమయంలో భారతదేశంలోని మాల్స్ లో శ్రీరాముడి విగ్రహాలను ఏర్పాటు చేయలేదు

భారతదేశంలోని ప్రముఖ మాల్స్‌ ను ప్రతి పండుగ సీజన్‌ సమయంలో పెద్ద ఎత్తున అలంకరిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే!! పలు మాల్స్ ప్రాంగణాన్ని బ్యానర్‌లు, ఫెస్టూన్‌లు, థీమ్ డెకరేషన్‌తో అలంకరిస్తూ ఉంటారు. మాల్స్ పరిసరాలను, ఖాళీ స్థలాలను అలంకరించేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తూ ఉంటారు మాల్స్ యాజమాన్యాలు.

Update: 2023-12-30 04:53 GMT

Decoration in mall

భారతదేశంలోని ప్రముఖ మాల్స్‌ ను ప్రతి పండుగ సీజన్‌ సమయంలో పెద్ద ఎత్తున అలంకరిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే!! పలు మాల్స్ ప్రాంగణాన్ని బ్యానర్‌లు, ఫెస్టూన్‌లు, థీమ్ డెకరేషన్‌తో అలంకరిస్తూ ఉంటారు. మాల్స్ పరిసరాలను, ఖాళీ స్థలాలను అలంకరించేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తూ ఉంటారు మాల్స్ యాజమాన్యాలు. దసరా, దీపావళి, క్రిస్మస్ మొదలైన ప్రతి పండుగలకు ప్రత్యేకమైన అలంకరణల కోసం మాల్స్ యాజమాన్యాలు భారీ సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు.


మాల్స్‌లో భారీ శ్రీరాముడి విగ్రహాలకు సంబంధించిన అలంకరణలను చూపించే రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ చెట్టు అలంకరణలకు బదులుగా, మాల్స్‌లో డిసెంబర్‌లో శ్రీరాముడి విగ్రహాలను ఉంచారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.


“अद्भुत बदलाव... जयतु सनातन 25 दिसंबर पर क्रिसमस ट्री से सजने वाले मॉल अब भगवान राम जी के भव्य प्रतिमा से सज रहे है, सच में हमारा देश बदल रहा है.. #नया_भारत #जय_श्री_राम” అంటూ వీడియోను షేర్ చేశారు.

“అద్భుతమైన మార్పు.. సనాతనం విజయం. సాధారణంగా డిసెంబర్ 25న క్రిస్మస్ చెట్లతో అలంకరిస్తూ ఉంటారు. కానీ మాల్స్ లో ఇప్పుడు శ్రీరాముడి విగ్రహంతో అలంకరించారు, మన దేశం మారుతోంది” అని అందులో ఉంది.

ఒకే దావాతో రెండు వేర్వేరు వీడియోలు ప్రచారంలో ఉన్నాయి.

మొదటి వీడియోలో విల్లు, బాణం పట్టుకున్న రాముడి విగ్రహం ఉంది. రెండవ వీడియోలో హనుమంతునితో పాటు రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు ఉన్నాయి.

వీడియో 1:

వీడియో లింకులు ఇక్కడ చూడొచ్చు


వీడియో 2:



Full View

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలు ప్రజలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. శ్రీరాముని విగ్రహాలకు సంబంధించిన వీడియోలు పాతవి.. దీపావళికి వివిధ మాల్స్‌లో ఇలా ప్రతిష్టించారు.

వీడియో 1:


మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను సంగ్రహించాం. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, నవంబర్ 2023లో “Shree Ram Ji theme this Diwali in Ambience mall I Diwali celebration in Gurgaon” అనే శీర్షికతో అప్లోడ్ చేసిన YouTube వీడియోను మేము కనుగొన్నాము.

వీడియోలో.. గుర్గావ్‌లోని ఆంబియెన్స్ మాల్‌లోని అలంకరణను మనం చూడవచ్చు.

Full View

గుర్గావ్‌లోని అంబియన్స్ మాల్‌లో దీపావళి అలంకరణలకు సంబంధించిన వీడియో కోసం వెతికినప్పుడు, మేము వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని కనుగొన్నాము, అందులో ఆ అలంకరణను చూపించే వీడియోను కూడా గుర్తించాం. “ఆంబియన్స్ మాల్ గుర్గావ్‌లో దీపావళి అద్భుత ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభించండి” అనే శీర్షికతో ప్రచురించారు. కోల్‌కతా నుండి వచ్చిన ప్రతిభావంతులైన కళాకారులచే 22 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అందులో ఉంది. “Embark on a journey into the enchanting world of Diwali wonder at Ambience Mall Gurgaon. Behold the grandeur of a 22ft Lord Shri Ram figurine intricately fashioned by gifted artisans hailing from Kolkata.” అంటూ వీడియోను పోస్టు చేశారు.
అదే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో.. అదే మాల్‌లో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన అలంకరణకు సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేశారు.

వీడియో 2:

వీడియోలోని కీలక ఫ్రేమ్‌ల కోసం మేము సెర్చ్ చేసినప్పుడు ఈ విగ్రహాలను దీపావళికి లక్నోలోని ఫన్ రిపబ్లిక్ మాల్‌లో ఏర్పాటు చేసినట్లు మేము కనుగొన్నాము. హనుమంతుడితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలను మాల్ లో ఏర్పాటు చేశారు.

దీపావళి సందర్భంగా విగ్రహాల వీడియోను మాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజా పోస్ట్‌లను పరిశీలించగా క్రిస్మస్ వేడుకలలో భాగంగా భారీ క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడం కూడా గమనించవచ్చు.


కాబట్టి, వైరల్ అవుతున్న రెండు వీడియోలు క్రిస్మస్ వేడుకల సమయంలోనివి కావని మేము గుర్తించాం. భారతదేశంలోని రెండు వేర్వేరు మాల్స్‌లో దీపావళి సందర్భంగా చేసిన డెకరేషన్లు ఇవి. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. 
Claim :  Malls that sported decorated and illuminated conifers in December to mark Christmas are now bedecked with huge statues of Lord Rama
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News