ఫ్యాక్ట్ చెక్: మీరట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ప్రచారం సమయంలో దళితుడి ఇంట్లో భోజనం చేశారు

‘రామాయణం’ టీవీ సిరీస్‌లో భాగంగా రాముడి పాత్రను పోషించి దేశం మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్నారు అరుణ్ గోవిల్. ఆయన రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. రాజకీయాల ద్వారా కొత్త కెరీర్‌ ను ప్రారంభించారు.

Update: 2024-04-19 05:36 GMT

Arun goel

‘రామాయణం’ టీవీ సిరీస్‌లో భాగంగా రాముడి పాత్రను పోషించి దేశం మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్నారు అరుణ్ గోవిల్. ఆయన రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. రాజకీయాల ద్వారా కొత్త కెరీర్‌ ను ప్రారంభించారు. ఆయన తన సొంత ఊరు మీరట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మీరట్ నగరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆయన దళితుల ఇంటిలో భోజనం చేయలేదనే వాదనతో వీడియోను పోస్టు చేశారు. ఆయన ఆహారం ఉన్న ప్లేట్ ముందు కూర్చున్నా.. ఆయన తినలేదని ప్రచారం చేస్తున్నారు. తన చుట్టూ కూర్చున్న వ్యక్తులు భోజనం చేస్తున్నప్పుడు.. ఆయన ఇతరులతో మాట్లాడటం, చేతులు జోడించి కూర్చోవడం వంటివి చేయడాన్ని చూడవచ్చు. ఎన్నికల ప్రచారంలో దళితుడి ఇంట్లో తిండి ముట్టుకోలేదన్న వాదనతో వీడియోను వైరల్ చేస్తున్నారు. శబరి ఇచ్చిన కాయలు తిన్న రాముడి పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు దళితుడి ఇంట్లో భోజనం చేయలేక పోతున్నాడంటూ సెటైర్లు వేస్తూ వీడియోను పంచుకున్నారు.

“मेरठ जनपद से BJ Party के लोकसभा प्रत्याशी अरुण गोविल जी वाल्मीकि कार्यकर्ता के घर 'भोजन दर्शन' करने पहुंचे। भगवान श्री
राम ने त्रेता युग में शबरी के झूठे बेर खाए थे और यह 2024 में दलित के घर का भोजन नहीं खा पा रहे ।@JaipurDialogues @MrSinha_” అంటూ పలువురు హిందీలో పోస్టులు పెట్టారు.



Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బీజేపీ నేత తన ఎన్నికల ప్రచారంలో దళితుడి ఇంట్లో భోజనం చేసిన వీడియోను ఎడిట్ చేశారు.

మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. ఆయన ఎన్నికల ప్రచారంలో దళితుడి ఇంట్లో భోజనం చేస్తున్న చిత్రాలను కొన్ని సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. మీరట్‌లోని భగవత్ పురా బూత్ ప్రెసిడెంట్ నీతూ జాతవ్, అరుణ్ మచల్ వాల్మీకి ఇంట్లో ఆయన భోజనం చేసినట్లు తేలింది.

Full View
ETV భారత్ ప్రచురించిన వార్తా నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 13, 2024 న అరుణ్ గోవిల్ ఓటర్లను ఆకర్షించడానికి నగరంలోని బ్రహ్మపురిలోని భగవత్‌పురా ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దళిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వారి ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు.. మహిళలు అరుణ్ గోవిల్‌కు హారతి ఇచ్చారు. అదే సమయంలో ఆయన ఒక ఇంట్లో భోజనం చేశారు.
News18 UP Uttarakhand కూడా అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. “Loksabha Election 2024: दलित के घर खाना खाते दिखे रामायण के राम, देखें वीडियो... | Arun Govil” అంటూ దళిత కుటుంబాన్ని సందర్శించిన సందర్భంగా అరుణ్ గోవిల్ భోజనం చేస్తున్న వీడియోను ప్రచురించింది.

Full View
కాబట్టి, బీజేపీ మీరట్ అభ్యర్థి అరుణ్ గోవిల్ దళితుడి ఇంట్లో భోజనం చేయలేదన్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఎడిట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అరుణ్ గోవిల్ దళితుడి ఇంట్లో భోజనం చేశారు.
Claim :  బీజేపీ మీరట్ అభ్యర్థి అరుణ్ గోవిల్ ప్రచారంలో భాగంగా దళితుడి ఇంట్లో భోజనం చేయలేదని వీడియో చూపిస్తుంది
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News