నిజ నిర్ధారణ: మెస్సీ కటౌట్‌ను సముద్రగర్భంలో ఉంచింది లక్షద్వీప్‌లోని ఫుట్బాల్ అభిమానులు, కేరళ అభిమానులు కాదు
ఫీఫా ప్రపంచ కప్ 2022 ఖతార్‌లోని 5 నగరాల్లో 32 జట్లు ఆడాయి. ఖతార్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ఫిఫా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఫీఫా ప్రపంచ కప్ 2022 ఖతార్‌లోని 5 నగరాల్లో 32 జట్లు ఆడాయి. ఖతార్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ఫిఫా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఆరాధించడం ప్రారంభించారు.
ఇదే నేపధ్యంలో, ఒక వీడియో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన ఫుట్‌బాల్ అభిమానులు కోరల్ దిబ్బల మధ్య సముద్రంలో ఆర్జెంటీనా ఆటగాడు మెస్సీ భారీ కటౌట్‌ను ఉంచారంటూ ఈ వీడియో పేర్కొంటొనది. వైరల్ వీడియోపై క్యాప్షన్ ఇలా ఉంది: “కేరళవారు, తాము క్రేజీ ఫుట్‌బాల్ అభిమానులమని నిరూపించారు… అర్జెంటీనా ప్రపంచ కప్ గెలివగా మెస్సీ కటౌట్‌ను సముద్రపు దిబ్బల మధ్య ఉంచుతామని వారు వాగ్దానం చేశారు, అలాగే చేసారు… మెస్సీ కేరళను సందర్శించాలని నేను భావిస్తున్నాను…"
ఈ క్లెయిమ్ ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్‌లో వైరల్ అవుతోంది.
https://www.facebook.com/
https://www.facebook.com/
https://www.facebook.com/
నిజ నిర్ధారణ:
క్లెయిమ్ తప్పుదారి పట్టించేది. మెస్సీ కటౌట్‌ను కేరళలో కాకుండా లక్షద్వీప్‌లోని అభిమానులు సముద్రంలో స్తిరపరిచారు.
జాగ్రత్తగా గమనించగా, వీడియోలో లక్షద్వీప్ వ్లాగర్ అనే లోగోను చూడవచ్చు. వీడియోలోని స్పీకర్ కూడా లక్షద్వీప్ రాజధాని నగరం అయిన కవరత్తి అని పలుమార్లు అనడం వినవచ్చు.
"లక్షద్వీప్ వ్లాగర్" అనే పదబంధాన్ని సెర్చ్ చేసినప్పుడు, మహమ్మద్ స్వాదీఖ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లభించింది.
ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, అనేక వీడియోలు మెస్సీ కటౌట్‌ను చూపించాయి, అతను షేర్ చేసిన వైరల్ వీడియోను కూడా చూడవచ్చు.
అదే వీడియోను మలయాళంలో “കടലാഴത്തിൽ മെസ്സി എത്തിയ കഥ | Lakshadweep Vlogger | Lionel Messi | | Iype Vallikadan " అంటూ యూట్యూబ్ లో షేర్ చేసారు, దీనిని అనువదించినప్పుడు "మెస్సీ సముద్రగర్భానికి చేరిన కథ" అని అర్థం తెలుస్తోంది
ఫర్స్ట్ పోస్ట్.కాం ప్రకారం, క్రొయేషియాతో అర్జెంటీనా సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు, మహమ్మద్ స్వాదిఖ్ అనే స్థానిక వ్లాగర్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా లెజెండ్ కటౌట్‌ను సముద్రంలో స్థపిస్తానంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఆర్జెంటీనా ఫైనల్ లో గెలవగానే అతని స్నేహితులతోపాటు, అతను అర్జెంటీనా ఆటగాడి మూడు-అడుగుల ఎత్తు గల కటౌట్ ను కనీసం 100 అడుగుల నీటి అడుగున స్థాపించాడు. వారు మిషన్‌ను సాధించడానికి స్కూబా డైవర్ల సహాయం తీసుకున్నారు. మెస్సి కటౌట్ నీటిలో పాడవకుండా వాటర్ ప్రూఫ్ పదార్థాలతో నిర్మించబడింది, చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని స్వాదిఖ్ వెల్లడించాడు.
కనుక, వైరల్ వీడియో లక్షద్వీప్‌లోని కవరట్టిలో తీసారు, లక్షద్వీప్‌లోని మెస్సీ అభిమానులు ఆయన కటౌట్ ను సముధ్రంలో నిలపడం చూపుతోంది కానీ కేరళ నుండి కాదు.