ఫ్యాక్ట్ చెక్: మోదీ బంగారు ప్రతిమను సూరత్‌లో ఏర్పాటు చేశారు.. అంతే కానీ సౌదీలో కాదు
సౌదీ అరేబియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారు ప్రతిమను ఏర్పాటు చేశారంటూ
సౌదీ అరేబియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారు ప్రతిమను ఏర్పాటు చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అనేక యూట్యూబ్ ఛానెల్‌లు, ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ వీడియో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని ఆభరణాల అంగడిలో ఉంది.
మేము వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లకు సంబంధించిన అనేక నివేదికలను కనుగొన్నాము.
సూరత్ నగరానికి చెందిన ఒక స్వర్ణకారుడు ప్రధాని నరేంద్ర మోదీ బంగారు విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొంటూ హిందీలో Amarujala.com లో కథనాలను ప్రచురించడం మేము కనుగొన్నాము. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారంతో చేసిన విగ్రహం బరువు 156 గ్రాములు ఉందని నివేదికలు తెలిపాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు గుర్తుగా ఆ నగల వ్యాపారి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.
జనవరి 20, 2023న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన బసంత్ బోహ్రా, 20 సంవత్సరాల క్రితం సూరత్‌లో స్థిరపడ్డారు. రాధికా చైన్స్ సంస్థ యజమాని. ఆయన 4.5-అంగుళాల పొడవు, 3-అంగుళాల వెడల్పు ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బంగారు ప్రతిమను తయారు చేయించారు. ఈ ప్రతిమ బరువు 156 గ్రాములు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో BJP గెలుచుకున్న 156 స్థానాలకు గుర్తుగా ఆ బరువు ఉందని బసంత్ బోహ్రా తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను 156 స్థానాలను బీజేపీ గెలుచుకున్నట్లు ఎన్‌డీటీవీ నివేదిక పేర్కొంది. దానికి అనుగుణంగానే, ప్రధాని మోదీ బంగారు విగ్రహం బరువు156 గ్రాములుగా ఉందని ఆభరణాల తయారీ యూనిట్ రాధికా చైన్స్ యజమాని బసంత్ బోహ్రా తెలిపారు.
ఈ ప్రతిమ జనంలో మంచి హిట్ గా మారింది. చాలా మంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు, అయితే విక్రయించకూడదని యజమాని నిర్ణయించుకున్నారు.
నరేంద్ర మోదీ బంగారు ప్రతిమకు సంబంధించిన వీడియో గుజరాత్‌లోని సూరత్‌కు చెందినది. సౌదీ అరేబియాకు చెందినది కాదు.

Claim : A video showing the Golden bust of Indian Prime Minister Narendra Modi on a revolving stand is installed in Saudi Arabia
Claimed By : Social media users
Fact Check : Misleading