ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఎంపీ లు మోదీ పేరును పలకలేదు
బలూచిస్థాన్ పాకిస్తాన్ నైరుతిలో ఉన్న ఒక ప్రావిన్స్. ఇది పాకిస్థాన్ భూభాగంలోనే అతిపెద్ద ప్రావిన్స్.. ఆ దేశ భూభాగంలో 44% ఉంది. బలూచిస్థాన్‌లో స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్న బలూచ్ ప్రజలకు భారత్ మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తూ ఉంది.

పాకిస్థాన్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా బలూచిస్థాన్‌కు చెందిన సభ్యులు మోదీ అనుకూల నినాదాలు చేశారనే వాదనతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“పాకిస్థాన్ పార్లమెంట్ లో మోదీ మోదీ మోదీ మోదీ... నినాదాలు చేసిన బలూఛిస్తాన్ ఎంపీలు. పాకిస్తాన్ పార్లమెంట్ లో మారుమోగిన మోడీ మోడీ నినాదం చేసిన బలోచిస్తాన్ ఎంపీలు.. పాకిస్తాన్ నుండి వేరుపడుతాం.. మోడీ బలోచిస్తాన్ ను పాకిస్తాన్ నుండి మమ్మల్ని వేరు చేయాలని వేడుకోలు. మన శత్రుదేశం అయిన పాకిస్థాన్ కూడ. మన మోడీ గారిని పొగడుతూ ఉoటే ఇక్కడున్న కొందరు దళారి, బ్రోకర్, చెంచా, లోపర్ గాళ్లకు నరేంద్రుని గొప్పతనం, నిజాయితీ తెలియడం లేదు .... జై శ్రీరామ్” అంటూ పోస్టులు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో 2020 సంవత్సరం నుండి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.మేము వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ వీడియో 2020 నుండి వైరల్ అవుతోందని మేము కనుగొన్నాము. “పాకిస్తాన్ పార్లమెంట్ బలూచిస్తాన్ మోడీ” వంటి కీ వర్డ్స్ ను ఉపయోగించడం ద్వారా మేము YouTube వీడియోను కనుగొన్నాము. అక్టోబర్ 26, 2020న 92 న్యూస్ HD వీడియోను అప్లోడ్ చేసింది. “Shah Mehmood Qureshi Speech in National Assembly | 26 October 2020 | 92NewsHD”. అనే టైటిల్ తో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వీడియోలో సభలోని సభ్యులు 'ఓటింగ్ ఓటింగ్' అని నినాదాలు చేయడం మనం స్పష్టంగా వినవచ్చు. స్పీకర్, విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ఓటింగ్ జరుగుతుందని, అయితే ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పి సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
BBC.com ప్రకారం, పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు ఖ్వాజా ఆసిఫ్, ఇతర ఎంపీలతో కలిసి.. మొహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద కార్టూన్స్ వేసిన ఘటనను ఖండిస్తూ తీర్మానంపై ఓటింగ్ కు ముందుకు రావాలని కోరారు. చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ సభను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగా.. ప్రతిపక్ష సభ్యులు మంత్రిని మాట్లాడనివ్వకుండా "ఓటింగ్ ఓటింగ్" అని నినాదాలు చేయడం ప్రారంభించారు.
ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఇబ్బంది పెట్టేందుకు పాక్ పార్లమెంట్‌లో పలువురు నేతలు మోదీ అనుకూల నినాదాలు చేశారనే వాదనతో రెండు నిమిషాల చిన్న వీడియోను భారత మీడియాలో ప్రసారం చేశారని ఆ కథనం పేర్కొంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పాక్ పార్లమెంట్ సభ్యులు సభలో మోదీ అనుకూల నినాదాలు చేయలేదు. ‘ఓటింగ్ ఓటింగ్’ అంటూ మాత్రమే ఆ వీడియోలో నినాదాలు చేశారు.
Claim : Balochistan leaders raised pro-Modi slogans in Pakistan’s National Assembly in the viral video
Claimed By : Social media users
Fact Check : False