ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్ కలిసి బైద్యనాథ్ ఆలయంలో పూజలు చేశారా? లేదు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బైద్యనాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న చిత్రం వైరల్‌గా షేర్ చేయబడుతోంది, ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి ముందు ఇద్దరూ శక్తి బదిలీకి ప్రతీక గా ఈ పూజ ను జరిపారంటూ ఈ చిత్రం షేర్ చేయబడుతోంది.

Update: 2022-07-27 05:31 GMT

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బైద్యనాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న చిత్రం వైరల్‌గా షేర్ చేయబడుతోంది, ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి ముందు ఇద్దరూ శక్తి బదిలీకి ప్రతీక గా ఈ పూజ ను జరిపారంటూ ఈ చిత్రం షేర్ చేయబడుతోంది.

మైఇండ్ మీడియా.కాం వైరల్ చిత్రాన్ని పంచుకుంటూ ప్రచురించిన కథనం "రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఝార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యనాథ్ ను సందర్శించారు. రేపటితో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి హోదాలో ఝార్ఖండ్ లో ఆయన చివరి పర్యటన ఇది అని చెప్పవచ్చు. అయితే బైద్యనాథుడి దర్శనానికి వెళ్తూ ఆయన కాబోయే రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి బాబా బైద్యనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 25న ముర్ము భారత రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు".

https://myindmedia.com/kovind-murmu-visited-baba-baidyanath/?fbclid=IwAR3yKNG-T_FXXy1_Tt1ex-DOCvTWDawyE6RRXtk6J_G9ggVh9C3C3JYufr8

అదే చిత్రాన్ని హిందీ లో "#विरासत सौंपना या सत्ता हस्तांतरण करना, अपने आप में एक यज्ञ होता है। यज्ञ देवों और महादेव के साक्षित्व में होता है। हस्तांतरण के ये क्षण, इन क्षणों के भाव, अंतर्भाव और वातावरण ही इतिहास लिखते हैं। राष्ट्रपति पद का हस्तांतरण देखिए , वैदिक प्रतिबद्धता प्रथमतः हो रही है..." కధనం తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దీనిని తెలుగులోకి తర్జుమా చేయగా "వారసత్వాన్ని అప్పగించడం లేదా అధికార మార్పిడి అనేది ఒక త్యాగం. యాగం దేవతలు, మహాదేవుల సమక్షంలో జరుగుతుంది. ఈ క్షణాలు చరిత్రను వ్రాస్తాయి. ప్రెసిడెన్సీ బదిలీ చూడండి, ముందుగా వైదిక నిబద్ధతతో జరుగుతోంది"

Full View


Full View





నిజ నిర్ధారణ:

దేశ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్‌తో కలిసి బైద్యనాథ్ ఆలయంలో పూజలు చేస్తున్నట్టు ఒక చిత్రం వైరల్ అవుతోంది. అయితే, ఈ క్లెయిం అబద్దం.

గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఈ చిత్రం 2020 సంవత్సరానికి చెందినది అని తెలుసుకున్నాం. ఇది ఫిబ్రవరి 2020లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జార్ఖండ్‌లోని డియోఘర్‌ను సందర్శించినప్పుడు తీసినది. ఆ సమయంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న ద్రౌపది ముర్ము కూడా ఆయన వెంట దేవాలయానికి వచ్చారు.

నివేదికల ప్రకారం, ఆయన ఎయిర్ ఫోర్స్ విమానంలో డియోఘర్ చేరుకున్నాడు. విమానాశ్రయంలో మంత్రి బాదల్ పత్రలేఖ్ ఆయనకు స్వాగతం పలికారు. వారి వెంట గవర్నర్ ద్రౌపది ముర్ము కూడా ఉన్నారు.

రాష్ట్రపతి బైద్యనాథ్ ఆలయానికి చేరుకుని దేశం సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

https://post2pillar.com/nation/president-ramnath-kovind-worship-inlord-shiva-deoghar-mandir-in-jharkhand/

ఫిబ్రవరి 2020లో అన్ని ప్రచురణలు వైరల్ చిత్రాన్ని షేర్ చేయడం మనం చూడవచ్చు.

https://www.jagran.com/jharkhand/dhanbad-president-of-india-ramnath-kovind-visit-baba-baidynath-bandi-deoghar-today-20073032.html

డియోఘర్‌ను సందర్శించిన మూడవ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ చరిత్ర లో నిలిచారంటూ వార్తా నివేదికలు పేర్కొన్నాయి. గతంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రెండుసార్లు రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాబా బైద్యనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

https://www.prabhatkhabar.com/state/jharkhand/deogarh/president-ramnath-kovind-worships-baba-vaidyanath-temple-in-deoghar-during-his-jharkhand-visit

ఫిబ్రవరి 29, 2020న ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన రామనాథ్ కోవింద్ ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను కూడా మనం చూడవచ్చు.

https://www.etvbharat.com/english/national/state/jharkhand/president-prays-for-nations-happiness-and-prosperity-at-baidyanath-temple/na20200229225427704

అందువల్ల, షేర్ చేయబడిన చిత్రం పాతది, తప్పుడు కధనం తో వైరల్ అవుతోంది. ద్రౌపది ముర్ము 2020లో జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో రాష్ట్రపతి హోదాలో ఉన్న రామ్‌నాథ్ కోవింద్ ఆలయాన్ని సందర్శించినప్పుడు తీసిన చిత్రాన్ని అబద్దపు కధనం తో పంచుకుంటున్నారు.


Claim :  Murmu and Former President Kovind perform Puja in Baidyanath Temple before her oath-taking ceremony
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News