ఫ్యాక్ట్ చెక్: ఏపీ ఎన్నికల ఫలితాలపై సౌత్ ఫస్ట్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ సర్వే నిర్వహించలేదు

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4, 2024న జరుగుతుంది.

Update: 2024-03-20 05:17 GMT

South first survey

ఎన్నికల తేదీలు విడుదల కావడంతో ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు ప్రీ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీ పార్టీకి 121 - 134 సీట్లు వస్తాయని, టీడీపీకి 21-35 సీట్లు, JSP కేవలం 2-5 సీట్లు, బీజేపీ కేవలం ఒక స్థానానికి పరిమితమైందని సౌత్ ఫస్ట్– పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేగా పేర్కొంటున్న గ్రాఫిక్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

తెలుగులో టెక్స్ట్‌తో పాటు ‘way2news’ లోగో ఉన్న గ్రాఫిక్‌ను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే, వైఎస్సార్‌సీపీ 121-134 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ-జేఎస్పీ, బీజేపీ కూటమి 23-41 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని పోస్టుల ద్వారా తెలిపారు.

Full View

మరిన్ని లింకులు ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్ ఎలాంటి సర్వే నిర్వహించలేదు.
మేము సెర్చ్ చేసినప్పుడు.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ సౌత్ ఫస్ట్ కోసం ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించిందని మాత్రమే మేము కనుగొన్నాము. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు మాకు కనిపించలేదు.
సౌత్ ఫస్ట్ సోషల్ మీడియా హ్యాండిల్‌లను పరిశీలించినప్పుడు.. వైరల్ అవుతున్న వాదనలను కొట్టిపారేసినట్లు మేము కనుగొన్నాము. ఆంధ్రప్రదేశ్ కోసం సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ముందస్తు ఎన్నికల సర్వే అని చెబుతూ నకిలీ గ్రాఫిక్ ప్లేట్ వైరల్ అవుతోందని హెచ్చరించారు. సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ఆంధ్రాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించలేదని తెలిపింది. “A fake graphic plate claiming to be a pre-poll survey by @TheSouthfirst and Peoples Pulse for #AndhraPradesh is doing the rounds. South First, People’s Pulse has not carried out any pre-poll survey for Andhra so far. This image misusing South First's name is fake.” అంటూ పోస్టును మేము గమనించాం.
Way2News కూడా తాము ఈ కథనాన్ని ప్రచురించలేదని తెలిపింది. కొందరు కావాలనే తప్పుడు కథనాలను వైరల్ చేస్తున్నారని.. @way2news ద్వారా ఈ సర్వే గురించిన కథనాలను ప్రసారం చేయలేదని ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైఎస్సార్సీ పార్టీ విజయాన్ని అంచనా వేస్తూ సౌత్ ఫస్ట్ ఎలాంటి సర్వే నిర్వహించలేదు. వైరల్ అవుతున్న గ్రాఫిక్ ప్లేట్ ను ఎడిట్ చేశారు.
Claim :  South First- Peoples Pulse conducted a survey on the Andhra Pradesh Assembly election results, which revealed that the YSRC party will win about 134 seats
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News