ఫ్యాక్ట్ చెక్: రైలు పట్టాలు తప్పిన పాత వీడియోను ఇటీవల భివానీలో జరిగినదిగా వైరల్ పోస్టులు

భివానీలో రైలు పట్టాలు తప్పింది. పొలాల్లోకి వెళ్ళిపోయింది.

Update: 2024-08-16 10:02 GMT
భారతీయ రైల్వే ప్రతి రోజూ కొన్ని కోట్ల మందిని తమ తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల ఘటనలు ప్రయాణీకుల్లో భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎన్నో భద్రతా సమస్యలు ఉన్నాయని పలువురు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, జూలై 30న జార్ఖండ్‌లోని బారాబాంబూ సమీపంలో ముంబై-హౌరా రైలు ప్రమాదానికి గురికావడం ఆందోళనలను పెంచుతూ ఉంది. 291 మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన ఒడిశా బహనాగా ప్రమాదం ఇంకా ప్రజల మదిలో మెదులుతూ ఉంది.

ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఫోటో, వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇది చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. చిత్రంలో డబుల్ ఇంజిన్ రైలు పట్టాలు తప్పి వ్యవసాయ భూమిలో ఉన్నట్లు చూపిస్తుంది.

సోషల్ మీడియా వినియోగదారులు ఈ చిత్రాన్ని, వీడియోను "అన్‌బిలీవబుల్" అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. "రైలు పట్టాలు తప్పడంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఏదైనా రికార్డు సృష్టించాలనుకుంటుందా?? ఇప్పుడు భివానీలో రైలు పట్టాలు తప్పింది. పొలంలోకి ప్రవేశించింది. జైపూర్ మార్గంలో 8 రైళ్లు రద్దు చేశారు." అంటూ వీడియోను వైరల్ చేశారు.




ट्रेन से खेत जोतने वाला पहला देश बना भारत. धन्यवाद @AshwiniVaishnaw जी. #TrainAccident అంటూ ట్వీట్ కూడా చేశారు. దేశంలో రైళ్లు ఏకంగా పొలాల్లో పరుగులు పెడుతున్నాయంటూ వైరల్ పోస్టుల్లో సెటైర్లు వేస్తున్నారు.




సోషల్ మీడియా వినియోగదారులే కాదు.. తమ యూట్యూబ్ ఛానెల్‌లో 13.2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న న్యూస్9 లైవ్ సంస్థ, ఆగస్టు 8న ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది.. భివానీ రైలు ప్రమాదం అంటూ తమ యూట్యూబ్ ఛానెల్‌లో అదే వైరల్ చిత్రాన్ని అప్‌లోడ్ చేసింది.

Full View




 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము కనుగొన్నాము. ఈ రైలు ప్రమాదం ఇటీవలిది కాదు.. భివానీలో జరిగింది కూడా కాదు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో 'రైల్ టేల్స్ - తమిళ్' అనే పేరు గల X ఖాతా సెప్టెంబర్ 4, 2022న అదే వైరల్ ఫోటోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.



దీన్ని బట్టి.. వైరల్ చిత్రం 2022 నుండి ఇంటర్నెట్‌లో ఉందని మేము గుర్తించాం.

జర్నలిస్ట్ రాజేంద్ర బి.అక్లేకర్ సెప్టెంబర్ 4, 2022న “పొలాల్లోకి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్‌లలో ఒకటి WAG-9 క్లాస్ దూసుకు వెళ్లింది" అని తెలిపారు. షోలాపూర్ సమీపంలో ఇది జరిగిందని ఆయన పోస్టు ద్వారా తెలుసుకున్నాం.



మేము “Goods Engine Derail in Solapur Section” కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. సెప్టెంబర్ 4, 2002న Patrika లో “सोलापुर में पटरी से उतरी मालगाड़ी, ट्रैक छोड़कर खेत में जा घुसा इंजन, कोई हताहत नहीं” I అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారని గుర్తించాం. టైటిల్ ను బట్టి.. ఈ ఘటన మహారాష్ట్ర లోని సోలాపూర్ లో చోటు చేసుకుంది.. ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది.

కథనంలో “షోలాపూర్ జిల్లా కర్మలా తాలూకా గ్రామంలో షోలాపూర్ నుండి పూణే వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం.. సిమెంట్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు కోచ్‌లతో పాటు రెండు ఇంజన్లు పట్టాలు తప్పాయి. ఘటన తర్వాత రైలు ఇంజన్ వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ముంబై నుంచి కర్ణాటక వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఎమర్జెన్సీ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. ట్రాక్‌కు మరమ్మతులు చేసి ఇంజన్‌, కోచ్‌లను మళ్లీ ట్రాక్‌పై ఉంచే పనులు జరుగుతున్నాయి. పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్ల షెడ్యూల్‌పై ప్రభావం పడింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు లూప్ ట్రాక్‌పై ఉంది. అదే రోజు ఉదయం 6:40 గంటలకు ఈ మార్గంలో రైలు రాకపోకలు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు నివేదించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు” అని ఉంది.

సెప్టెంబరు 4, 2022న, ABP మఝా తమ యూట్యూబ్ ఛానెల్‌లో “సోలాపూర్‌లో గూడ్స్ రైలు ప్రమాదం” శీర్షికతో ఒక వీడియోను అప్‌లోడ్ చేసారు.

Full View


మా సెర్చ్ ఆపరేషన్ లో ఆగస్టు 8, 2024, షోలాపూర్ DRM “आज सोलापूर मण्डल पर ऐसी कोई घटना नहीं घटित हुई है। यह २०२२ की घटना है। कृपया ऐसी भ्रामक पोस्ट ना डाले। इनसे भारतीय रेल्वे के १२ लाख कर्मियों का हौसला कम ना करे”। అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

షోలాపూర్ డివిజన్‌లో నేడు అలాంటి ఘటన జరగలేదు. ఇది 2022 నాటి సంఘటన. దయచేసి ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని పోస్ట్ లు చేయవద్దు. అలా చేయడం ద్వారా భారతీయ రైల్వేలోని 12 లక్షల మంది ఉద్యోగులను నిరుత్సాహపరచవద్దని అందులో ఉంది.



వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉంది. హర్యానాలోని భివానీలో జరిగిన ఘటన కాదు.. 2022లో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఈ రైలు ప్రమాదం జరిగింది.


Claim :  భివానీలో రైలు పట్టాలు తప్పింది. పొలాల్లోకి వెళ్ళిపోయింది. ఈ కారణంగా జైపూర్ మార్గంలో 8 రైళ్లను రద్దు చేశారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News