ఫ్యాక్ట్ చెక్: యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్ లో అసదుద్దీన్ ను కూర్చోండి అంటూ గట్టిగా అరిచారా..?
యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్ లో అసదుద్దీన్ ను కూర్చోండి అంటూ చెబుతున్న వీడియో వైరల్
క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్ లో అసదుద్దీన్ ను కూర్చోండి అంటూ చెబుతున్న వీడియో వైరల్
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. వీడియోను ఎడిట్ చేశారు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్నా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చుట్టూ సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. పలు వీడియోలు పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీటిలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా చూపించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆయన పార్లమెంటులో ప్రసంగిస్తూ కనిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, యోగి ఆదిత్యనాథ్ దూకుడైన వ్యాఖ్యల కారణంగా ఒవైసీ నిశ్శబ్దంగా కూర్చున్నాడని పలువురు వినియోగదారులు పేర్కొన్నారు.
24 సెకన్ల నిడివి ఉన్న వైరల్ వీడియోలో, ఒవైసీ చూస్తూ ఉండగా యోగి హిందీలో మాట్లాడుతున్నట్లు కనిపించింది. వీడియో ఎడిట్ చేయబడినందున ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేదిగా ఉన్నాయి. యోగి ఒవైసీకి మధ్య వ్యాఖ్యలకు సంబంధించి.. కనీసం మూడు నిమిషాల తేడా ఉన్న రెండు సన్నివేశాలను మెర్జ్ చేశారు.
నిజ నిర్ధారణ:
2017 మార్చిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుండి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఉన్నారు. కాబట్టి వీడియో ఆ కాలం నాటిదని భావించవచ్చు.మేము కొన్ని కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. BJP అధికారిక YouTube ఛానెల్ ద్వారా అప్‌లోడ్ చేయబడిన అసలైన పూర్తి-నిడివి వీడియోను కనుగొన్నాము. ఇది ఆగస్టు 14, 2014న అప్‌లోడ్ చేయబడింది. ఆ ప్రసంగం పార్లమెంటు వర్షాకాల సెషన్‌లోనిదని తెలుసుకున్నాం.
పూర్తి నిడివి గల వీడియోలో.. యోగి తన ప్రసంగాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను వినవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ఒవైసీపై అరిచినట్లు ఆరోపించిన వైరల్ భాగం వీడియోలో 10 నిమిషాలకు వస్తుంది (10.20).
అయితే ఆదిత్యనాథ్‌ను ఒవైసీ అడ్డుకోలేదని గమనించాం. 10.27కి "బైత్ జైయే ఆప్" అని అరిచే సమయంలో కెమెరా కాంగ్రెస్ ఎంపీల బెంచ్ వైపు ఉంచారు.
ఈ సన్నివేశం తర్వాత దాదాపు 3 నిమిషాల తర్వాత ఒవైసీ చేతిలో పుస్తకంతో ఏదో చెప్పాలనుకున్న పార్ట్ వస్తుంది.
13.30 సమయంలో ఒవైసీ మొదటిసారి లేచి, యోగి ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ, అల్లర్ల మృతుల గురించి బీజేపీ ఎంపీ తప్పుడు గణాంకాలను రూపొందించారని ఆరోపించారు. అప్పటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ ఎం తంబిదురై ఒవైసీని కూర్చోవాలని డిమాండ్ చేశారు. ఒవైసీ ఆయన ఆదేశాన్ని పాటించారు. ఒవైసీ 14.05 సమయంలో తిరిగి తన సీటులో కూర్చోవడం చూడవచ్చు.
తంబిదురై మీ వంతు వచ్చినప్పుడు ఈ విషయంపై మాట్లాడాలని ఒవైసీకి సూచించారు. ఒవైసీ మరింత వాదించడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు.. కానీ అసదుద్దీన్ మైక్రోఫోన్ పని చేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత, డిప్యూటీ స్పీకర్ యోగిని తన ప్రసంగాన్ని కొనసాగించాలని కోరారు.
పార్లమెంటులో యోగి చేసిన ప్రసంగం గురించి 2014 ఆగస్టు 14న ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన వార్తా నివేదికను కూడా మేము కనుగొన్నాము. గోరఖ్‌పూర్‌కు చెందిన నాటి ఎంపీ, పాకిస్తాన్ కోరిక మేరకు భారత్‌ను మళ్లీ విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు.
దీన్నిబట్టి యోగి 'బైట్ జైయే ఆప్' అన్నప్పుడు ఒవైసీని ఉద్దేశించి కాదు.. కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి చెప్పినట్లు స్పష్టమవుతోంది.
క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్ లో అసదుద్దీన్ ను కూర్చోండి అంటూ గట్టిగా అరిచారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : While delivering a speech, Yogi Adityanath shouted at Asaduddin Owaisi by saying “baith jaiye aap.” Owaisi promptly complied.
Claimed By : Social Media Users
Fact Check : False