ఫ్యాక్ట్ చెక్: గాయాలతో ఉన్న రిషబ్ పంత్ ను మహేంద్ర సింగ్ ధోని కలవలేదు.. వైరల్ ఫోటో మార్ఫింగ్ చేసినది
కారు ప్రమాదంలో గాయపడిన భారత క్రికెటర్ రిషబ్ పంత్ ను ఉత్తరాఖండ్‌లోని ఆసుపత్రిలో.. భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పరామర్శించాడని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు.
కారు ప్రమాదంలో గాయపడిన భారత క్రికెటర్ రిషబ్ పంత్ ను ఉత్తరాఖండ్‌లోని ఆసుపత్రిలో.. భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పరామర్శించాడని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మా ఫ్యాక్ట్ చెక్ టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, వైరల్ చిత్రాలు మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు. అసలు చిత్రంలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఉన్నారు. దుబాయ్‌లోని ఆసుపత్రిని సందర్శించినప్పటి ఫోటోలు ఇవని తెలుసుకున్నాం.
ది పెనిన్సులా ఖతార్ నివేదిక ప్రకారం, మే 2017లో, షారుఖ్ ఖాన్ అల్ జలీలా చిల్డ్రన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ - UAE లోని మొట్టమొదటి పీడియాట్రిక్ హాస్పిటల్‌ను సందర్శించారు. షారుఖ్ ఆ సమయంలో దుబాయ్ టూరిజం కోసం తన #BeMyGuest షూటింగ్ లో భాగంగా దుబాయ్‌లో ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో కొంత సేపు ఉండి.. పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వైరల్ ఫోటో ధోని, పంత్ చిత్రాన్ని కలిపి మార్ఫింగ్ చేశారు
దుబాయ్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారు. UAE ఇయర్ ఆఫ్ గివింగ్ స్ఫూర్తికి అనుగుణంగా షారుఖ్ ఖాన్ మే 7, 2017న అల్ జలీలా చిల్డ్రన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించినట్లు స్పష్టంగా పేర్కొంది. దుబాయ్ ప్రభుత్వ పత్రికా ప్రకటన
పంత్ ప్రమాదానికి గురైన ఫోటోలను అనేక మీడియా సంస్థలు ఉపయోగించాయి. ఆ ఫోటోను తీసుకుని ఎడిట్ చేశారు.. షారుఖ్ ఖాన్ స్థానంలో ధోని ఉండేలా ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
అంతేకాకుండా, ఆసుపత్రిలో ధోని పంత్‌ను కలిసినట్లు విశ్వసనీయమైన వార్తా నివేదికలు కూడా ఏవీ లేవు.
ఆసుపత్రిలో ధోని పంత్‌ను కలిశాడనే ఎటువంటి ఆధారాలు లేవు.. వైరల్ పోస్టులను తప్పు అని స్పష్టం చేస్తున్నాం.
అంతేకాకుండా, ఆసుపత్రిలో ధోని పంత్‌ను కలిసినట్లు విశ్వసనీయమైన వార్తా నివేదికలు కూడా ఏవీ లేవు.
ఆసుపత్రిలో ధోని పంత్‌ను కలిశాడనే ఎటువంటి ఆధారాలు లేవు.. వైరల్ పోస్టులను తప్పు అని స్పష్టం చేస్తున్నాం.
Claim : MS Dhoni visited Rishabh Pant in the hospital after he was injured in a car crash
Claimed By : Facebook Users
Fact Check : False