ఫ్యాక్ట్ చెక్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనలేదు
2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో 65.5% ఓటింగ్ నమోదైంది. ఫేజ్ 1లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో 65.5% ఓటింగ్ నమోదైంది. ఫేజ్ 1లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. "భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు" అనే క్యాప్షన్‌తో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియో వైరల్ అవుతూ ఉంది.
Full View
ఇదే వీడియోను “कांग्रेस के सम्मान में अल्लू अर्जून मैदान में। “ హిందీ క్యాప్షన్ లో కూడా షేర్ చేస్తున్నారు.
ఇదే వీడియోను “कांग्रेस के सम्मान में अल्लू अर्जून मैदान में। “ హిందీ క్యాప్షన్ లో కూడా షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2022లో న్యూయార్క్ నగరంలో నిర్వహించిన ఇండియా డే పరేడ్‌లో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా పాల్గొన్నప్పటిది.మేము వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను సంగ్రహించి.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించాం. వివిధ వెబ్‌సైట్‌లలో ప్రచురించిన అనేక కథనాలను కనుగొన్నాం. వైరల్ అవుతున్న విజువల్స్ కు సంబంధించిన సారూప్య చిత్రాలను మేము కనుగొన్నాము.
NYC ఇండియా డే పరేడ్, న్యూయార్క్, NY, యునైటెడ్ స్టేట్స్ - 21 ఆగస్టు 2022 పేరుతో షట్టర్‌స్టాక్ చిత్రాలను పబ్లిష్ చేసింది. పరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా నటుడు అల్లు అర్జున్ న్యూయార్క్ నగరంలోని మాడిసన్ అవెన్యూలో వార్షిక ఇండియా డే పరేడ్ లో భాగమయ్యారు. ఇది ఆగస్టు 21, 2022న చోటు చేసుకుంది.
అల్లు అర్జున్ కు సంబంధించిన చిత్రాలను తెలుగు ఫిలింనగర్ X (ట్విట్టర్) ఖాతాలో అప్లోడ్ చేశారు. ప్రతిష్టాత్మకమైన ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ హాజరయ్యారు. న్యూయార్క్‌లో 5L కంటే ఎక్కువ మంది ప్రజలు అల్లు అర్జున్‌పై ప్రేమను కురిపించారు.
ఆగస్టు 22, 2022న 10tv.in ప్రచురించిన ఫోటో కథనం ప్రకారం.. అమెరికాలో భారత స్వాతంత్ర్య వేడుకల్లో అల్లు అర్జున్ అతిథిగా పాల్గొన్నారనే శీర్షికతో విజువల్స్ ను షేర్ చేశారు.
అల్లు అర్జున్ స్వయంగా న్యూయార్క్ పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలను X ఖాతాలో పంచుకున్నారు.
అల్లు అర్జున్ స్వయంగా న్యూయార్క్ పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలను X ఖాతాలో పంచుకున్నారు.
తెలుగు స్టార్ అల్లు అర్జున్ ను ఇటీవల న్యూయార్క్‌లో గ్రాండ్ మార్షల్‌గా ఆహ్వానించారు. 40వ వార్షిక ఇండియా డే పరేడ్‌కు హాజరయ్యారని NDTV నివేదిక పేర్కొంది. ఈ కార్యక్రమంలో.. నటుడు న్యూయార్క్ నగర మేయర్‌ని కూడా కలుసుకున్నారు.
ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకున్నారు. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా ఒక క్లిప్‌ను కూడా పంచుకున్నారు. అక్కడ ఈ ఈవెంట్ కు అనేక మంది హాజరయ్యారు.
వైరల్ అవుతున్న.. అల్లు అర్జున్ వీడియో పాతది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : పుష్ప ఫేమ్, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు
Claimed By : Social media users
Fact Check : False