నిజ నిర్ధారణ: ఫీఫా ప్రపంచ కప్ 2022 ప్రారంభోత్సవం సందర్భంగా పిల్లలు ఖురాన్ పఠించలేదు
కతార్‌లో జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుకలో పిల్లలు ఖురాన్ పఠిస్తున్నారనే వాదనతో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో పిల్లలు స్టేడియంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి శ్లోకాలు పఠించడం చూడొచ్చు.
కతార్‌లో జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుకలో పిల్లలు ఖురాన్ పఠిస్తున్నారనే వాదనతో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో పిల్లలు స్టేడియంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి శ్లోకాలు పఠించడం చూడొచ్చు.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు "కతార్ ఫిఫా ప్రపంచ కప్ 2022 |ఖతార్ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖురాన్ పఠిస్తున్న పిల్లలు తుమామా స్టేడియం || ప్రారంభోత్సవం [ఖతార్ ఫిఫా ప్రపంచ కప్] 2022" అనే శీర్షికతో వీడియోను షేర్ చేసారు.
నిజ నిర్ధారణ:
వాదన తప్పుదారి పట్టించేది. వీడియోలో కతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుకల దృశ్యాలు కనిపించవు. ఇది 2021లో తీసిన పాత వీడియో.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను సెర్చ్ చేసినప్పుడు, డిసెంబర్ 2021లో దోహా న్యూస్ ప్రచురించిన వీడియో లభించింది. ఇది అల్ తుమామా స్టేడియం ప్రారంభోత్సవాన్ని చూపుతుంది.
వీడియో క్యాప్షన్‌లో "ప్రపంచ కప్ అల్ తుమామా స్టేడియం ప్రారంభోత్సవంలో కతార్ తన ఇస్లామిక్ సంస్కృతిని ఈ విధంగా పొందుపరిచింది. పిల్లలు ఖురాన్ నుండి 'దయ'పై శ్లోకాలు పఠించడం కనిపించింది." అని ఉంది.
ఇదే వీడియోను దోహా న్యూస్ తన ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేసింది.
నివేదికల ప్రకారం, కతార్‌లో 8 స్టేడియాలు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రారంభ వేడుకలను అల్ బయాత్ స్టేడియంలో నిర్వహించగా, ఫైనల్ మ్యాచ్ లుసైల్ స్టేడియంలో జరగనుంది.
వైరల్ వీడియోలో కనిపించే అల్ తుమామా స్టేడియం డిసెంబర్ 10, 2022న ఆడబోయే క్వార్టర్-ఫైనల్‌తో సహా కొన్ని మ్యాచ్‌లను కూడా నిర్వహిస్తోంది.
కతార్‌లోని అల్ బయాత్ స్టేడియంలో జరిగిన ఫీఫా ప్రపంచ కప్ 2022 ప్రారంభ వేడుక ముఖ్యాంశాలను దిగువ లింక్‌లలో చూడవచ్చు.
https://www.fifa.com/fifaplus/
కనుక, స్టేడియంలో పిల్లలు ఖురాన్ పఠిస్తున్న వీడియో పాతది, ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుకలకు సంబంధించినది కాదు. వాదన తప్పుదారి పట్టించేది.