నిజమెంత: కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారా..?
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారా
క్లెయిమ్: ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారా
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. రాహుల్ కాంగ్రెస్ ఓడిపోయాక బ్యాడ్మింటన్ ఆడలేదు.
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం నాడు సోనియా గాంధీ అధ్యక్షత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నాలుగు గంటలకు పైగా సమావేశమైంది. గాంధీ కుటుంబం కారణంగా పార్టీ బలహీన పడుతోందన్న అభిప్రాయం చాలామందిలో ఉందని, సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉంటే త్యాగాలకు తాము సిద్ధంగా ఉన్నామని సోనియా గాంధీ ఈ కార్యక్రమంలో అన్నారు. సోనియా నాయకత్వంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే ఇచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ఈసారి శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 57 మందిని ఆహ్వానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పి.చిదంబరంతోపాటు జీ-23 కూటమిలోని నేతలైన గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, ఇతర నేతలు పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ రాహులే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ ఘోర ఓటమి చెందిన సమయంలో కూడా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారని చెబుతున్నారు. రాహుల్ ఇండోర్ కోర్టులో కొంతమంది పార్టీ నాయకులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులతో బ్యాడ్మింటన్ ఆడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో రాహుల్ షాట్‌లకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
"ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవమానాన్ని ఎదుర్కొన్న తర్వాత, రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్లు కనిపించారు", ఈ వీడియోను పంచుకుంటూ "ఉత్తమ హిందీ వార్తలు" అనే హిందీ ఫేస్‌బుక్ పేజీని ఉటంకించారు.
"ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవమానాన్ని ఎదుర్కొన్న తర్వాత, రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్లు కనిపించారు", అంటూ ఫేస్ బుక్ పేజీ "Best Hindi News" పోస్టు చేసింది.
పంజాబ్ కేసరి మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్' అధికారిక ఫేస్‌బుక్ పేజీ లో కూడా అదే వీడియోను పోస్టు చేశారు. హిందీలో ఒక క్యాప్షన్‌తో పాటు పోస్ట్ చేశారు. "రాహుల్ గాంధీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కొంచెం రిలాక్స్డ్ మూడ్‌లో కనిపించారు" అంటూ వీడియోను వైరల్ చేశారు.
"ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవమానాన్ని ఎదుర్కొన్న తర్వాత, రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్లు కనిపించారు", అంటూ ఫేస్ బుక్ పేజీ "Best Hindi News" పోస్టు చేసింది.
పంజాబ్ కేసరి మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్' అధికారిక ఫేస్‌బుక్ పేజీ లో కూడా అదే వీడియోను పోస్టు చేశారు. హిందీలో ఒక క్యాప్షన్‌తో పాటు పోస్ట్ చేశారు. "రాహుల్ గాంధీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కొంచెం రిలాక్స్డ్ మూడ్‌లో కనిపించారు" అంటూ వీడియోను వైరల్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మా బృందం ఈ వాదన నిజం కాదని గుర్తించింది. రాహుల్ గాంధీ ఫలితాలు వెలువడిన తర్వాత బ్యాడ్మింటన్ ఆడలేదు. మార్చి 10న కౌంటింగ్‌కు ఒక రోజు ముందు ఈ వీడియోను కేరళలో చిత్రీకరించారు.కొన్ని సంబంధిత కీ వర్డ్స్ సహాయంతో, ABP న్యూస్ ప్రచురించిన కథనాన్ని మేము చూశాము. వార్తా నివేదిక కవర్ చిత్రంలో రాహుల్ గాంధీ ఫోటోలను చూడొచ్చు. ఒకదానిలో రాహుల్ ఐస్‌క్రీమ్ ఎంజాయ్ చేస్తుండగా, మరో దానిలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని కనిపించారు
10 మార్చి 2022న ప్రచురించబడినప్పటికీ, ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే కేరళలో రాహుల్ ఈ పనులు చేశారు. హెడ్‌లైన్ లోనే ఈ విషయాలను స్పష్టంగా వివరించారు. మార్చి 9న రాహుల్ గాంధీ అధికారిక ఛానెల్ ప్రచురించిన YouTube వీడియోని కూడా మేము చూశాము. పోల్ ఫలితాలు ప్రకటించడానికి ఒక రోజు ముందు రాహుల్ గాంధీ ఈ పనులు చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
మలప్పురంలోని ఎర్నాడ్‌లోని సుల్లముస్సలాం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అరీకోడ్‌లోని కొత్త ఇండోర్ స్టేడియంలో రాహుల్ బ్యాడ్మింటన్ ఆటను ఆస్వాదించాడని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ పేజీ కూడా ఇదే వీడియోను మార్చి 9న అప్‌లోడ్ చేసింది.
దీన్నిబట్టి మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒకరోజు ముందు రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది.
క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, పేజీలు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Rahul Gandhi was seen playing Badminton after Congress faced a humiliating defeat in the assembly elections across 5 states.
Claimed By : Social Media Users
Fact Check : False